హర్యానా ఎన్నికల్లో బీజేపీ ప్రణాళిక ఏంటీ?
x

హర్యానా ఎన్నికల్లో బీజేపీ ప్రణాళిక ఏంటీ?

సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి గట్టి షాక్ తగిలింది. తమకు రావాల్సిన చాలా స్థానాలను ప్రతిపక్షాలు ఎగరేసుకుపోయాయి. తమ ప్రణాళికలోని లోపాలను పసిగట్టిన కమలదళం..


సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 400 స్థానాలు గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని ప్రచారం జరిగింది. అందువల్ల కమల దళం మ్యాజిక్ ఫిగర్ ను అందుకోలేకపోయింది. ఈ తప్పును ఇప్పుడు సరిదిద్దే ప్రయత్నాలను ప్రస్తుతం పార్టీ ముమ్మరంగా చేపడుతోంది. ఎన్నికల్లో తమకు దూరమైన సామాజిక వర్గాలను తిరిగి దగ్గరకు చేర్చుకునే ప్రయత్నాలను చేస్తున్నారు.

లోక్‌సభ ఫలితాల్లో దశాబ్దంలో మొదటిసారిగా బీజేపీకి మెజారిటీ స్థానాలు రాని వారాల తర్వాత, పార్టీ సీనియర్ నేతలు దేశవ్యాప్తంగా కొన్ని ప్రణాళికలను రూపొందించారు. రాష్ట్ర విభాగాలను షెడ్యూల్డ్ కులాల సభ్యులకు చేరువ చేయాలని కోరారు. సమాజంలోని ఒక వర్గం ప్రతిపక్ష పార్టీలకు ఓటు వేయడం వెనుక గల కారణాలను అర్థం చేసుకోవడం ప్రారంభించింది. అందుకు ప్రతివ్యూహాలను రూపొందించడం కూడా మొదలు పెట్టింది.
తప్పులను గుర్తించడం
“మొదటి దశలో.. మనం తప్పులు చేశామని అంగీకరించడం, రెండోది అవి సరిదిద్దడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అంగీకరించడం. సామాజిక న్యాయం కోసం ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేస్తున్న కృషి వంకపెట్టడానికి వీలులేనిది. అయితే ఎన్నికల ఫలితాలు మా అంచనాలను అందుకోలేకపోయాయి. కాబట్టి గత లోక్‌సభ ఎన్నికలలాగా బీజేపీ ఎందుకు విజయం సాధించలేకపోయిందో మనం అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం’’ అని ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ షెడ్యూల్డ్ క్యాస్ట్ మోర్చా అధ్యక్షుడు రామ్ చంద్ర కన్నోజియా ఫెడరల్‌తో అన్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ చేసిన తప్పులను అర్థం చేసుకోవడానికి, దళిత సంఘాల సభ్యులను సంప్రదించి, ఎన్నికల సమయంలో పార్టీ లోపాలపై సవివరమైన నివేదికను సిద్ధం చేయాలని పార్టీ నాయకత్వం దాని అన్ని రాష్ట్ర విభాగాలను కోరింది. షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) వర్గాల సభ్యులు నివసించే ప్రాంతాల్లో 'చౌపాల్' (సమావేశం) నిర్వహించాలని, బీజేపీ తన స్థానాలను ఎందుకు నిలబెట్టుకోలేకపోయిందో అర్థం చేసుకోవాలని బీజేపీ సీనియర్ నేతలు రాష్ట్ర యూనిట్లను కోరారు.
“లోక్‌సభ ఎన్నికల సమయంలో, ఎన్‌డిఎ 400 లేదా అంతకంటే ఎక్కువ సీట్లు సాధించగలిగితే రాజ్యాంగాన్ని మారుస్తామని, రిజర్వేషన్ విధానానికి ముగింపు పలుకుతామని ప్రజలను కన్ప్యూజ్ చేయడంలో ప్రతిపక్షాలు విజయం సాధించాయి. వివిధ రాష్ట్రాల్లోని మన నాయకులు కూడా ఈ ప్రకటనలు చేయడం వల్ల ప్రతిపక్షాల వ్యూహం ఫలించింది. ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఎప్పుడూ పేదలు, ఆర్థికంగా బలహీన వర్గాల కోసం పనిచేసినప్పటికీ, మా నేతలు చేసిన ఇలాంటి వ్యాఖ్యలు పార్టీ ఎన్నికల విజయాన్ని దెబ్బతీశాయి’’ అని కన్నౌజియా అన్నారు.
1975లో అప్పటి కాంగ్రెస్ హయాంలో ఎమర్జెన్సీ విధించిన జూన్ 25వ తేదీని 'సంవిధాన్ హత్యా దివస్'గా పాటించాలని ఎన్డీయే ప్రభుత్వం ఇటీవలి చర్య తీసుకోవడం కూడా కూటమి ప్రతివ్యూహంలో భాగమే.
హర్యానాలో ఖాళీలు..
