మాట నిలబెట్టుకున్నాం. జమ్మూ కాశ్మీర్ వాసులకు విముక్తి కల్పించాం: మోదీ
x

మాట నిలబెట్టుకున్నాం. జమ్మూ కాశ్మీర్ వాసులకు విముక్తి కల్పించాం: మోదీ

ఇచ్చిన మాట నిలుపుకున్నామని, జమ్మూ కాశ్మీర్ ప్రజల దీర్ఘకాల బాధలకు ముగింపు పలుకుతామన్న హామీని నిలబెట్టుకున్నామని మోదీ అన్నారు.


‘‘దశాబ్దాల బాధలకు విముక్తి కల్పించాం. ఉగ్రవాదం, వేర్పాటువాదాన్ని కుకటివేళ్లతో పెకిలించాం. అభివృద్ధి ఎలా ఉంటుందో జమ్ము, కాశ్మీర్ వాసులకు చూయించాం’’ అని పేర్కొన్నారు ప్రధాని మోదీ.

ఉధమ్‌పూర్ లోక్‌సభ స్థానం కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ ఎన్నికల బరిలో దిగారు. ఆయనకు మద్దతుగా జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి వెంట నిర్వహించిన ప్రచార ర్యాలీలో మోదీ ప్రసంగించారు.

ఉధంపూర్‌లో ఏప్రిల్ 19న ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ చౌదరి లాల్ సింగ్‌ను నిలబెట్టగా, డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ (DPAP) తరుపున GM సరూరి పోటీ చేస్తున్నారు.

హామీ ఇచ్చాం.. మాట నిలబెట్టుకున్నాం..

"నేను గత ఐదు దశాబ్దాలుగా జమ్మూ కాశ్మీర్‌కు వస్తున్నాను. 1992లో లాల్ చౌక్ (శ్రీనగర్ నడిబొడ్డున) వద్ద త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించేందుకు వచ్చినపుడు మాకు ఘన స్వాగతం లభించింది. 2014లో వైష్ణో దేవి ఆలయంలో ప్రార్థనలు చేసిన తర్వాత ఇక్కడి నుంచే ప్రసంగించాను. తరతరాలుగా (ఉగ్రవాదం కారణంగా) బాధపడుతున్న ప్రజలకు విముక్తి కల్పిస్తానని హామీ ఇచ్చాను.’’ అని గుర్తు చేసుకున్నారు.

‘‘మీ ఆశీర్వాదంతో మోదీ ఆ హామీని నెరవేర్చారు. దశాబ్దాల తర్వాత ఈ ఎన్నికలు జరుగుతున్నాయి.. ఉగ్రవాదం, వేర్పాటువాదం, రాళ్లదాడులు, దాడులు, సీమాంతర ఉగ్రవాదం లాంటివి ఇప్పుడు లేవు. వైష్ణో దేవి అమర్‌నాథ్ తీర్థయాత్రల భద్రత గురించి ఆందోళన ఉండేది. అయితే (భద్రత) పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఇప్పుడు అభివృద్ధిని చూస్తున్నారు. ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం బలపడుతోంది, ”అని ప్రధాని అన్నారు.

"దయచేసి నన్ను నమ్మండి. గత 60 ఏళ్లుగా జమ్మూ కాశ్మీర్‌ను వేధిస్తోన్న సమస్యల నుండి నేను విముక్తి కల్పిస్తాను. జమ్మూ కాశ్మీర్ పూర్తిగా మారుస్తానని చెప్పా. దాన్ని చేసి చూయించాం" అన్నారాయన. జమ్మూ కాశ్మీర్‌లో లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయని హామీ ఇచ్చారు మోదీ.

ప్రతిపక్షాలకు మోదీ సవాల్..

ఆర్టికల్ 370 రద్దును ప్రస్తావిస్తూ, వివాదాస్పద రాజ్యాంగ నిబంధనను తిరిగి పొందాలని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలకు సవాలు విసిరారు. "వాళ్లు దాన్ని చేయలేరు" అని అన్నారు మోదీ.

భారతీయ జనతా పార్టీ (బిజెపి) అభ్యర్థులు సింగ్ (ఉదంపూర్ నుండి), జుగల్ కిషోర్ (జమ్మూ నుండి) ఓట్లను కోరుతూ .. రాబోయే ఎన్నికలు దేశానికి చాలా ముఖ్యమైనవని, దేశం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లను అధిగమించేందుకు సుస్థిత ప్రభుత్వం అవసరమని నొక్కి చెప్పారు పీఎం నరేంద్ర మోదీ.

Read More
Next Story