సంబల్‌పూర్‌ వాసులకు అమిత్ షా వరాలేంటి?
x

సంబల్‌పూర్‌ వాసులకు అమిత్ షా వరాలేంటి?

ఒడిషా రాష్ట్రంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి షా ప్రసంగించారు.ఆరు, ఏడో దఫా పోలింగ్ తర్వాత బీజేపీకి 400కు పైగా సీట్లు వస్తాయన్నారు.


ఐదో ధపా ఎన్నికలు జరిగాక బీజేపీ 310 సీట్లు గెలుచుకుందని కేంద్ర హోంమంత్రి అమిత్ ధీమా వ్యక్తం చేశారు. సంబల్‌పూర్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగించారు.

ఆరు, ఏడో రౌండ్ల పోలింగ్ తర్వాత 400కు పైగా సీట్లు సాధిస్తామని షా ప్రకటించారు. ఈసారి ఒడిశాలో కమలం వికసిస్తుందని షా అన్నారు. ఒడిశాలో బీజేపీ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను రంగంలోకి దించింది బీజేపీ.

రాష్ట్రంలో అధికారుల పాలన సాగుతోందని, మీ ఓటుతో ఆ పాలనకు త్వరలో తెరపడుతుందన్నారు. బిజెడి ప్రభుత్వం ఒడిశా భాష, సంస్కృతి, సంప్రదాయాన్ని అవమానించిందని షా ఆరోపించారు. 'బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే కష్టపడి పనిచేసే వ్యక్తిని ఒడియా 'భూమిపుత్ర' (నేల కొడుకు)ని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించారు.

నవీన్ పట్నాయక్ ఒడిశాలో 'బాబు షాహీ' (అధికారుల పాలన) తీసుకువచ్చి ఒడియా ప్రజల గౌరవాన్నిఅగౌరవపరుస్తున్నారని అన్నారు. రాష్ట్రాభివృద్ధి వేగంగా జరగడానికి, రాష్ట్ర సంస్కృతిని కాపాడుకోవడానికి బిజెపిని గెలిపించాలని కోరారు. బీజేపీకి ఓటేస్తే ఈ గడ్డ మీద పుట్టిన వ్యక్తి మీకు ముఖ్యమంత్రి అవుతారని, తమిళ బాబు కాదని పేర్కొన్నారు.

దేవాలయాల పట్ల వివక్ష..

"BJD ప్రభుత్వం జగన్నాథ ఆలయాన్ని వాణిజ్య కేంద్రంగా మార్చాలనుకుంటోంది. మఠాలు, దేవాలయాలను ధ్వంసం చేశారు. ఆలయ నాలుగు ద్వారాలు ఇంకా మూసి వున్నాయి." అని షా అన్నారు. "ప్రపంచ ప్రఖ్యాత జగన్నాథ రథయాత్ర ఆపడానికి కుట్ర జరిగింది. రాష్ట్రంలోని ఖనిజ వనరులను దోచుకోవడానికి ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ఏ రాయిని వదిలిపెట్టడం లేదని ఆరోపించారు.

ఖనిజ సంపద పుష్కలంగా ఉన్నా..

ఒడిశాలో ఖనిజ సంపద పుష్కలంగా ఉన్నా.. రాష్ట్ర వనరులను కాపాడే ముఖ్యమంత్రి రాష్ట్రానికి లేరని అన్నారు. ‘‘బిజెడి ప్రభుత్వం పశ్చిమ ఒడిశాను నిర్లక్ష్యం చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధికి బిజెపి కట్టుబడి ఉంది" అని హోం మంత్రి చెప్పారు.

సంబల్‌పూర్‌లో 500 పడకల ఆసుపత్రి, వైద్య కళాశాలను బిజెపి నిర్మిస్తుందని, కెందు ఆకు కార్మికులకు పిఎఫ్ (ప్రావిడెంట్ ఫండ్) కూడా ఇస్తుందని ఆయన ప్రకటించారు.

Read More
Next Story