సీఏఏ అమలుకు వెబ్ సైట్ ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం
x

సీఏఏ అమలుకు వెబ్ సైట్ ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన సీఏఏ చట్టం అమలుకు వెబ్ సైట్ ను ప్రారంభించింది. కొద్ది రోజుల్లోనే మొబైల్ యాప్ ను కూడా తీసుకొస్తామని ప్రకటించింది.


సీఏఏ అమలు కోసం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా అర్హులైన వ్యక్తులు దరఖాస్తు చేసుకోవడానికి వీలుగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఒక పోర్టల్ ను ప్రారంభించింది.

పోర్టల్ మరియు యాప్
"సీఏఏ-2019 కింద అర్హత ఉన్న వ్యక్తులు ఈ పోర్టల్, indiancitizenshiponline.nic.in లో పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు" ప్రభుత్వ అధికార ప్రతినిధిని ఉటంకిస్తూ జాతీయా వార్తలు ప్రసారం చేసింది. అలాగే ఫోన్ ద్వారా అప్లికేషన్‌లను స్వీకరించడానికి త్వరలో మొబైల్ యాప్, “ CAA-2019 ” కూడా ప్రారంభించబడుతుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
CAA గురించి
డిసెంబర్ 31, 2014 కంటే ముందు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారతదేశానికి వచ్చిన పత్రాలు లేని ముస్లిమేతర పౌరులకు పౌరసత్వాన్ని ఈ చట్టం ద్వారా ఇవ్వవచ్చు. పార్లమెంట్ చట్టం ఆమోదించిన నాలుగు సంవత్సరాల తరువాత నియమాలను తెలియజేస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
ముస్లిం దేశాల నుంచి మత హింసకు గురై వలసవచ్చిన హిందూవులు, పార్శీలు, బౌద్దులు, సిక్కులు, జైనులు, క్రిస్టియన్లకు ఈ చట్టం ద్వారా పౌరసత్వం ఇస్తామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వారికి ఇక నుంచి సులువుగా పౌరసత్వం లభిస్తుంది. ఈ నిబంధన తక్షణమే అమలులోకి వచ్చింది.



Read More
Next Story