ప్రాణప్రతిష్ఠ తర్వాత ’రామ్‌లల్లా‘ రూపకర్త అరుణ్‌ యోగిరాజ్‌ ఏమన్నారు?
x

ప్రాణప్రతిష్ఠ తర్వాత ’రామ్‌లల్లా‘ రూపకర్త అరుణ్‌ యోగిరాజ్‌ ఏమన్నారు?

అయోధ్య రామాలయంలో తాను చెక్కిన బాలరాముడి విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్ఠించడంపై శిల్పి అరుణ్‌ యోగిరాజ్‌ ఆనందం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన ఏమన్నాడంటే..


నేను అత్యంత అదృష్టవంతుడిని..

‘‘అయోధ్య నగరం కొత్త శోభను సంతరించుకుంది. అత్యంత సుందరంగా నిర్మించిన రామాలయంలో నేను తయారుచేసిన విగ్రహం ప్రతిష్టించడంతో నా జన్మ సార్థకమైంది. ‘‘నేను ఇప్పుడు భూమిపై అత్యంత అదృష్టవంతుడిని. నా పూర్వీకులు, కుటుంబ సభ్యులు, భగవాన్‌ రామ్‌లల్లా ఆశీర్వాదం నాకు ఎప్పుడూ ఉంటాయని’’ అరుణ్‌ యోగిరాజ్‌ పేర్కొన్నారు.

అరుణ్ యోగిరాజ్‌ గురించి

అరుణ్‌ యోగిరాజ్‌.. ఇతను కర్ణాటకలోని మైసూరుకు చెందిన శిల్పి. ఇప్పుడు ఈ పేరు తెలియని వారుండరు. అయోధ్య రామాలయ గర్భగుడిలో ప్రతిష్ఠించిన బాలరాముడి విగ్రహం ఈయన చెక్కినదే. దీంతో యువశిల్పి యోగిరాజ్‌ పేరు ప్రపంచానికి తెలిసిపోయింది.

శిల్పకళారంగంలో ఐదు తరాలుగా..

యోగిరాజ్‌ కుటుంబసభ్యులు ఐదు తరాలుగా శిల్పాల తయారీలో ఉన్నారు. యోగిరాజ్‌ తాత బసవన్న, తండ్రికి ఈ కళలో మంచి ప్రావీణ్యం ఉంది. చిన్నప్పటి నుంచే యోగిరాజ్‌కు శిల్పాలు చెక్కడంలో వారు శిక్షణ ఇచ్చాడు. అయితే బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్‌ డిగ్రీ పూర్తి చేశాక యోగిరాజ్‌ కొంతకాలం ఒక ప్రైవేట్‌ కంపెనీలో పనిచేశాడు. 2008లో కార్పొరేట్‌ ప్రపంచాన్ని విడిచిపెట్టి, శిల్పకళకు పూర్తిగా అంకితమయ్యాడు.

గుర్తింపు తెచ్చిన విగ్రహాలివే..

2021 నవంబర్‌లో ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో ఆది శంకరాచార్యుల విగ్రహాన్ని ప్రతిష్టించారు. వాస్తవానికి 2019లో ఈ విగ్రహం చెక్కడం మొదలుపెట్టాడు యోగిరాజ్‌. ఒక సంవత్సరం తర్వాత సుభాష్‌ చంద్రబోస్‌ చెక్కిన 30 అడుగుల విగ్రహం యోగిరాజ్‌కు గుర్తింపు తెచ్చిపెట్టింది. దేశ రాజధానిలోని ఇండియా గేట్‌ వద్ద ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని సెప్టెంబరు 8, 2022న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.

మైసూర్‌లో స్వామి రామకృష్ణ పరమహంస విగ్రహం, మైసూర్‌ రాజు జయచామరాజేంద్ర వడయార్‌ 14.5 అడుగుల ఎత్తైన విగ్రహం యోగిరాజ్‌ కళాఖండాలే.

Read More
Next Story