వెస్ట్ బెంగాల్‌లో టీఎంసీ దారెటు? రాహుల్ ఏమంటున్నారు?
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్‌లో ఒంటరిపోరుకు సిద్ధం అంటున్నారు. కాని రాహుల్ గాంధీ పొత్తు ఉంటుందని సంకేతాలిస్తున్నారు..
పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ ఇండియా కూటమి నుంచి దూరమయ్యారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ కూడా గుడ్‌బై చెప్పారు. ఇక పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఒంటరిపోరుకు సిద్ధమవుతోంది. కూటమి నుంచి దూరం కావడానికి కారణాలు ఏమైనా.. రాహుల్‌గాంధీ మాత్రం సీట్ల సర్దుబాటు విషయంలో పార్టీలతో చర్చిస్తున్నామని చెప్పుకొస్తున్నారు.
లోక్‌సభ సీట్ల సర్దుబాటు విషయంలో టీఎంసీ అధినేత, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో చర్చలు జరుపుతున్నామని కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ప్రస్తుతం రాహుల్ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ జార్ఖండ్‌లోని గుల్మా జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఇండియా కూటమిలో మిగతా సభ్యుల్లాగా మమతా కూడా ముఖ్యమైన వారు అని పేర్కొన్నారు.
కాంగ్రెస్‌పార్టీ సీపీఐ(ఎం)తో చేతులు కలపడాన్ని తప్పుబట్టిన మమతా బెనర్జీ..పశ్చిమ బెంగాల్‌లో లోక్‌సభ ఎన్నికలో ఒంటరిగానే పోటీ చేస్తామని గతవారం చెప్పారు.
ఇండియా కూటమి నుంచి వైదొలిగిన బీహార్ సీఎం నితీష్ కుమార్ గురించి రాహుల్ మాట్లాడుతూ.. ‘‘ఆయన కూటమి నుంచి తప్పుకోడానికి కారణం ఏమై ఉంటుందో మీకు తెలిసే ఉంటుంది’’ అని పాత్రికేయుల అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. కూటమి తరుపున బీహార్‌లో కూడా ఎన్నికల బరిలో ఉంటామని స్పష్టతనిచ్చారు రాహుల్.
మమతా దారెటు..
రాహుల్‌గాంధీ చెబుతున్న మాటలను బట్టి చూస్తే మమతా భారత కూటమి నుంచి పూర్తిగా వైదొలిగినట్లు కనిపించడం లేదు. మమత కాంగ్రెస్‌తో జోడి కడతారా? లేక తన రాష్ట్రంలో ఒంటరిపోరుకు సిద్ధమవుతారా అనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
కాంగ్రెస్ సవాల్ విసిరిన మమత..
జాతీయ ఉపాధి హామీ పథకం, పీఎం ఆవాస్ యోజనతో పాటు పలు సంక్షేమ పథకాలకు సంబంధించి కేంద్రం రాష్ట్రానికి వేల కోట్ల రూపాయలు బకాయిపడిరదంటూ ఇటీవల కోల్‌కతాలో మమతా బెనర్జీ ధర్నా చేపట్టారు. కేంద్రంపై విరుచుకుపడిన ఆమె ఓ సందర్భంలో కాంగ్రెస్‌ను కూడా తీవ్రంగా విమర్శించారు. చేతన్కెతే ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్ మధ్యప్రదేశ్‌లో బీజేపీ ఓడిరచాలని సవాల్ కూడా విసిరారు.
‘‘పశ్చిమ బెంగాల్‌లో రాహుల్ యాత్ర గురించిన సమాచారం తనకు తెలపలేదని కాంగ్రెస్‌పై గుర్రుగా ఉన్న మమతా.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీకి 40 సీట్లకు మించిరావని జోస్యం చెప్పారు.