అప్పటి, ఇప్పటి యుద్ధాలలో ఏం మార్పు వచ్చింది?
x

అప్పటి, ఇప్పటి యుద్ధాలలో ఏం మార్పు వచ్చింది?

ఆపరేషన్ సిందూర్ లో కీలక పాత్ర పోషించిన వైమానిక దళం, సహాయక పాత్రకు పరిమితమైన పదాతిదళం


‘‘యుద్ధం’’ అనగానే మీ మనసులో ఏ చిత్రం కనిపిస్తుంది? ఈ తరంలో ఎక్కువగా మందికి యుద్ధం పేరు వినగానే సినిమాలో దృశ్యాలే కనిపిస్తాయి. యూనిఫాం ధరించిన సైనికులు తుపాకులు పట్టుకుని, శత్రు సైనికులను హ్యండ్ టూ హ్యండ్ పోరాడుతూ.. తుపాకులను చిత్రంగా తిప్పుతూ కాలుస్తుంటారు. శత్రువులు అందరూ గాయంతో విలవిలాడుతుంటారు.

అయితే సినిమాలు, వాస్తవాలు దూరంగా ఉంటాయి. ఉగ్రవాద స్థావరాలపై మే 7 తెల్లవారుజామున 1.30 నిమిషాలకు భారత్ దాడులు ప్రారంభించింది. మే 10న సాయంత్రం ఇరు దేశాలు కాల్పుల విరమణ అంగీకారానికి వచ్చారు.
ఆలోపే భారత్ అనేక ఉగ్రవాద శిబిరాలు, పాకిస్తాన్ వాయు స్థావరాలు, లాహెూర్ లోని వైమానిక రక్షణ రాడార్లు పేల్చివేసింది. దాదాపు వంద మంది ఉగ్రవాదులు, పదుల సంఖ్యలో పాక్ సైనికులు మృత్యువాత పడ్డారు.
శత్రుదేశం వైమానిక స్థావరాల మౌలిక సదుపాయాలకు 20 శాతం మేర నష్టం చేసిందని తెలుస్తోంది. దాదాపు వందల కిలోమీటర్ల మేర భారత యుద్ధ విమానాలు స్వేచ్ఛగా ప్రయాణించాయి.
భారత్ పై పాకిస్తాన్ జరిపిన దాడిలో స్వల్ఫ స్థాయిలో నష్టం చేకూరింది. దాదాపు 12 మంది పౌరులు మరణించారు. ఇది కూడా పాక్ పౌర ఆవాసాలపై కాల్పులు జరపడంతో ఈ నష్టం వాటిల్లింది. ఐదుగురు జవాన్లు అమరులయ్యారు. ఈ యుద్దంలో ఎక్కువగా క్షిపణులు, స్మార్ట్ బాంబులు, డ్రోన్లనే వినియోగించి భారత్ పైచేయి సాధించింది.
యుద్ద రంగంలో మార్పులు..
అనేక ఇతర విషయాలతో పాటు ఆపరేషన్ సింధూర్ లో కొన్ని కీలక మార్పులు కనిపించాయి. 1999 లో జరిగిన కార్గిల్ యుద్ధంలో కూడా పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. సాంకేతికంగా కార్గిల్ యుద్దం, యుద్దంగా పరిగణించరు.
అలాగే ఆపరేషన్ సిందూర్ కూడా యుద్ధం కాదు. కార్గిల్ లో భారత సైనికులు ఆపరేషన్ విజయ్ పేరుతో టైగర్ హిల్, టోలోలింగ్, పాయింట్ 4875 వంటి వ్యూహాత్మక ప్రదేశాలను శారీరక శ్రమతో స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘర్షణలో విక్రమ్ బాత్రా, యోగేంద్ర సింగ్ యాదవ్, మనోజ్ కుమార్ పాండే వంటి అమరవీరులు అత్యంత ధైర్యసాహాసాలను ప్రదర్శించారు. మన మాతృభూమిని కాపాడారు. ఆపరేషన్ సిందూర్ లో మన సైనికులు సాంకేతిక శక్తితో గెలిచారు.
