
టారిఫ్ ల యుద్దంలో భారత్ ఎక్కడ ఉంది?
అమెరికాకు ధీటుగా జవాబిస్తున్న చైనా, డాలర్ ఆధిపత్యం పై ‘ది ఫెడరల్’ లో విశ్లేషణ
ప్రపంచ వాణిజ్యం మొత్తం ట్రంప్ ధాటికి కకావికలం అవుతోంది. అమెరికా తన స్వప్రయోజనాల కోసం ఒకప్పుడు నిర్మించిన వాణిజ్య వ్యవస్థనే.. ఇప్పడు కూడా మళ్లీ తన స్వప్రయోజనాల కోసమే కాలరాస్తోంది.
ముఖ్యంగా తనకు సైనికంగా, ఆర్థికంగా బలమైన పోటీదారుడిగా ఎదిగిన చైనాను నిలువరించే లక్ష్యం ట్రంప్ మాటలు, చేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే చైనా ఉత్పత్తులపై ట్రంప్ 34 శాతం సుంకాలు విధించారు. దీనిపై చైనా కూడా అంతే స్థాయిలో తన జవాబు పంపింది.
‘ది ఫెడరల్’ లో ‘క్యాపిటల్ బీట్: హై- స్టేక్స్’ అనే ఎపిసోడ్ ను అంశం పై నిర్వహిస్తోంది . తాజా ఎపిసోడ్ లో రాజకీయ, ఆర్థికవేత్త మోహన్ గురుస్వామి, ఫెడరల్ ఎడిటర్ ఎస్. శ్రీనివాసన్ పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు.
చైనా అనుసరిస్తున్న వ్యూహాలు, అమెరికన్ వినియోగదారుల పరిస్థితి, మన దేశం ఎలాంటి చర్యలను తీసుకుంటోంది అనే అంశాలకు సమాధానాలు వెతికే పని ప్యానెల్ చర్చాగోష్టి చేసింది.
బీజింగ్ ఎదురుదాడి
ట్రంప్ చేస్తున్న వాణిజ్య యుద్దం మొదట చైనాపైనే ప్రారంభించారు. రెండో టర్మ్ లో చైనా నుంచి మొదలు తన మిత్రదేశాలకు వరకూ విస్తరించారు. ఇందులో భాగంగానే చైనీస్ ఉత్పత్తులపై ఆయన గరిష్టంగా 34 శాతం సుంకాలు విధించారు.
ప్రతిగా చైనా కూడా అంతే స్థాయిలో ఎదురు సుంకాలు విధించింది. ‘‘చైనా ప్రతీకార సుంకాలు ఆశించినవే’’ అని గురుస్వామి అన్నారు. ‘‘వారు దాడి గురించి ఎలాంటి ఉపశమనం ఇవ్వాలని అనుకోవడం లేదు. అమెరికా 34 శాతం విధించింది.
బీజింగ్, వాషింగ్టన్ ఉత్పత్తులపై అంతే స్థాయిలో పన్ను విధించింది. చైనా, అమెరికా నుంచి భారీ స్థాయిలో వ్యవసాయ ఉత్పత్తులు దిగుమతి అవుతుంటాయి. వాటిలో సోయాబీన్స్, గొడ్డు మాంసం(బీఫ్), పంది మాంసం, చికెన్, జోన్నలు వంటివి ప్రధానంగా ఉన్నాయి’’ అని చెప్పారు.
ప్రస్తుతం వీటి ధరలు పెరిగినందు వల్ల అమెరికాను కాదని వేరే దేశాల నుంచి చైనా వాటిని దిగుమతి చేసుకుంటే అమెరికానే అంతిమంగా నష్టపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
‘‘వాల్ మార్ట్ ఒక్కటే 100 బిలియన్ డాలర్ల విలువైన చైనీస్ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటోంది. ’’ అని గురుస్వామి గణాంకాలను వివరించే ప్రయత్నం చేశారు. టారిఫ్ ల దెబ్బతో ధరలు పెరిగి సగటు అమెరికన్ పౌరులు ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆయన హెచ్చరించారు.
కానీ అమెరికా ఉత్పత్తులను చైనా దిగుమతి చేసుకుని నిలిపివేస్తుందని లేదా వేరే దేశాల నుంచి తెచ్చుకునే ప్రమాదం ఉందన్నారు. మాంసపు ఉత్పత్తులు నిల్వ చేసుకునే అవకాశం ఉందని, వీటి వల్ల కొంతకాలం ధరలు చైనాలో స్టెబుల్ గా ఉండే అవకాశం ఉంది.
అంతేకాకుండా ‘‘చైనీయులకు బాధలను తట్టుకోవడం కొత్త కాదు కానీ.. అమెరికన్ల పరిస్థితి మాత్రం అలా కాదు’’ అని ఆయన గురుస్వామి అన్నారు.
ట్రంప్..జూదం..
ట్రంప్ సుంకాలపై ‘ది ఫెడరల్’ ఎడిటర్ ఇన్ చీఫ్ ఎస్. శ్రీనివాసన్ మాట్లాడారు. ఈ సుంకాలు విస్తృత వ్యూహాంలో భాగం అని విశ్లేషించారు. ‘‘ప్రపంచాన్ని కుదిపేసి, ఆపై వన్ టూ వన్ గా ఒక దేశంతో ఒప్పందాలు కుదర్చుకోవాలని ప్రయత్నిస్తున్నాడు’’ అని వివరించాడు.
అయితే శ్రీనివాసన్ అభిప్రాయంతో గురుస్వామి విబేధించారు. ‘‘మీరు యూరప్, చైనాలను మచ్చికచేసుకోలేరు’’ అని ఆయన అన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ డాలర్ తో అనుసంధానం అయి ఉంది. దాని వల్ల ఆర్థిక పరిణామాలు వేగంగా మారే అవకాశం ఉందన్నారు.
