ఎన్నికల వేళ పట్టుబడిన నగదు, బంగారం విలువ అన్ని కోట్ల..
x

ఎన్నికల వేళ పట్టుబడిన నగదు, బంగారం విలువ అన్ని కోట్ల..

ఎన్నికలకు ముందు పట్టుకున్న నగదు, బంగారం, ఇతరత్రా వాటి విలువను లెక్కగట్టారు ఐటీ అధికారులు. గతంలో కంటే ఈ సారి ఎక్కువగా పట్టుబడిరదని అంటున్నారు.


ఎన్నికల వేళ పట్టుబడుతున్న నగదు లెక్కలను ఆదాయ పన్నుల శాఖ బయటపెట్టింది. పట్టుబడ్డ నగదు, బంగారం విలువ గతంలో కంటే చాలా రెట్లు ఎక్కువని అంటున్నారు సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ డైరెక్ట్‌ టాక్సెస్‌ (సీబీఐటీ చెర్మన్‌) నితిన్‌ గుప్తా.

ఇటీవల మిజోరాం, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌ఘడ్‌, రాజస్థాన్‌, తెలంగాణలో ఎన్నికల జరిగాయి.

ఎన్నికలకు ముందు ఈ ఐదు రాష్ట్రాల్లో పట్టుబడిన డబ్బు, బంగారం, మద్యం, మత్తుపదార్థాల విలువ రూ. 1760 కోట్లు. ఇది 2018 కంటే 7 రెట్టు ఎక్కువ. (రూ.239. 15 కోట్లు) అని ఎలక్షన్‌ కమిషన్‌ పేర్కొంది.

ఇన్‌కం టాక్స్‌ డిపార్డుమెంట్‌ నివేదిక ప్రకారం..

2018లో పట్టుబడ్డ నగదు కంటే 2023లో 2 రెట్లు ఎక్కువగా పట్టుబడిరది. అలాగే 2017లో పట్టుబడిన దాని కంటే 2022లో 6 రెట్లు ఎక్కువగా పట్టుబడిరది.

పట్టుబడ్డ నగదు, డబ్బు రెండూ కలిపి చూస్తే.. 2018లో కంటే 2023లో 3 రెట్లు ఎక్కువ. అలాగే 2017 కంటే 2022లో 7 రెట్లు ఎక్కువ.

2023లో మేఘాలయ, నాగాలాండ్‌, త్రిపుర, కర్ణాటక, ఛత్తీస్‌ఘడ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, మిజోరాం, తెలంగాణ రాష్ట్రాలకు ఎన్నికలు జరిగాయి.

2022లో గోవా, మణిపూర్‌, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాలకు ఎన్నికలు జరిగాయి.

Read More
Next Story