రాహుల్ వయనాడ్ నుంచే పోటీ చేయాలంటున్నది ఎవరు?
x

రాహుల్ వయనాడ్ నుంచే పోటీ చేయాలంటున్నది ఎవరు?

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ .. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.


లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ .. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలయిన కర్ణాటక లేదా తెలంగాణ నుంచి పోటీ చేస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాని కేరళ పీసీసీ నాయకత్వం మాత్రం రాహుల్‌ వయనాడ్ నుంచి పోటీ చేయాలని కోరుతోంది.

ఈ విషయంపై కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు వీడీ సతీషన్ మాట్లాడుతూ.. ‘‘రాహుల్ గాంధీ ఎక్కడి నుంచి పోటీచేస్తారన్న విషయం ఇంకా తేలాల్సి ఉంది. అధిష్టానం నిర్ణయం మేరకు ఆయన పోటీ చేస్తారు. పార్టీ యూనిట్ మాత్రం రాహుల్ ఇక్కడి నుంచే పోటీచేయాలని కోరుకుంటోంది. కేరళ పీసీసీతో పాటు యూడీఎఫ్ కూడా ఇదే భావన’’ అని చెప్పారు.

ఇక్కడి నుంచి సీపీఐ నుంచి అగ్రనేత అన్నె రాజ పోటీ చేస్తున్నారు కదా.. అని అడిగిన ప్రశ్నకు.. ‘‘కేరళలో రాజకీయ పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. అది అందరికి తెలుసు. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు రెండూ ఇండియా కూటమిలో భాగస్వాములే. కనుక అది పెద్ద సమస్య కాదు’’ అని అన్నారు.

2019తో రాహుల్ విజయం

తమిళనాడులో గత ఎన్నికలలో కాంగ్రెస్, డీఎంకే, సీపీఐ, సీపీఎం కలిసి పోరాడాయి. అదే పని ఇప్పుడు కేరళలో సీపీఐ (ఎం) రిపీట్ అవుతుందన్నారు. రాహుల్ గాంధీ 2019 ఎన్నికలలో వయనాడ్ నుంచి పోటీ చేసి దాదాపు నాలుగు లక్షలకు పైగా మెజారిటీ సాధించారు.

Read More
Next Story