మోదీ చెబుతున్న ఇండియా కూటమి కొత్త ఫార్ములా ఏమిటి?
x

మోదీ చెబుతున్న ఇండియా కూటమి 'కొత్త ఫార్ములా' ఏమిటి?

తనను ఎదుర్కోలేని ఇండియా కూటమి 'కొత్త ఫార్ములా'తో తనను బలహీనపర్చాలని చూస్తోందని, అందుకే మిత్రపక్షాలతో తనకు కుటుంబం లేదని చెప్పిస్తుందని ప్రధాని మోదీ అన్నారు.


తనను ఎదుర్కోలేని ఇండియా కూటమి 'కొత్త ఫార్ములా'తో తనను బలహీనపర్చాలని చూస్తోందని, అందుకే మిత్రపక్షాలతో తనకు కుటుంబం లేదని చెప్పిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సోమవారం ఆయన చైన్నైలో పర్యటించారు. ఈ సందర్భంగా డీఎంకేను టార్గెట్ చేస్తూ మాట్లాడారు.

‘‘సనాతన ధర్మాన్ని నిర్మూలించండి” అని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు, డిఎంకె యువజన విభాగం కార్యదర్శి ఉదయనిధి చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు సోమవారం ఆయనను మందలించింది. ఈ నేపథ్యంలో చెన్నైలో జరిగిన బీజేపీ ర్యాలీలో డీఎంకే పేరు ప్రస్తావించకుండానే ఆ పార్టీని విమర్శించారు. ‘‘కోట్లాది ప్రజల విశ్వాసాన్ని రాజవంశీయులు అవమానిస్తున్నారు. డీఎంకే మంత్రికి సుప్రీంకోర్టు “కఠినమైన ప్రశ్నలు” వేసింది అని అన్నారు.

లాలూ ప్రశ్నకు ధీటైన సమాధానం..

ప్రధాని మోదీకి "కుటుంబం లేదు" అని ఆర్‌జేడీ అధినేత లాలూ ప్రసాద్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు మోదీ ఘాటుగానే సమాధానమిచ్చారు. సోమవారం తెలంగాణ పర్యటనకు వచ్చిన మోదీ బహిరంగసభలో లాలూ మాటలకు కౌంటర్ ఇచ్చారు. తనను ఎదుర్కోవడం చేతకాని భారత కూటమి ఈ "కొత్త ఫార్ములా"ను తనపై ప్రయోగించిదని చెప్పుకొచ్చారు. 140 కోట్ల మంది నా కుటుంబసభ్యలేనని సభలో చెప్పారు.

వారికి వారి భవిష్యత్ మాత్రమే కావాలి..

"రాజవంశ పార్టీలు వారి భవిష్యత్తు గురించి మాత్రమే ఆలోచిస్తాయి. అయితే నేను అందరి భవిష్యత్తు కోసం పని చేస్తా. ’’అని మోదీ నొక్కి చెప్పారు. ‘‘డీఎంకే, కాంగ్రెస్‌లకు ‘కుటుంబమే ముఖ్యం. అదే వారికి ప్రథమం.’ కాని నాకు ‘దేశం ప్రథమం’. కుటుంబం ఉండడం అంటే అవినీతికి లైసెన్సు పొందడమేనా? అధికారాన్ని చేజిక్కించుకోవడమేనా? అని మోదీ ప్రశ్నించారు.

సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం..

జేఎంఎం లంచం కేసులో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్న మోదీ.. స్వచ్ఛమైన రాజకీయాలను ఇది ప్రోత్సహిస్తుందని చెప్పారు. “భారత కూటమిలోని అవినీతి నాయకులకు ఉన్న రక్షణను సుప్రీంకోర్టు రద్దు చేసింది. నేను దానిని (తీర్పు) స్వాగతిస్తున్నాను.” అని పేర్కొన్నారు. దశాబ్దాలుగా భారత కూటమి పార్టీలు దోపిడీ రాజకీయాలకు పాల్పడుతున్నాయని, వాటి కారణంగా యువత రాజకీయాలతో విసిగిపోయారని అన్నారు.

‘‘సుప్రీం తీర్పు స్వచ్ఛ రాజకీయాలను ప్రోత్సహిస్తుంది. మోదీకి అత్యంత ఇష్టమైన పని స్వచ్ఛత అభియాన్ (పరిశుభ్రత ఉద్యమం). నేను ప్రతిచోటా శుభ్రం చేయాలి. అందుకు నాకు మీ ఆశీస్సులు కావాలి. ”అన్నారు మోదీ. యువత కోసం, వారి భవిష్యత్తు ఉజ్వలంగా మార్చాలని నేను పగలు, రాత్రి శ్రమిస్తున్నాను. వారికి మరిన్ని అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నాను'' అని చెప్పారు.

మీడియాను మేనేజ్ చేశారు..

గత డిసెంబరులో చెన్నైలో వరదలు ముంచెత్తినపుడు, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు రక్షించేందుకు పెద్దగా చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. అంతా బాగానే ఉందనే సందేశాన్ని పంపి మీడియాను "మేనేజ్" చేసిందని తమిళనాడు అధికార డిఎంకెను లక్ష్యంగా చేసుకుని మోడీ ఆరోపించారు. డ్రగ్ కార్టెల్‌తో సంబంధం ఉందన్న ఆరోపణలపై డీఎంకే తన కార్యకర్త జాఫర్ సాదిక్‌ను తొలగించింది. దీనిపై కూడా మోదీ మాట్లాడారు. తమిళనాడులో డ్రగ్ లభ్యత ప్రబలంగా ఉందన్న సమాచారం తనను ఆందోళనకు గురిచేస్తుందని ప్రధాని అన్నారు.

"నాకు భవిష్యత్ తరాల గురించి ఆందోళనగా ఉంది. పిల్లల భవిష్యత్తు పాడవుతున్నపుడు.. తమకు ఏమి పట్టనట్లుగా వ్యవహరించే పార్టీల పట్ల జాగ్రత్తగా ఉండాలి’’ అని ప్రధాని అన్నారు. బిజెపికి మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరుతూ.. "తమిళనాడు శత్రువులపై" విచారణను వేగవంతం చేస్తామని, ఇది "మోదీ హామీ" అని నొక్కి చెప్పారు.

డీఎంకేపై దాడి

చెన్నై పోర్ట్-మధురవాయల్ ఎక్స్‌ప్రెస్‌వే, కోవిడ్ వ్యాక్సిన్‌లు, పేదలకు ఉచిత రేషన్, MSMEలకు రుణ సదుపాయంతో తాము చేపట్టిన పలు అభివృద్ధి పనులను పీఎం వివరించారు. కేంద్ర పథకాల లబ్ధిదారులకు నేరుగా ఆన్ లైన్లో డబ్బులు అందుతున్నాయి. ఇలా లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు చేరడం డీఎంకేను కలవరపెడుతోందన్నారు.

వికసిత భారత్ కు మార్గం..

అభివృద్ధి చెందిన తమిళనాడు కోసం అందరం కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు. “అభివృద్ధి చెందిన TN మాత్రమే వికసిన భారత్ (అభివృద్ధి చెందిన భారత్)కి మార్గం సుగమం చేస్తుంది. ర్యాలీకి హాజరైన వారి గురించి ప్రస్తావిస్తూ.. ఇది ఢిల్లీలోని ఎయిర్ కండిషన్డ్ గదుల్లో "రాజకీయ కథనాలు" సృష్టించేవారికి ఇది ఇబ్బంది కలిగిస్తుందన్నారు.

Read More
Next Story