టెస్ట్ క్రికెట్ లో ‘బజ్ బాల్’ఆపబోము.. సిరీస్ కూడా 3-2 తో .. స్టోక్స్
x
బెన్ స్టోక్స్, ఇంగ్లండ్ టెస్ట్ టీమ్ కెప్టెన్

టెస్ట్ క్రికెట్ లో ‘బజ్ బాల్’ఆపబోము.. సిరీస్ కూడా 3-2 తో .. స్టోక్స్

టెస్ట్ క్రికెట్ లో తాము అనుసరిస్తున్న ‘బజ్ బాల్’ విధానాన్ని ఆపబోమని ఇంగ్లండ్ సారథి స్టోక్స్ వెల్లడించారు. ఓటమి ఎదురైన తమ ఆటలో మార్పు ఉండదన్నారు. ఇంకా ఏమన్నారంటే


రాజ్ కోట్ టెస్ట్ లో ఓటమి తరువాత కూడా తాము అనుసరిస్తున్న బజ్ బాల్ వ్యూహాన్ని ఆపబోమని ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అన్నారు. మరో రెండు టెస్ట్ లు మిగిలి ఉన్నాయని కచ్చితంగా సిరీస్ ను 3-2 తేడాతో గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. "

డ్రెస్సింగ్ రూమ్ అంతా నిరాశలో ఉంది. అయినప్పటికీ మేము త్వరగానే తేరుకుంటాం. మాకు మరో రెండు మ్యాచ్ లు మిగిలి ఉన్నాయి. కచ్చితంగా విజయం మాదే, విజయం కోసమే ఆడి సిరీస్ కూడా గెలుస్తాం" అని చెప్పారు.

వరుసగా రెండు పరాజయాలు ఎదురైన తమ ఆటతీరులో ఎలాంటి మార్పు ఉండబోదని అన్నారు. ప్రపంచ స్థాయి క్రికెట్ ఆటగాళ్లు మా దగ్గర ఉన్నారు, వారిని స్వేచ్చగా ఆడుకునే విధంగా మద్ధతు ఇస్తున్నామని చెప్పారు. ఈ సిరీస్ లో రెండు జట్ల మధ్య ఉన్న తేడాను మీరు ఇప్పటికే చూస్తున్నారని స్టోక్స్ అన్నారు. ఆటలో గెలుపొటములు సహజం అని చెప్పుకొచ్చాడు.

" కొన్ని మ్యాచ్ ల్లో మేము మా ప్రణాళికలు అమలు చేయగలిగాం. అలాగే భారత్ కూడా తమ ప్రణాళికలను సమర్దవంతంగా అమలు చేసింది. అయితే భారత్ అన్ని వేళల్లో అనుకున్నట్లుగా ఆడింది. మేం కొన్ని సెషన్లలో కాస్త గతి తప్పాం" అని స్టోక్స్ పేర్కొన్నారు.

డీఆర్ఎస్ పై స్పష్టత అవసరం

క్రికెట్ లో ప్రస్తుతం వాడుతున్న టెక్నాలజీ( సాంకేతికత) పై మరింత స్పష్టత అవసరమని స్టోక్స్ అభిప్రాయపడ్డారు. ఒపెనర్ జాక్ క్రాలీకి భూమ్రా వేసిన బంతి లెగ్ స్టంప్ పైకి వెళ్తున్నట్లు కనిపించిన, టెక్నాలజీలో మాత్రం వికెట్ల పై భాగంలో తాకుతున్నట్లు కనిపించిందని, అంపైర్ కాల్ తో వికెట్ ను కోల్పోయామని అన్నారు. దీనిపై మ్యాచ్ రిఫరీ జెఫ్ క్రోవ్ ను కలిసి కోచ్ బ్రెండన్ మెక్ కల్లమ్, నేను మాట్లాడమని చెప్పారు. డీఆర్ ఎస్ లో ఇక నుంచి అంపైర్ కాల్ తీసివేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.

ఆ షాటే మ్యాచ్ ను మలుపు తిప్పింది

మూడో రోజు ఉదయం తమ స్టార్ బ్యాట్స్ మెన్ జో రూట్ ఆడిన రివర్స్ షాట్ మ్యాచ్ ను మలుపు తిప్పిందని బెన్ స్టోక్స్ అభిప్రాయపడ్డారు. ఈ షాట్ తో బంతి నేరుగా స్లిప్ లో ఉన్న యశస్వీ జైశ్వాల్ చేతుల్లో పడింది. " అయితే జో కు నేను ఎలాంటి సలహాలు ఇవ్వను. అతనో ఉత్తమ బ్యాట్స్ మెన్, 30 సెంచరీలు, 12 వేల పరుగులు పూర్తి చేశాడు. ఇది సక్సెస్ అయి ఉంటే బౌలర్లు ఒత్తిడిలో ఉండేవారు. ఫీల్డ్ ను కూడా మార్చాల్సి ఉండేది. కానీ దురదృష్టవశాత్తూ అలా జరగలేదు. ఈ సిరీస్ లో భూమ్రా ఇప్పటికే జో ను రెండు సార్లు ఔట్ చేశాడు. దానికి సమాధానం ఇచ్చేలా అతని ఆట ఉంటుంది" అని చెప్పారు.

అతడి ఆరంభం అద్భుతం

భారత యువ బ్యాట్స్ మెన్ జైస్వాల్ ను స్టోక్స్ ఆకాశానికెత్తేశాడు. ఆటలో గొప్ప పరిణతి ప్రదర్శిస్తున్నాడని కొనియాడాడు. ప్రారంభంలో నిదానంగా ఆడాడని, తరువాత తన దైన శైలిలో రెచ్చిపోయాడని ప్రశంసించారు. " కొంతమంది ప్రత్యర్థి ఆటగాళ్లైయిన సరే వారిని చూస్తే నాకెంతో ఆనందంగా ఉంటుంది. అతడు( జైశ్వాల్) ఇప్పటి వరకు మూడు టెస్ట్ ల్లోనే 545 పరుగులు సాధించాడు, అందులో రెండు డబుల్ సెంచరీలు చేయడం అంటే మామూలు విషయం కాదు" అన్నారు. తన కెరీర్ ను ఘనంగా ప్రారంభించాడు. అతడికి మంచి భవిష్యత్ ఉందన్నారు.

Read More
Next Story