చెస్‌ ‌గ్రాండ్‌మాస్టర్‌ ‌ గురించి అదాని ట్వీట్‌ ‌ఏంటి?
x

చెస్‌ ‌గ్రాండ్‌మాస్టర్‌ ‌ గురించి అదాని ట్వీట్‌ ‌ఏంటి?

ట్వీట్‌పై చెస్‌ ‌గ్రాండ్‌మాస్టర్‌ ‌ ప్రజ్ఞానంద ఎలా రియాక్ట్ అయ్యాడు. అదానీతో కలిసి మాట్లాడాక ఏం జరిగింది?


చెస్‌ ‌గ్రాండ్‌మాస్టర్‌ ఆర్‌ ‌ప్రజ్ఞానానంద శుక్రవారం (జనవరి 5) గ్రూప్‌ ‌చైర్మన్‌ ‌గౌతమ్‌ అదానీని కలిశారు. అదానీ గ్రూప్‌ ‌నుంచి ఆయనకు పూర్తి మద్దతు లభించింది.

ప్రజ్ఞానానందతో భేటీ అనంతరం అదానీ మాట్లాడుతూ.. ‘‘డైనమిక్‌ ‌ప్రజ్ఞానానందకు మద్దతు ఇవ్వడం మాకు చాలా గర్వంగా ఉంది. అత్యున్నత స్థాయిలో ప్రతిభ చాటడం, పతకాలు తీసుకురావడం కంటే గొప్ప విషయం మరొకటి లేదు. ప్రజ్ఞానానంద భారతీయులందరికీ ఆదర్శం. అథ్లెట్లలందరికి అదానీ గ్రూప్స్ ఎప్పుడూ అండగా ఉంటుంది.’’ అని పేర్కొన్నారు.

‘‘ప్రపంచ వేదికపై నేను ఆడినప్పుడల్లా..దేశం కోసం మరిన్ని అవార్డులు తేవాలన్నదే నా ఏకైక లక్ష్యం. నా సామర్థ్యాలపై నమ్మకం ఉంచినందుకు అదానీ గ్రూప్‌కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’’ అని ప్రజ్ఞానంద అన్నారు.

ప్రపంచంలోనే అతి చిన్న వయసులో 2023 చెస్‌ ‌ప్రపంచ కప్‌ ‌ఫైనల్‌కు చేరుకున్న రికార్డు ప్రజ్ఞానందకు ఉంది. విశ్వనాథన్‌ ఆనంద్‌ ‌తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారతీయుడు కూడా ఈయనే. 2022లో చెస్‌ ‌క్రీడాకారుడు మాగ్నస్‌ ‌కార్ల్‌సెన్‌ను పలుమార్లు ఓడించడం ద్వారా ప్రజ్ఞానంద వెలుగులోకి వచ్చారు.

టీవీ చూడటం, తమిళ సంగీతం వినడం ప్రజ్ఞానానంద ఇష్టం. గణితాన్ని కూడా ఇష్టపడే చెన్నైకి చెందిన ప్రజ్ఞానానంద 2023లో హాంగ్‌జౌ ఆసియా క్రీడల్లో రజత పతకాన్ని గెలుచుకున్నాడు.

5 సంవత్సరాల వయస్సులో ఆడటం ప్రారంభించిన ప్రజ్ఞానంద.. 2018లో 12 ఏళ్ల వయస్సులో భారతదేశపు అతి పిన్న వయస్కుడిగా, ప్రపంచంలోనే రెండో అతి పిన్న వయస్కుడైన రికార్డుకెక్కారు. అభిమన్యు మిశ్రా తర్వాత గ్రాండ్‌మాస్టర్‌ ‌టైటిల్‌ ‌సాధించిన ఐదో పిన్నవయస్కుడైన వ్యక్తి. యాదృచ్ఛికంగా ప్రజ్ఞానంద సోదరి వైశాలి కూడా గ్రాండ్‌మాస్టర్‌. ఇద్దరూ గ్రాండ్‌ ‌మాస్టర్‌ ‌జంటగా ప్రసిద్ధికెక్కారు.

ప్రతిభావంతులకు అండగా..

అదానీ గ్రూప్‌ ‌బాక్సింగ్‌, ‌రెజ్లింగ్‌, ‌టెన్నిస్‌, ‌జావెలిన్‌ ‌త్రో, షూటింగ్‌, ‌రన్నింగ్‌, ‌షాట్‌పుట్‌, ‌బ్రిస్క్ ‌వాకింగ్‌, ఆర్చరీ క్రీడల్లో 28 మంది ప్రతిభావంతులైన ఆటగాళ్లకు అండగా నిలిచింది. లబ్ది పొందిన వారిలో కామన్వెల్త్ ‌గేమ్స్ ‌గోల్డ్ ‌మెడలిస్ట్ ‌రెజ్లర్లు రవి కుమార్‌ ‌దహియా, దీపక్‌ ‌పునియా, బాక్సర్‌ అమిత్‌ ‌పంఘల్‌ ఉన్నారు. దహియా, పునియా 2020 టోక్యో ఒలింపిక్స్ 2020, 2023 ఆసియా క్రీడలలో కూడా రజత పతకాలను సాధించారు.


Read More
Next Story