ఈ ఘర్షణలో పాకిస్తాన్ కు చాలా ఎక్కువగా నష్టం జరిగింది. నష్టం జరిగిన ప్రభావం చాలా స్ఫష్టంగా కనిపిస్తుంది. కేవలం నాలుగు రోజుల ఘర్షణకే పాకిస్తాన్ తోకముడిచి శాంతి చర్చలకు శరణుజొచ్చింది. దేశాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని మాట్లాడుతూ.. దాడిని ఆపమని పాకిస్తాన్ ప్రపంచ దేశాలను అభ్యర్థించింది కానీ భారత్ కాదని స్ఫష్టం చేశారు.
కొత్తతరం మందుగుండు సామగ్రి..
స్వాతంత్య్రం వచ్చిన తరువాత భారత్- పాక్ మధ్య జరిగిన నాలుగు యుద్ధాలలో ప్రతిసారి కొత్తతరం మందుగుండు సామగ్రిని ఇరుదేశాలు వాడాయి. 1965 లో పాకిస్తాన్ కు అమెరికా ప్యాటన్ యుద్ద ట్యాంకులను సరఫరా చేసింది. కార్గిల్ వార్ లో మనం బోఫోర్స్ గన్నులు వాడాము.
ఇక ఉక్రెయిన్ - రష్యా యుద్దం, ఇజ్రాయెల్- గాజా సంఘర్షణలలో ఎక్కువగా సాయుధ డ్రోన్లు, ఐరన్ డోమ్ వ్యవస్థ, హైటేక్ రక్షణ పద్దతులు కూడా తెరపైకి వచ్చాయి. రష్యా, ఇజ్రాయెల్ చేపట్టిన యుద్దాలు కూడా ప్రత్యేకమైనవి కావు. 2023, అక్టోబర్ 7న హమాస్, ఇజ్రాయెల్ పై దాడి చేసి కేవలం 20 నిమిషాల వ్యవధిలో 3 వేల నుంచి 5 వేల రాకెట్లను ప్రయోగించింది.
దాని ఐరన్ డోమ్ వ్యవస్థను కకావికలం చేసింది. ఆపరేషన్ సిందూర్ తరువాత పాకిస్తాన్ కూడా ఇదే తరహ దాడులు చేసింది. కానీ ఇక్కడ పాకిస్తాన్ ఎత్తులన్నీ మన వ్యవస్థలు చిత్తు చేశాయి.
మే 7, 8 తేదీల్లో భారత్ లోని 36 ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని పాక్ రాకెట్లకు బదులుగా దాదాపు వేయి డ్రోన్లను ముఖ్యంగా టర్కికి చెందిన అసిమ్ గార్డ్ సోంగర్ డ్రోన్ లు ప్రయోగించింది. అయితే వాటిని భారత ఇంటిగ్రేటేడ్ కౌంటర్ యూఏఎస్ గ్రిడ్, క్షిపణి రక్షణ వ్యవస్థలు కూల్చివేశాయి.
స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ది చేసిన ఆకాశ్ టీర్, రష్యాలో తయారు చేసిన ఎస్ -400( సుదర్శన్ చక్ర) వైమానిక రక్షణ వ్యవస్థలు ఈ డ్రోన్లను, పాకిస్తాన్ ప్రయోగించిన 15 క్షిపణులను అడ్డుకున్నాయి. మరో వైపు భారత్, లాహెర్ లో మోహరించిన అన్ని వైమానిక రక్షణ వ్యవస్థను పేల్చివేసింది. ఇజ్రాయెల్ తయారు చేసిన హర్పీ డ్రోన్లును ఇందుకోసం ఉపయోగించింది.
బలోపేతమైన వైమానిక దళం..
