
allu aravind
ఎవరూ గెలిచినా సంతోషిస్తాం: అల్లు అరవింద్
ఎన్నికల్లో ఎవరూ గెలిచినా సంతోషిస్తామని సినీ నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. తెలంగాణ ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావడం సంతోషంగా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. త్వరలో సినీ ఇండస్ట్రీ తరఫున త్వరలోనే రిప్రంజేటేషన్ ఇస్తామని చెప్పారు. ఇది టాలీవుడ్ కు ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ అని వివరించారు. సినీ ఇండస్ట్రీ ని ప్రభుత్వాలు అనేక సందర్భాల్లో ఆదుకున్నాయని గుర్తు చేశారు. కాగా కాంగ్రెస్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 64 సీట్లు గెలుచుకుంది. ఈ రోజు రాత్రి 8 గంటలకు రాజ్ భవన్ లో సీఎంగా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించిన వ్యక్తి ప్రమాణస్వీకారం చేస్తారు.
Next Story