
ఎయిర్ మార్షల్ ఏకే భారతి
వంద మందికి పైగా ఉగ్రవాదులను చంపాము: త్రివిధ దళాలు
సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించిన భారత ఆర్మీ
ఆపరేషన్ సింధూర్ లో భాగంగా పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై మొదట నాశనం చేశామని త్రివిధ దళాలు తెలిపాయి. మొదట పంజాబ్ లోని మురిడ్కేలోని ఉగ్రవాద స్థావరాన్ని వైమానిక దాడుల ద్వారా ధ్వంసం చేశామని ఎయిర్ ఫోర్స్ ప్రతినిధి ఎయిర్ మార్షల్ ఏకే భారతి ప్రకటించారు.
అక్కడ ఒక్కచోటే నాలుగు శిబిరాలు ఉన్నాయని, అన్ని స్థావరాలను నేలమట్టం చేసినట్లు ఎయిర్ మార్షల్ వివరించారు. తాము కేవలం ఉగ్రవాద స్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపారు. దాడులు చేశాక వివరాలు పాకిస్తాన్ కు అందజేసినట్లు కూడా పేర్కొన్నారు.
పాకిస్తాన్ లోని మొత్తం తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేశామని వివరించారు. ఈ దాడుల్లో వందమందికి పైనే శిక్షణలో ఉగ్రవాదుల, వారి చీఫ్ లు మరణించారని వెల్లడించారు. ఈ దాడుల్లో పౌర ఆవాసాలకు ఎలాంటి నష్టం రాకుండా చూశామని ఆర్మీ వెల్లడించింది.
కానీ పాకిస్తాన్ మాత్రం కేవలం పౌర ఆవాసాలు, పాఠశాలలు, ఆలయాలను టార్గెట్ చేసి దాడులు చేసిందని, అలాగే ఆర్మీ కంటోన్మెంట్ లక్ష్యంగా యూఏవీలు ప్రయోగించిందని అన్నారు.
ఈ నెల 8, 9 తేదీలలో వరుసగా దాడులు చేసిందని అన్నారు. తరవాత భారత్ చేసిన ప్రతిదాడుల్లో 40 నుంచి 50 మంది పాక్ సైనికులు మృతి చెందారని తెలిపారు.
ఆపరేషన్ సిందూర్ లో భాగంగా ఐదుగురు భారత సైనికులు మృతి చెందారని డీజీఎంఓ రాజీవ్ ఘాయ్ తెలిపారు. ఈ దాడుల తరువాత మరోసారి భారత్ ను కవ్వించిందని మరోసారి దాడులు చేసి పాక్ లోని అన్ని ఆర్మీ స్థావరాలను ధ్వంసం చేసినట్లు వీడియో రూపకంగా దాడి జరిగిన ప్రాంతాలను ఆర్మీ వివరించింది. ఉగ్రవాదుల అంతిమ యాత్రలో ఎవరెవరు పాల్గొన్నారో ప్రపంచం మొత్తం చూసిందన్నారు.
పాక్ చేసిన ప్రతిదాడిని సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు ఆర్మీ తెలిపింది. పాక్ లోని కరాచీ పోర్ట్ దాడి చేసేందుకు నేవీని సిద్దంగా ఉంచామని మరోసారి కాల్పుల విరమణ చేస్తే ఫార్వార్డ్ పొజిషన్ లో మన నేవీ సిద్ధంగా ఉన్నామని నేవీ డీజీ ప్రమోద్ అన్నారు. మరోసారి ఎలాంటి కాల్పుల విరమణ చేసిన మేము ఎలాంటి దాడులు చేస్తామో వారు కూడా ఊహించలేరని హెచ్చరించారు.
మురిడ్కేలో దాడులు చేసిన సమయంలోనే వీడియోలు తీశామని, తమ పోరు కేవలం ఉగ్రవాదంపైనే అన్నారు. పాక్ పై చేసిన ప్రతిదాడిలో వారి వైమానిక దళాలను నేల కూల్చమాని, కానీ అవి ఎలాంటి విమానాలో వివరాలు వెల్లడించలేమని ఎయిర్ ఫోర్స్ అధికారి తెలిపారు.
అది కేవలం హైటెక్ విమానాలు మాత్రమే చెప్పగలమని వివరించారు. వాడిన ఆయుధాలు వివరాలు గురించి బయటకి చెప్పలేమని పేర్కొన్నారు. పాక్ పై చర్యలపై విషయంలో ప్రభుత్వం తమకు పూర్తి స్థాయి స్వేచ్ఛను ఇచ్చిందని పేర్కొన్నారు.
పాక్ చేసిన దాడిలో మన దేశానికి ఎలాంటి నష్టం జరగకుండా చూశామని చెప్పారు. పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించారు. పాకిస్తానే మొదట కాల్పుల విరమణ ఒప్పందం ప్రతిపాదించిందని, దానికి భారత్ అంగీకరించిందని చెప్పారు.
Next Story