ఆప్ ప్రచార గీతాన్ని మార్చాలన్న ఈసీ.. ఎందుకు?
x

ఆప్ ప్రచార గీతాన్ని మార్చాలన్న ఈసీ.. ఎందుకు?

పార్టీ అభ్యర్థులు తమ పేరు కలిసొచ్చేలా పాటలు రాయించుకోవడం, ప్రచారంలో వాటిని వినిపించడం కామన్. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రచార గీతం మాత్రం కాస్త డిఫరెంట్‌గా ఉంది.


ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ప్రచార గీతం ఢిల్లీలో దుమారం రేపుతోంది. ఆ పాట ఎన్నికల నిబంధనావళికి వ్యతిరేకంగా ఉందని ఎలక్షన్ కమిషన్ పేర్కొంది. పాటలోని కొన్ని పదాలను మార్చాల్సి ఉందని ఆప్ నేతలకు సూచించింది.

'జైల్ కా జవాబ్, వోట్ సే దేంగే'..

'జైల్ కా జవాబ్, వోట్ సే దేంగే' (మా నేతలను జైల్లో వేసినందుకు ఓటుతో సమాధానమిస్తాం) అంటూ సాగే ప్రచార గీతంపై ఎన్నికల కమిషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎన్నికల నిబంధనావళి ఉల్లంఘిచేలా ఉందని ఈసీ పేర్కొంది.

ఆప్ ఎమ్మెల్యే దిలీప్ పాండే రాసి, పాడిన రెండు నిమిషాల ఈ ప్రచార గీతాన్ని గత వారం పార్టీ ప్రధాన కార్యాలయంలో విడుదల చేశారు.

అలాగే కటకటాల వెనుక ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఫోటోను జనం ఎత్తి చూపడం, జైలులో ఉన్న ఆప్ నేత మనీష్ సిసోడియా చుట్టూ పోలీసుల ఎస్కార్ట్ ఉన్నట్లు చూపించడాన్నిఈసీ తప్పుబట్టింది.

కాగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించేలా ఉందంటూ తమ గీతాన్ని ఈసీ నిషేధించడంపై ఆప్ మంత్రి ఆతిశీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ప్రచార గీతంలో ఎక్కడా బీజేపీ పేరు ప్రస్తావించలేదు. కానీ భారత ఎన్నికల సంఘం మాత్రం ఆంక్షలు విధించింది. అంటే ఈ దేశంలో బీజేపీ నియంతృత్వ పాలన సాగిస్తోందని ఎన్నికల సంఘం చెప్పకనే చెప్పింది’’ అని ఆతిశీ ఆరోపించారు.

Read More
Next Story