భారత్ కొంతకాలంగా అత్యాధునికమైన వాయు రక్షణ వ్యవస్థలను సమకూర్చుకుంది. ఇవి తాజా దాడిలో కీలకపాత్ర పోషించాయి. గతంలో కంటే భిన్నంగా భారత్ ఈ సారి శత్రువులపై ఆకాశంలో విజయం సాధించింది. అప్పట్లో యుద్దాల్లో ఎక్కువగా పదాతి దళం ముఖ్యపాత్ర పోషించగా, వైమానిక దళం, నేవీ సహాయక పాత్రలు పోషించేవి. ఇప్పుడు యుద్ధం తీరుతెన్నులు మారాయి.
1947 లో జమ్మూకాశ్మీర్ పై జరిగిన మొదటి యుద్ధం నుంచి 1999 వరకూ జరిగిన కార్గిల్ ఘర్షణల వరకూ వైమానిక దళం భూమిపై ఉన్న ఆర్మీకి వ్యూహాత్మక ఇన్సులేషన్ అందించడం, వారి మార్గాన్ని క్లియర్ చేయడం, శత్రువుల స్థావరాలపై బాంబులు వేయడం, వంతెనలు, శత్రువు మౌలిక సదుపాయాలు నాశనం చేయడం, సైనికులను దింపడం తరలించడం చేసేది.
అయితే 1990-91 గల్ఫ్ యుద్ధంలో సైన్యం, వైమానిక దళం పాత్రలలో మొదటిసారిగా మార్పు చూసింది. అమెరికా ఇరాకీ స్థావరాలపై బాంబు దాడులు చేయడంతో అమెరికా తన వైమానిక ఆధిపత్యాన్ని చూపింది.
నావికాదళం బ్యాకప్ పాత్రను పోషించింది. వారాల తరబడి వైమానిక దాడులు తరువాత ఆపరేషన్ డెజర్ట్ స్మార్ట్ లో భాగంగా 100 గంటల భూ యుద్ధంలో ఇరాకీ దళాలను ఓడించి, కువైట్ నుంచి ఇరాక్ వెనుదిరిగేలా చేశారు.
నేలపై అడుగుపెట్టలేదు..
మే 2025 లో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధం మరోక అప్ గ్రేడ్. ఇజ్రాయెల్ దళాలు గాజాపై భూతల దాడులు చేశాయి. రష్యాన్ దళాలు కూడా భూతల దాడులకే ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చాయి. కానీ భారత్, పాకిస్తాన్ లో అడుగుకూడా పెట్టలేదు. 100 గంటలు కాదు.. కనీసం ఇప్పటి వరకూ కూడా పాక్ లో అడుగుపెట్టలేదు.
ఇందుకు విరుద్దంగా జరిగిన మొదటి కశ్మీర్ యుద్ధం(1947), 1965 యుద్దం, 1971, 1999 యుద్దాలలో సైన్యం భూతల దాడులు చేసింది. 1947 లో సాధారణ పాకిస్తానీ సైనికులు రౌడీ గిరిజన ఉగ్రవాదులతో కలిసి జేకే లోకి అడుగుపెట్టారు. వారు చేసే విధ్వంసాన్ని ఆపడానికి భారత సైనికులను వాయు మార్గం ద్వారా దింపారు.
అప్పుడు ప్రారంభమైన యుద్ధం ఒక సంవత్సరానికి పైగా కొనసాగింది. దాదాపు 1100-1500 మంది సైనికులు అసువులు బాశారు. అంతేకాకుండా మరో 2 వేల మంది జేకే దళాల సిబ్బంది కూడా మరణించారు. భారత్ లో మొత్తం దాదాపు 7 వేల మంది చనిపోయినట్లు నిర్థారించారు.
సైన్యం నాయకత్వం వహించినప్పుడూ..
