హైదరాబాద్‌లో నేరాలెందుకు పెరిగాయ్!
ఈ ఏడాది జరిగిన నేరాలపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి
భాగ్యనగరంలో ఈ ఏడాది జరిగిన నేరాలపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి నివేదిక విడుదల చేశారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఓవరాల్ నేరాలు 2 శాతం పెరిగాయని తెలిపారు. ఈ ఏడాదిలో 24 వేల 821 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని చెప్పారు. మహిళలపై జరిగిన నేరాలు 12 శాతం మేర పెరిగాయని, 9 శాతం మేర దోపిడీలు పెరిగాయని వెల్లడించారు. ఇక చిన్నారులపై జరిగిన నేరాలు 12 శాతం మేర తగ్గాయన్నారు.
5వేల చీటింగ్ కేసులు, 79 హత్యలు...
79 హత్యలు 79, 403 రేప్ కేసులు, 242 అపహరణ కేసులు, 4 వేల 909 చీటింగ్ కేసులు నగరంలో నమోదైనట్టు సీపీ వివరించారు. ఇక 2 వేల 637 రోడ్డు ప్రమాదాలు, 262 హత్యాయత్నాలు జరిగాయని తెలిపారు. 91 చోరీలు రికార్డయ్యాయని సీపీ చెప్పారు. ఈ ఏడాది 63 శాతం మంది నేరస్తులకు శిక్షలు పడ్డాయని, వారిలో 13 మందికి జీవిత ఖైదీ శిక్ష పడిందని పేర్కొన్నారు.
19 శాతం పెరిగాయి..
గతేడాదితో పోలిస్తే అత్యాచారాలు 19 శాతం పెరిగాయని సీపీ తెలిపారు. మత్తు పదార్థాలు వాడిన 740 మందిని అరెస్టు చేశామని సీపీ వెల్లడించారు. డ్రగ్స్ కేసులో 13 మంది విదేశీయులను అరెస్టు చేశామని చెప్పారు. ఇక రాష్ర్ఠంలో డ్రగ్స్ అనే మాట వినపడొద్దని, డ్రగ్స్ సరఫరా చేసే వారిని ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుంటామని హెచ్చరించారు సీపీ. గంజాయి వాడకంపై కూడా కూడా నిఘా పెంచామని వివరించారు. ఇక డ్రగ్స్‌ను పట్టుకునేందుకు స్నైపర్ డాగ్స్‌కు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చామన్నారు.
11 శాతం పెరిగిన సైబర్ నేరాలు
గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది సైబర్ నేరాలు 11 శాతం పెరిగాయని చెప్పారు హైదరాబాద్ పోలీస్ బాస్. ఈ ఏడాది ఇన్వెస్టమెంట్ స్కీమ్‌ల ద్వారా 401 కోట్ల రూపాయల విలువైన మోసాలు జరిగాయని చెప్పారు. సైబర్ క్రైమ్స్‌కు పాల్పడిన 650 మందిని అరెస్టు చేశామన్నారు. ఇక మల్టీ లెవల్ మార్కెటింగ్ మోసాలు 152 కోట్ల రూపాయల విలువైనవి జరిగాయన్నారు. 10 వేల కోట్ల రూపాయలకు పైగా ఆర్థిక నేరాలు జరిగాయని, భూ కుంభకోణాల్లో 245 మందిని అరెస్టు చేశామని తెలిపారు.
Next Story