
ఫోరెన్సిక్ ల్యాబ్ మొదటి అంతస్తులో మాత్రమే అగ్నిప్రమాదం ఎందుకు జరిగింది ?
1100 కేసులకు సంబంధించిన సాక్ష్యాల డేటా రికవరీ సాధ్యంకాదని నాగ్ పూర్ నుండి వచ్చిన నిపుణుల బృందం ఫెరెన్సిక్ ల్యాబ్ డైరెక్టర్ కు స్పష్టంచేసింది
ఈనెల 7వ తేదీన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీలో జరిగిన అగ్నిప్రామదంలో దగ్ధమైపోయిన ఆధారాలను తిరిగి రాబట్టడం కష్టమని తేలిపోయింది. అగ్నిప్రమాదంలో కంప్యూటర్లు, హార్డ్ డిస్క్ లు కాలి బూడిదైపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో సుమారు 1100 కేసులకు సంబంధించిన కీలకమైన సాక్ష్యాల డేటా రికవరీ సాధ్యంకాదని నాగ్ పూర్ నుండి వచ్చిన నిపుణుల బృందం శనివారం ఈ విషయాన్ని ఫెరెన్సిక్ ల్యాబ్ డైరెక్టర్ కు
స్పష్టంచేసింది. అగ్నిప్రమాదంలో మొత్తం 1100 ఫైళ్ళు దగ్ధం అయిపోయిన విషయం అందరికీ తెలిసిందే.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకునోటు కేసు, ఎంఎల్ఏల కొనుగోలు, టెలిఫోన్ ట్యాపింగ్ లాంటి అనేక రాజకీయంగా కీలకమైన కేసుల దర్యాప్తు నివేదికలు, ఆధారాలు రెండో అంతస్తులోనే ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. అందుకనే అగ్నిప్రమాదం జరిగిన వెంటనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంఎల్సీ అద్దంకి దయాకర్, ఎంపీ చామల కిరణ్ కుమార్ తదితరుల మధ్య పెద్దఎత్తున ఆరోపణలు, ప్రత్యారోపణలు జరిగిన విషయం గుర్తుండే ఉంటుంది.
ఏ కేసుల ఆధారాలున్నాయి
పైన చెప్పిన కేసుల ఆధారాలతో పాటు రాష్ట్రంలోని అనేకచోట్ల జరిగిన హత్యలు, దోపిడీలు, దొంగతనాలు, మానభంగాలకు సంబంధించిన శాస్త్రీయ ఆధారాలు, వేలిముద్రలు, అనేక రకాల విషాలు, మత్తుపదార్ధాలు, తుపాకులు, బుల్లెట్లతో పాటు సంతకాలు చేసిన డాక్యుమెంట్లు, అనేక పత్రాలున్నాయి. వీటి ఆధారంగా అనేక కేసులను విశ్లేషించి, ఫలితాలను శాస్త్రీయంగా సిద్ధంచేస్తారు. ఇలాంటి సాంకేతిక విశ్లేషణలను రెండోఅంతస్తులోని బీరువాల్లోను, కంప్యూటర్లలోను నిక్షిప్తమైనాయి. మంటల్లో కాలిబూడిదైపోయిన కారణంగా ఆధారాలతో పాటు విశ్లేషణలను తిరిగి రాబట్టడం కష్టమని నిపుణుల బృందం తేల్చిచెప్పేసింది.
ఫోరెన్సిక్ ల్యాబ్ గ్రౌండ్ ఫ్లోర్ కు ఏమీకాలేదు, రెండో అంతస్తులోను మంటలు వ్యాపించలేదు. కేవలం మొదటి అంతస్తు మాత్రమే మంటల్లో కాలిబూడిదైపోవటంతో చాలామందిలో అనేక అనుమానాలు పెరిగిపోతున్నాయి. కింది అంతస్తు, పై అంతస్తులో ప్రమాదం జరగకుండా కేవలం మొదటి అంతస్తులో మాత్రమే అగ్నిప్రమాదం ఎలాగ జరిగింది అన్న విషయమే ఎవరికీ అర్ధంకావటంలేదు. నిజానికి రెండో అంతస్తులోనే అగ్నిప్రమాదం జరిగేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి.
కాలిపోయినవి ఏమిటి ?
ఎలాగంటే ఫోరెన్సిక్ పరికరాలు, రశాయనాలు, కెమికల్ ల్యాబ్ మెటీరియల్ ఉంటుంది. మొదటి అంతస్తులో కేవలం కంప్యూటర్లు, హార్డ్ డిస్క్ లు, బీరువాలు కొంత ఫర్నీచర్ మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇక్కడ అగ్నిప్రమాదం జరగాల్సిన అవసరం కూడా లేదు. అయినా అగ్నిప్రమాదం జరగటం, అనేక కేసుల్లో కీలకమైన ఆధారాలు, విశ్లేషణల ఫైళ్ళు దగ్ధమైపోవటమే ఆశ్చర్యంగా ఉంది.
ల్యాబ్ డైరెక్టర్ శిఖాగోయెల్ మీడియాతో మాట్లాడుతు ఓటుకునోటు కేసుకు సంబంధించిన ఆధారాలు తమ దగ్గర లేదని క్లారిటి ఇచ్చారు. ఆ కేసుకు సంబంధించిన ఆధారాలన్నీ ఏసీబీ కోర్టులో భద్రంగా ఉన్నట్లు చెప్పారు. అలాగే అగ్నికి ఆహుతైన మొదటి అంతస్తులో కేవలం 7 కేసులకు సంబంధించిన ఎవిడెన్స్ ఫైళ్ళు మాత్రమే ఉందన్నారు. ఆ ఏడు కేసులు ఏవి, దగ్ధమైపోయిన ఆధారాలు ఏమిటి అని మాత్రం డైరెక్టర్ చెప్పలేదు.