ఈ టారిఫ్ ల ప్రకటనను ఆయన నోట్ల రద్దుతో పోల్చారు. ప్రస్తుతం ట్రంప్ ప్రపంచం అర్థం చేసుకోలేని యుద్దం ప్రారంభించాడని, ఇది క్రమంగా అమెరికాపై ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపిస్తుందని అన్నారు.
కొత్త వాణిజ్య కూటములు, కొత్త కరెన్సీలను కోరుకునే అవకాశం ఉంటుందని ఈ పరిణామం వల్ల అమెరికా ఆర్థిక శక్తి మృదువుగా క్షీణిస్తుందని హెచ్చరించారు.
రీ సెట్ అవుతుంది..
ఈ చర్చలలో డాలర్ ఆధిపత్యం , దాని వ్యవస్థ బలం, పతనం గురించి సైతం చర్చించింది. రెండో ప్రపంచ యుద్దం తరువాత డాలర్ ఆధిపత్యం ఎలా ప్రారంభం అయిందో గురుస్వామి వివరించారు.
కానీ ఇప్పడు అమెరికా ఇప్పుడు ఏకపక్షంగా సుంకాలను విధించడంతో ఆ అలవాటు విచ్చిన్నం అవుతోంది. ‘‘మనం కొత్త అలవాట్లలోకి ప్రవేశించవచ్చు. ద్వైపాక్షిక ప్రపంచం మళ్లీ ప్రారంభం అవుతుంది. అంతర్జాతీయ పాలన ముగిసింది’’ అని గురుస్వామి అన్నారు.
డాలర్ ఆధారిత వాణిజ్యం నుంచి ప్రపంచం పక్కకు వైదొలగడం వల్ల చాలా ఎక్కువ ప్రభావం ఉంటుందని మాత్రం అంగీకరించారు. ‘‘డాలర్ పై విశ్వాసం సన్నగిల్లితే మాంద్యం భయాలు కూడా తీవ్రమవుతాయి. ’’ అని ఆయన అన్నారు. యూరప్, చైనాలు తమను తాము రక్షించుకోవడానికి ప్రత్యామ్నాయ వ్యవస్థలు సిద్దం చేసుకునే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
భారత్ పాత్ర ఏంటీ..
ట్రంప్ మొదలు పెట్టిన టారిఫ్ ల యుద్ధంలో భారత్ పై ప్రభావం పై ఇద్దరు అనలిస్టులు నిజాయితీగా తమ అభిప్రాయాలను చెప్పారు. ముందుగా గురుస్వామి మాట్లాడుతూ.. ‘‘ టారిఫ్ ల యుద్ధంలో భారత్ ప్రధాన పాత్ర పోషించదు, కేవలం నిష్క్రియాత్మకంగా ఉంటుంది’’ అన్నారు.
విడిభాగాల పరిశ్రమ, కొన్ని వ్యవసాయ ఉత్పత్తులపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. కానీ భారత్ వాణిజ్య పరిపతి, ఇప్పుడు ప్రపంచానికి సరిపోదని గురుస్వామి బలంగా వాదించారు.
దేశానికి పాఠాలు..
ఈ చర్చ ఆర్థిక ఆత్మపరిశీలన వైపు మళ్లింది. భారత జీడీపీ వృద్దిరేటు ఎఫ్ డీఐ నుంచి జీడీపీ వరకూ గమనిస్తే పెట్టుబడి నిష్ఫత్తులు తగ్గుతున్నాయని గురుస్వామి ప్రస్తావించారు. ‘‘పొదుపులు 36 శాతం నుంచి 28 శాతానికి తగ్గాయి’’ అన్నారు. పెట్టుబడి లేకుండా దేశం అభివృద్ది చెందన్నారు.
దేశీయ తయారీ ఆవిష్కరణలకు మద్దతు ఇవ్వడానికి ఆర్థిక జాతీయవాదం అవసరమన్నారు. టెస్లాను ప్రాధేయపడే బదులు, మహీంద్రా, టాటాకు ప్రొత్సహిస్తే ఉత్తమ ఫలితాలు వస్తాయన్నారు. పాతకాలపు ఆర్థిక జాతీయవాదం గురించి ఆలోచించాల్సిన సమయం వచ్చిందన్నారు.
తరువాత అడుగులు ఎటువైపు..
ప్రస్తుత సంక్షోభాన్ని పాఠంగా తీసుకుని అధిక సుంకాల నిర్మాణాన్ని భారత్ సంస్కరించుకోగలదా అనే ప్రశ్నలను ఎడిటర్ లేవనెత్తారు. దీనికి గురుస్వామి సమాధానమిస్తూ.. విదేశీ ప్రయోజనాలను ఆశించే బదులు మరింత ఆచరణాత్మక విధానాలను స్వీకరించి స్థానిక పరిశ్రమలకు మద్దతు ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
‘‘మనం పెట్టుబడులు పెంచాలి. పొదుపు పెరగాలి. వేరే సత్వర మార్గం లేదు’’ అన్నారు. దేశంలోకి ప్రవహించే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్ డీఐ) రౌండ్ ట్రిప్డ్ దేశీయ పెట్టుబడులే అని ఎత్తిచూపారు.
ప్రపంచ వాణిజ్య పునర్ వ్యవస్థీకరణ దిశలో ఉండగా, భారత్ మాత్రం అడ్డదారిలో ప్రయాణిస్తుందని విమర్శించారు. ఆర్థిక స్వావలంబన దేశానికి మంచి స్థానాన్ని కట్టబెడుతుందన్నారు.
Next Story