ఈ ఏడాది చివర్లో హర్యానా అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీకి ఇక్కడ అనుకున్న స్థానాలను గెల్చుకోలేకపోయింది. తన వ్యూహంలో ఉన్న లోపాలను పూడ్చుకోవడానికి బీజేపీ నాయకత్వం ప్రయత్నిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించి సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన పరాభవానికి మందురాసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
హర్యానాలో షెడ్యూల్డ్ కులాల నాయకుడికి రాజ్యసభ టిక్కెట్టు ఇవ్వాలని బిజెపి నాయకత్వం ఇప్పుడు పరిశీలిస్తోంది. ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు హర్యానాలో రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దీపేందర్ హుడా రోహ్‌తక్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించి తన రాజ్యసభ స్థానాన్ని ఖాళీ చేశారు. ఈ స్థానం ఖాళీ కావడంతో బీజేపీ ఈ సీటును ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించి గెలిపించడానికి వ్యూహాలు రూపొందిస్తోంది. సీట్ గెలవడానికి కావాల్సిన సంఖ్యా బలం బీజేపీకి ఉంది.
అంతకుముందు, హర్యానాలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి, బిజెపి సీనియర్ జాట్ నాయకుడు, రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు సుభాష్ బరాలాకు ఈ ఏడాది ఏప్రిల్‌లో రాజ్యసభ టికెట్ ఇచ్చింది. లోక్‌సభ ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థులకు జాట్, దళిత వర్గాలు మద్ధతు ఇచ్చాయి. ఇప్పుడు ఈ రెండు వర్గాలను ప్రసన్నం చేసుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే టికెట్ల పంపిణీ చేస్తోంది.
ఎన్నికలకు ముందే షా ప్రణాళిక..
'ఏ రాజకీయ పార్టీ బీజేపీని ఓడించలేదు. మేము తప్పులు చేశాము. సరైన సమయంలో వాటిని సరిదిద్దుకోలేక పోయినందున పార్టీ కొన్ని లోక్‌సభ స్థానాలను కోల్పోయింది. రాజ్యాంగాన్ని మారుస్తామన్న భావనను ప్రతిపక్షాలు కల్పించడమే అతిపెద్ద తప్పు. అంతే కాకుండా, రాష్ట్ర నాయకత్వం నియంత్రణలో లేదనే కథనాన్ని ప్రతిపక్షాలను ప్రచారం చేశాయి. వాటిని సరైన విధంగా తిప్పికొట్టేలేకపోయాము’’ అని హర్యానాలోని బిజెపి ఎస్సీ మోర్చా కార్యనిర్వాహక సభ్యుడు గౌరవ్ బెనివాల్ ది ఫెడరల్‌తో అన్నారు.
ఎన్నికలలో ఐక్యమత్యాన్ని ప్రదర్శించడంపై బిజెపి నాయకత్వం ఎక్కువ దృష్టి పెట్టాలనే కేంద్ర నాయకత్వం సూచన. అందుకోసమే కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా హర్యానాకు వచ్చేశారు. గత రెండు నెలల కాలంలో ఆయన రెండు సార్లు రాష్ట్రానికి వచ్చారు. ఇక్కడ 40 శాతం పైగా ఓటర్లు దళిత, జాట్ వర్గాల వారే ఉన్నారు. వారితో పాటు ఓబీసీ వర్గాలపై ఉన్న తన పట్టును కొనసాగించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు తగ్గ ప్రణాళికలను పార్టీ రూపొందిస్తోంది.
“బిజెపి తన చర్యల కారణంగా షెడ్యూల్డ్ కులాల (ఎస్‌సి) ఆగ్రహాన్ని ఎదుర్కొంటోంది. ప్రతిపక్షాలను నిందించడం సరికాదన్నారు. ఎన్నికల ప్రచారంలో, ఎన్డీయేకు 400 లేదా అంతకంటే ఎక్కువ సీట్లు వస్తే, రాజ్యాంగంలో సాధ్యమయ్యే మార్పుల గురించి కొంతమంది సీనియర్ నాయకులు మాట్లాడారు.
ఈడబ్ల్యూఎస్, ఇతర చర్యలను చేర్చడం ద్వారా బిజెపి రిజర్వేషన్ నిర్మాణంలో అసమతుల్యం చేసిందనడంలో సందేహం లేదు. కాబట్టి బీజేపీ ఇప్పుడు ప్రతిపక్షాలను నిందించగలిగినప్పటికీ, ఆ పార్టీ ఏం చేస్తుందో ప్రజలు గమనిస్తున్నారు. అందుకే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి దెబ్బ తగిలింది’’ అని ఢిల్లీ యూనివర్సిటీలో రచయిత, పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్ సుకుమార్ ది ఫెడరల్‌తో అన్నారు.
Read More
Next Story