ఉపాధి అవకాశాలు పెంచుతాం-యువత ఆంకాక్షలను నెరవేరుస్తాం: ఖర్గే
x

ఉపాధి అవకాశాలు పెంచుతాం-యువత ఆంకాక్షలను నెరవేరుస్తాం: ఖర్గే

తమ పార్టీ అధికారంలోకి వస్తే యువత భవిష్యత్ బంగారుమయం చేస్తామని హామీ ఇస్తున్నారు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే. ఇంకా మరిన్ని హామీలిచ్చాయన. అవేంటో చూద్దాం..


యువతకు తమ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఉపాధి అవకాశాలను పెంచుతమన్నారు. యువత ఆకాంక్షలను సాకారం చేసారం చేస్తామని అందులో భాగంగానే 'రోజ్‌గార్ క్రాంతి'కి నాంది పలుకుతున్నామని ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు. యువత భవిష్యత్తు అంధకారం నుంచి ఉజ్వలంగా మారుస్తామని హామీ ఇచ్చారు.

"కాంగ్రెస్ పార్టీ యువ న్యాయ్ హామీ ద్వారా 'రోజ్‌గార్ క్రాంతి (ఉపాధి విప్లవం)'కి నాంది పలుకుతుంది. ఉపాధి అవకాశాలను పెంచుతాం. యువత కలలు, ఆకాంక్షలను సాకారం చేయడానికి పనిచేస్తాం.’’అని పేర్కొన్నారు.

'భారతీ భరోసా' హామీ కింద తమ పార్టీ 30 లక్షల కొత్త కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను కల్పిస్తామని కాంగ్రెస్ చీఫ్ చెప్పారు. 'పెహ్లీ నౌక్రి పక్కి'లో భాగంగా.. చదువుకున్న యువకులందరికీ ఏడాదికి రూ. లక్ష చొప్పున అప్రెంటీస్‌షిప్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు.

పేపర్ లీక్ సే ముక్తి’ హామీ కింద పేపర్ లీకేజీలను అరికడతామన్నారు. మెరుగైన పని పరిస్థితులు, గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత , యువత కోసం రూ. 5,000 కోట్ల స్టార్టప్ ఫండ్‌ను కూడా పార్టీ హామీ ఇచ్చిందని పేర్కొన్నారు. నారీ న్యాయ్, యువ న్యాయ్, శ్రామిక్ న్యాయ్, కిసాన్ న్యాయ్, హిస్సేదారి న్యాయ్ - ఐదు న్యాయాల కింద 25 హామీలపై కాంగ్రెస్ తన లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగుతోంది. అధికారంలోకి వస్తే వెంటనే అమలు చేస్తామని కాంగ్రెస్ నేతలు హామీ ఇస్తున్నారు.

Read More
Next Story