1965 రెండవ కాశ్మీర్ యుద్ధంలో కూడా ఇదే చిత్రం పునరావృతమైంది. ఆ సమయంలో పాకిస్తాన్ సైనికులు, భారత సైనికులు వారి శత్రుభూభాగంలోకి చొచ్చుకెళ్లారు. అమెరికా నుంచి వచ్చిన 700 మిలియన్ డాలర్ల సాయం, ఆధునీకరించిన సైనిక పరికరాలతో పాక్ మనపైకి దాడికి దిగింది. 1962 చైనా- భారత్ యుద్దంతో కుంగిపోయిన మన సైనికులకు, మరోసారి యుద్దానికి సిద్దమయ్యారు.
అప్పుడు పాక్ మన వైమానిక దళంపై ఆధిపత్యం కలిగి ఉంది. నెలన్నర పాటు సాగిన యుద్ధంలో 3,700 మంది భారత సైనికులు మరణించారు. భారత్ ఈ యుద్ధంలో గెలిచినప్పటికీ, మరో ఆరు సంవత్సరాలకే మరోసారి రెండు దేశాలు యుద్ధంలోకి దిగాయి.
తూర్పు పాకిస్తాన్ పై జరిగిన 13 రోజుల యుద్ధంలో 3 వేల మంది సైనికులు మరణించారు. మరో 9 వేల మంది గాయపడ్డారు. కార్గిల్ వార్ లో మరోసారి నియంత్రణ రేఖను దాటిన పాకిస్తాన్ సైనికుల భరతం పట్టడానికి సైనికులు మరోసారి కదనరంగంలోకి దూకారు. ఇప్పుడు మరో 527 మంది మరణించారు. 1363 మంది గాయపడ్డారు.
లక్ష్యాన్ని చేరుకోవడం..
ఈ యుద్దాలలో వైమానిక దళం సహాయక పాత్ర పోషించింది. నావికాదళం కూడా అలాగే చేసింది. ఈ సారి కూడా అలాగే. నావికాదళం అరేబియా సముద్రంలో సిద్దంగా ఉంది. మనం ఎంచుకున్న సమయంలో కరాచీతో సహ భూమి మీద ఉన్న లక్ష్యాలను చేధించడానికి తాము పూర్తి సిద్ధంగా ఉన్నామని నౌకాదళం ప్రకటించింది.
అయితే ఈఘర్షణలో కేవలం రాఫెల్(Rafale) జెట్లు, స్కాల్ప్ క్షిపణులు(Scalp), హ్యామర్(Hammer) బాంబులతో కూడిన హార్పీ డ్రోన్లు పూర్తి విధ్వంసం చేశాయి. ఇస్లామాబాద్ సమీపంలోని పాకిస్తాన్ సైనిక స్థావరాలు ఎంపిక చేసి దాడి చేసింది. అత్యున్నత సాంకేతికతో వారి ఫైటర్ జెట్ లను కూల్చివేశాయి. ముఖ్యంగా సైన్యం, నేవీ, వైమానిక దళం సమన్వయంతో దాడులు చేశాయి.
పీజీఎంలను ఉపయోగించడం వల్ల ఫలితం స్పష్టంగా కనిపిస్తోంది. ఆన్ బోర్డ్ కంప్యూటర్ ముందుగా అమర్చిన గ్రౌండ్ మ్యాప్ కచ్చితమైన కో ఆర్డినేట్లు, చాలా తక్కువ సర్క్కూలర్ ఎర్రర్ ప్రాబబిలిటీ తో ప్రతి లక్ష్యాన్ని చేధించాయి. పౌరులకు ఎలాంటి నష్టం లేకుండా జాగ్రత్త తీసుకున్నాయి.
సాంకేతికంగా భారత్ తో పాటు మరికొన్ని దేశాలు శక్తివంతమైన స్థితిలో ఉన్నాయి. పాకిస్తాన్ తో భారత్ చెప్పినట్లుగా మీ భూభాగంలోని ఏ ప్రాంతాన్ని అయినా మేము ఢీ కొట్టగలము. ఈ ప్రక్రియలో మాకు ఎలాంటి నష్టం జరగదని స్ఫష్టంగా నిరూపించాయి.
Read More
Next Story