రిజర్వేషన్ల అంశంపై జనయాత్ర చేస్తున్నదెవరు? ఎప్పటి నుంచి?
x

రిజర్వేషన్ల అంశంపై 'జనయాత్ర' చేస్తున్నదెవరు? ఎప్పటి నుంచి?

రిజర్వేషన్ల అంశంపై జూలై 25 నుంచి మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో 'ఆరక్షన్‌ బచావో జనయాత్ర' నిర్వహించనున్నట్లు ఆ పార్టీ చీఫ్‌ ప్రకాశ్‌ అంబేద్కర్‌ తెలిపారు.


రిజర్వేషన్ల అంశంపై వంచిత్‌ బహుజన్‌ అఘాడీ (వీబీఏ) ఆధ్వర్యంలో జూలై 25 నుంచి మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో 'ఆరక్షన్‌ బచావో జనయాత్ర' నిర్వహించనున్నట్లు ఆ పార్టీ చీఫ్‌ ప్రకాశ్‌ అంబేద్కర్‌ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. దరఖాస్తు చేసుకోకుండా జారీ చేసిన కుంబీ కుల ధ్రువీకరణ పత్రాలను రద్దు చేయాలని, రిజర్వేషన్ల అంశంపై రాజకీయ పార్టీలు తమ వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

"సేజ్ సోయారే" (రక్త సంబంధీకులు) నోటిఫికేషన్‌ అమలు చేయాలనే డిమాండ్ సరికాదని, న్యాయస్థానాలు దీనికి వ్యతిరేకంగా గతంలో నిర్ణయాలు ఇచ్చాయని కూడా ఆయన గుర్తుచేశారు.

కాగా మరాఠా కమ్యూనిటీ సభ్యులను "సేజ్ సోయారే"గా గుర్తిస్తూ డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ అమలు చేయాలని ఉద్యమకారుడు మనోజ్ జరంగే డిమాండ్ చేస్తున్నారు. మరాఠాలందరికీ కుంబీ సర్టిఫికెట్లు జారీ చేయడం ద్వారా ఆ కోటా ప్రయోజనాలకు పొందుతారని పేర్కొన్నారు.

కుంబీ ఒక అగ్రకుల సమూహం. ఇతర వెనుకబడిన తరగతుల (OBC) వర్గంలో భాగం. అయితే ముసాయిదా నోటిఫికేషన్‌ను రద్దు చేయడంతో పాటు తమ కోటాను తగ్గించబోమని హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇటీవల ఓబీసీ కార్యకర్తలు కొందరు ఆందోళనకు దిగారు.

"రాష్ట్రంలో రెండు గ్రూపులు (OBC, మరాఠా) ఉన్నాయి. OBC నాయకులు మాత్రం ఈ విషయంలో భయపడుతున్నారు. ధనిక మరాఠా వర్గానికి శివసేన (UBT), కాంగ్రెస్, ఎన్సీపీ (శరద్ పవార్), బీజేపీ తమ వైఖరిని స్పష్టం చేయకుండా ఈ సమస్యకు పరిష్కారం దొరకదు’’ అని అంబేద్కర్ అన్నారు. కోటా విషయంలో ఓబీసీ నాయకులు తమ వైఖరిని సమర్థించారని, గ్రామాల ప్రజల్లో ఈ సమస్యపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు.

ముంబైలోని తన తాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మారక 'చైత్యభూమి', పూణేలోని సంఘ సంస్కర్త జ్యోతిబా ఫూలే నివాసాన్ని సందర్శించిన తర్వాత జూలై 25 న 'ఆరక్షన్ బచావో జనయాత్ర' ప్రారంభమవుతుందని VBA చీఫ్ చెప్పారు.

యాత్ర షెడ్యూల్..

"ఈ యాత్ర కొల్హాపూర్ (జూలై 26న), సాంగ్లీ, షోలాపూర్, ధారశివ్, బీడ్, లాతూర్, నాందేడ్, యవత్మాల్, అమరావతి, అకోలా, బుల్దానా, వాషిం, జల్నా జిల్లాలకు మీదుగా సాగుతుంది. ఆగస్టు 7 లేదా 8 తేదీల్లో ఛత్రపతి సంభాజీనగర్‌లో ముగుస్తుంది. " అని చెప్పారు.

ఎస్సీ/ఎస్టీ విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు రెట్టింపు చేయడం, ఓబీసీ విద్యార్థులకు అదే స్కాలర్‌షిప్ ఇవ్వడం, ఎస్సీ/ఎస్టీ, ఓబీసీలకు ఉద్యోగాల్లో పదోన్నతి కల్పించాలనే డిమాండ్‌పై అవగాహన కల్పిస్తాం. ఎలాంటి స్టాండ్ తీసుకోని పార్టీలపై ఒత్తిడి తెస్తాం. ” అని ప్రకాష్ అంబేద్కర్ అన్నారు.

కార్యకర్త జారంగే నిరసనపై మాట్లాడుతూ.. ఆయన ర్యాలీలకు ప్రజలు హాజరవుతున్నా.. ఏ దిశలో ఆందోళన సాగుతుందో స్పష్టంగా తెలియడం లేదన్నారు. ధనిక మరాఠా కమ్యూనిటీతో ఉన్నాడా? లేక పేద మరాఠాలతో ఉన్నాడా? అనే దానిపై జరంగే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు ప్రకాశ్‌ అంబేద్కర్‌.

Read More
Next Story