సీట్ల సర్దుబాటు తర్వాత మహారాష్ట్ర, యూపీలో పోటీ చేస్తున్నదెవరు?
x

సీట్ల సర్దుబాటు తర్వాత మహారాష్ట్ర, యూపీలో పోటీ చేస్తున్నదెవరు?

మహారాష్ట్ర, యూపీలో సీట్ల కేటాయింపు పూర్తయ్యింది. మరాఠా కమ్యూనిటీ ఓబీసీ రిజర్వేషన్ కల్పించాలని కోరడంతో కీలక ఐదు నియోజకవర్గాల్లో సీట్ల సర్దుబాటు ఆలస్యమైంది.


లోక్‌సభ ఎన్నికల చివరి మూడు దశలు పూర్తి కావడానికి కేవలం పక్షం రోజులు మాత్రమే మిగిలి ఉంది. అధికార భారతీయ జనతా పార్టీ (బిజెపి) మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లో ఎన్‌డిఎ కూటమి సభ్యులతో సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది.
రాష్ట్రంలోని మరాఠా కమ్యూనిటీ ఓబీసీ రిజర్వేషన్లు కల్పించాలని చాలాకాలంగా డిమాండ్ చేస్తోంది. అయితే వారిని ఓబీసీలుగా పరిగణించవద్దని ఇతర ఓబీసీలు రాష్ట్ర ప్రభుత్వానికి ఖరాఖండిగా చెప్పడంతో బీజేపీ-ఎన్డీఏ కూటమి స్తంభించిపోయింది.
మహారాష్ట్రలో ఐదు కీలక స్థానాలివే..
మరాఠా కమ్యూనిటీ ఓబీసీ హోదా డిమాండ్ చేయడంతో కీలకమైన ఐదు లోక్‌సభ స్థానాల్లో సీట్ల కేటాయింపు ఆలస్యమైంది. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన ఈ ఐదు స్థానాల్లోనూ పోటీ చేయాలని పట్టుదలతో ఉంది. అవిభక్త శివసేన పర్భానీ, నాసిక్, థానే, పాల్ఘర్, కళ్యాణ్ అనే ఐదు నియోజకవర్గాలను గెలుచుకోవడంతో ఈ నియోజకవర్గాలను వదులుకునేందుకు షిండే సిద్ధంగా లేరు.
ఈ నియోజకవర్గాలలో కొన్నింటిని వదులుకోమని సీనియర్ బిజెపి నాయకులు షిండేను ఒప్పించడంతో శివసేన మూడు స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకుంది. మిగతా రెండు సీట్లలో ఒకటి బిజెపి, రాష్ట్రీయ సమాజ్ పార్టీకి చెందిన మహాదేవ్ జంకర్‌కు దక్కాయి. రాజీ ఫార్ములా ప్రకారం నాసిక్, కళ్యాణ్, థానేలలో శివసేన, పాల్ఘర్‌లో బీజేపీ, పర్భానీ నియోజకవర్గం నుంచి మహాదేవ్ జంకర్ పోటీ చేస్తుంది.
‘‘ఎన్‌డీఏకి ఆందోళన కలిగించే అంశం OBC అలాగే మరాఠా ఓట్ల విభజన. మెజార్టీ ఓబీసీ కమ్యూనిటీ బీజేపీ, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు ఓటు వేస్తారని స్పష్టమవుతోంది. ఈ ఎన్నికల్లో 48 సీట్లలో ఎక్కువ స్థానాలను ఎన్డీయే గెలుచుకుంటుందన్న నమ్మకం నాకుంది'' అని రాష్ట్రీయ సమాజ్ పార్టీ అధినేత, పర్భానీ నుంచి ఎన్డీయే అభ్యర్థి మహాదేవ్ జంకర్ ది ఫెడరల్‌తో అన్నారు.
జంకర్ పాత్ర ముఖ్యమైనది. ఎందుకంటే ఆయన మరాఠాలను ఒబీసీలుగా పరిగణించాలని మహారాష్ట్ర అంతటా మరాఠాలు నిరసన వ్యక్తం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు. ఐదో దశలో మహారాష్ట్రలోని 13 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనుండగా వీటన్నింటిలోనూ ప్రచారం చేయాలని బీజేపీ సీనియర్ నేతలు జంకర్‌ను కోరారు.
