ఆ ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ను ఎందుకు వీడారు?
హస్తం పార్టీకి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇటీవల ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ పార్టీకి గుడ్ బై చెప్పారు. తాజాగా మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు అదే బాట పట్టారు.
ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్ లవ్లీ తన పదవికి రాజీనామా చేసిన తర్వాత కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు నీరజ్ బసోయా, నసీబ్ సింగ్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.
కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేకు ఇద్దరు నేతలు వేర్వేరుగా తమ రాజీనామా లేఖలను పంపారు. కాంగ్రెస్ ఆప్‌తో జతకట్టడాన్ని వారు ప్రధానంగా తప్పుబట్టారు.
బసోయా తన లేఖలో ఇలా పేర్కొన్నాడు.. “ఆప్ వ్యవహార శైలి వల్ల ఢిల్లీ కాంగ్రెస్ కార్యకర్తలకు చెడ్డపేరు వస్తుంది. ఆత్మగౌరవం ఉన్న పార్టీ నాయకుడిగా ఇకపై పార్టీలో కొనసాగలేను. ఆప్‌తో పొత్తు కూడా ఒక కారణమని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఢిల్లీ యూనిట్ చీఫ్ లవ్లీ తన పదవికి రాజీనామా చేసిన కొద్ది రోజుల తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది.
తాత్కాలిక అధ్యక్షుడిగా దేవేందర్ యాదవ్..
కాంగ్రెస్ ఢిల్లీ యూనిట్ తాత్కాలిక అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే దేవేందర్ యాదవ్‌ను మంగళవారం నియమించారు. 2008, 2013లో ఢిల్లీలోని బద్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొంది 2015లో ఆప్ అభ్యర్థి అజేష్ యాదవ్ చేతిలో ఓడిపోయిన యాదవ్ ప్రస్తుతం పంజాబ్ ఏఐసీసీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు