మధ్యాహ్నం 3 గంటలకు ఎంత శాతం పోలింగ్ అయ్యిందంటే..
x

మధ్యాహ్నం 3 గంటలకు ఎంత శాతం పోలింగ్ అయ్యిందంటే..

మూడో విడత లోక్‌సభ ఎన్నికలలో భాగంగా ..11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 93 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది.


మూడో విడత లోక్‌సభ ఎన్నికలలో భాగంగా ..11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 93 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. మధ్యాహ్నం 3 గంటల సమయానికి 50.71 ఓటింగ్ శాతం నమోదైంది. పశ్చిమ బెంగాల్‌లో అత్యధికంగా 63.11 శాతం పోలింగ్ నమోదు కాగా మహారాష్ట్రలో అత్యల్పంగా (42.63 శాతం) పోలింగ్ నమోదైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.

ఇతర రాష్ట్రాలను పరిశీలిస్తే.. అస్సాంలో 63.08 శాతం, బీహార్‌లో 46.69 శాతం, ఛత్తీస్‌గఢ్‌లో 58.19 శాతం, దాద్రా, నగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూలో 52.43 శాతం, గోవాలో 61.39 శాతం, గుజరాత్‌లో 47.03 శాతం, కర్ణాటకలో 54.20 శాతం, మధ్యప్రదేశ్‌లో 54.20 శాతం. శాతం, ఉత్తరప్రదేశ్ 46.78 ఓటింగ్ శాతం నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది.

యూపీలో పోలింగ్‌ను బహిష్కరించిన గ్రామస్థులు..

ఉత్తరప్రదేశ్‌లోని బుదౌన్‌లో, ధోరన్‌పూర్ గ్రామస్థులు పోలింగ్‌ను బహిష్కరించారు. రహదారి సమస్యను పరిష్కరించలేదని గ్రామస్థులంతా ఓటు వేయకూడదని నిర్ణయించుకున్నారు. కాగా ఈ సమస్య తమ దృష్టికి వచ్చిందని, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్‌డిఎం)ని గ్రామస్థులతో మాట్లాడేందుకు పంపామని కలెక్టర్ తెలిపారు.

ఫిరోజాబాద్‌లోని మూడు గ్రామాలు - నాగ్లా జవహర్, నీమ్ ఖేరియా, నాగ్లా ఉమర్ - గ్రామస్థులు కూడా ఓటు హక్కును వినియోగించుకోలేదు. తమ సమస్యలపై ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడమే అందుకు కారణమని తెలుస్తోంది.

బుదౌన్‌లో ఎస్పీ అభ్యర్థి ఆదిత్య యాదవ్ మాట్లాడుతూ .. కొన్ని చోట్ల ఎస్పీ మద్దతుదారులను ఓటు వేయడానికి అనుమతించడం లేదని ఆరోపించారు. ఈ విషయాన్ని ఎలక్షన్ కమిషన్ పరిశీలకుడికి ఫిర్యాదు చేశానని చెప్పారు.

సంభాల్‌లో SP అభ్యర్థి జియా-ఉర్-రెహ్మాన్ బార్క్ విలేఖరులతో మాట్లాడుతూ.. ఒక సర్కిల్ అధికారి బీజేపీకి అనుకూలంగా వ్యవహరించాలని ఫిర్యాదు చేశారు. SP కార్యకర్తల నుండి ఓటర్ స్లిప్పులను లాక్కొని వారిని అదుపులోకి తీసుకున్న ఆ అధికారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని EC పరిశీలకుడిని అభ్యర్థించారు.

Read More
Next Story