‘‘ఎన్డీయేలో నా పాత్ర స్పష్టం. ఓబీసీ వర్గాల ఓట్లన్నీ బీజేపీ-ఎన్డీఏ అభ్యర్థికి వేయించాలని నన్ను కోరారు. నేను ఇప్పటికే 14 నుంచి 16 లోక్‌సభ నియోజకవర్గాల్లో ప్రచారం చేశాను. మే 20న ఎన్నికలు జరగనున్న మిగిలిన 13 నియోజకవర్గాల్లో కూడా ప్రచారం చేస్తా' అని జంకర్ తెలిపారు.
మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ కీలక రాష్ట్రాలు. ఈ రెండు రాష్ట్రాల నుంచి మొత్తం 128 మంది ఎంపీలున్నారు. వీటిల్లో 2019 ఎన్నికల్లో ఎన్డీయే 103 సీట్లు గెలుచుకుంది.
ఉత్తరప్రదేశ్ కోసం కార్యాచరణ..
రాబోయే రెండు వారాల్లో ఉత్తరప్రదేశ్లో 50శాతానికి పైగా స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. చిన్న పార్టీల డిమాండ్ల విషయంలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల కేటాయింపు ఆలస్యమైంది.
కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్ నేతృత్వంలోని అప్నాదళ్, సుహైల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (SBSJ) చీఫ్ ఓం ప్రకాష్ రాజ్‌భర్ , నిషాద్ పార్టీ తూర్పు ఉత్తరప్రదేశ్‌లో ఎనిమిది లోక్‌సభ స్థానాలను కోరాయి. తూర్పు ఉత్తరప్రదేశ్‌లో ఈ మూడు ప్రాంతీయ పార్టీలు చాలా బలంగా ఉన్నాయి. అప్నా దళ్ కనీసం మూడు నియోజకవర్గాలు, SBSJ మూడు, నిషాద్ పార్టీ రెండు నియోజకవర్గాలను కోరింది.
‘‘అప్నాదళ్ రెండు స్థానాల్లో పోటీ చేస్తోంది. ఎక్కువ సీట్లు కావాలన్న మా డిమాండ్ నెరవేరలేదు. కాబట్టి చర్చించుకోవడంలో అర్థం లేదు. మేం ఎన్డీయేలో భాగమైనందున, కూటమి గెలవడం ముఖ్యం తప్ప పార్టీ వ్యక్తిగత విజయం కాదు’’ అని పార్టీ ఎమ్మెల్యే డా. సునీల్ పటేల్ 'ది ఫెడరల్' అన్నారు. అప్నా దళ్ మీర్జాపూర్, రాబర్ట్స్‌గంజ్ నియోజకవర్గాల నుండి, ఘోసి నుండి SBSJ, భదోహి నుండి నిషాద్ పార్టీ అభ్యర్థులు పోటీ చేయనున్నారు.
2025 నవంబర్‌లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని, ఈ మూడు పార్టీలు ఉత్తరప్రదేశ్, బీహార్ సరిహద్దుల్లోని నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి అవకాశం కల్పిస్తామని బీజేపీ నాయకత్వం వారికి హామీ ఇచ్చింది.
`మేం ఒక రెండు పదవుల గురించి మాట్లాడుకోవడం లేదు. "మేము ఉత్తరప్రదేశ్‌లోని మొత్తం 80 సీట్లను గెలుచుకుని వచ్చే ఏడాది బీహార్‌లో ఎన్‌డిఎ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాము" అని SBSJ జాతీయ ప్రతినిధి అరుణ్ కుమార్ రాజ్‌భర్ ది ఫెడరల్‌తో అన్నారు.
Read More
Next Story