
ఢిల్లీ లిక్కర్ స్కామ్: కవిత కేసులో ఎప్పుడు ఏం జరిగింది?
2021లో రాజుకున్న లిక్కర్ స్కామ్‌లో 2026 వరకు ఎప్పుడు ఏం జరిగింది? కవిత అరెస్ట్, బెయిల్.. తాజా పరిణామాలు అన్నీ..
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో కల్వకుంట్ల కవితకు కీలక ఊరట లభించింది. ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు ఈ కేసును కొట్టివేసింది. ఆరోపణలను నిరూపించేలా బలమైన ఆధారాలు ఏమీ లేని కారణంగా తాము ఈ నిర్ణయానికి వచ్చినట్లు న్యాయస్థానం వివరించింది. దీంతో ఈ కేసులో కవితకు పూర్తి స్థాయి ఉపశమనం లభించినట్లైంది.
ఈ కేసు 2021లో అమలులోకి వచ్చిన ఢిల్లీ ప్రభుత్వం 2021లో తీసుకొచ్చిన ఎక్సైజ్ పాలసీ తీవ్ర వివాదానికి దారితీసింది. ఇందులో భారీ కుంభకోణం జరిగిందని తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే పాలసీ అమలులో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ ప్రారంభించాయి. అనంతరం 2024లో ఈడీ, సీబీఐ కేసులు నమోదు చేశాయి. ఈ కేసులో అప్పటి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు తెలంగాణ నాయకురాలు కవిత పేరును కూడా యాడ్ చేశాయి. ఆమెను ఇదే కేసులో అరెస్ట్ కూడా చేశాయి.
దాదాపు 153 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కవితకు తరువాత సుప్రీంకోర్టు బెయిల్ మంజూరయింది. కేసు విచారణ కొనసాగిన నేపథ్యంలో, తాజాగా కోర్టు సమర్పించిన ఆధారాలను పరిశీలించిన తరువాత ఆమెపై ఉన్న ఆరోపణలకు తగిన ఆధారాలు లేవని పేర్కొంటూ చార్జీలను రద్దు చేసింది. కోర్టు తీర్పు అనంతరం కవిత తనపై నిజం గెలిచిందని పేర్కొంటూ, తనను నమ్మిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులు, అనుచరులు ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. రాజకీయ వర్గాల్లో ఈ పరిణామం చర్చనీయాంశమైంది. భవిష్యత్తులో ఆమె రాజకీయ పాత్రపై ఆసక్తి నెలకొంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేస్ టైమ్‌లైన్
నవంబర్ 17, 2021 – ఢిల్లీ ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ (మద్యం) Policy అమలు చేసింది. ఈ పాలసీపై తరువాత అనేక ఆరోపణలు వచ్చాయి.
2022: కేసు ఆరంభం, ఆరోపణలు
ఆగస్టు 17: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అవినీతి జరిగిందంటూ సీబీఐ ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేసింది.
సెప్టెంబరు: ఈ కేసులో మనీ లాండరింగ్ కోణాన్ని దర్యాప్తు చేసేందుకు ఈడీ (ED) రంగంలోకి దిగింది.
డిసెంబరు 11: హైదరాబాద్‌లోని కవిత నివాసంలో సీబీఐ అధికారులు సుమారు 7 గంటల పాటు ఆమెను విచారించారు.
2023: ఈడీ విచారణలు
మార్చి 11: ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో కవిత మొదటిసారి విచారణకు హాజరయ్యారు. సుమారు 9 గంటల పాటు విచారణ సాగింది.
మార్చి 20 & 21: వరుసగా రెండో, మూడో రోజు ఈడీ విచారణకు హాజరయ్యారు. తన ఫోన్లను ఈడీకి అప్పగించారు.
సెప్టెంబరు: ఈడీ సమన్లపై కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మహిళను ఈడీ ఆఫీసుకు పిలవవచ్చా అనే అంశంపై పిటిషన్ వేశారు.
2024: అరెస్ట్, జైలు శిక్ష
మార్చి 15: అనూహ్య పరిణామాల మధ్య హైదరాబాద్‌లోని కవిత నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించింది. అదే రోజు సాయంత్రం కవితను అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించారు.
మార్చి 16: ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు కవితకు మార్చి 23 వరకు ఈడీ కస్టడీ విధించింది.
మార్చి 26: ఈడీ కస్టడీ ముగియడంతో కోర్టు ఆమెకు ఏప్రిల్ 9 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించి తీహార్ జైలుకు తరలించింది.
ఏప్రిల్ 11: తీహార్ జైలులో ఉన్న కవితను సీబీఐ అధికారులు అధికారికంగా అరెస్ట్ చేశారు.
మే 10: ఢిల్లీ హైకోర్టులో కవిత దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైంది.
జూలై 1: తీహార్ జైలులో కవిత రిమాండ్‌ను కోర్టు మరికొన్ని రోజులు పొడిగించింది.
బెయిల్
ఆగస్టు 12: బెయిల్ కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈడీ, సీబీఐలకు నోటీసులు జారీ చేసింది.
ఆగస్టు 27: సుదీర్ఘ విచారణ అనంతరం సుప్రీంకోర్టు కవితకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దాదాపు 166 రోజుల జైలు జీవితం తర్వాత ఆమెకు విముక్తి లభించింది.
ఆగస్టు 28: తీహార్ జైలు నుండి కవిత విడుదలయ్యారు.
కేసు కొట్టివేత
ఫిబ్రవరి 27, 2026 – ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు అంతిమంగా కవితతో సహా 23 నిందితులపై సీబీఐ ఆరోపణలను రద్దు చేసింది. దీంతో ఈ కేసులో కవితకు క్లీన్ చిట్ లభించింది.

