ఆప్‌ చీఫ్‌ కేజ్రీవాల్‌ను అరెస్టు చేస్తారా?
x

ఆప్‌ చీఫ్‌ కేజ్రీవాల్‌ను అరెస్టు చేస్తారా?

మనీ లాండరింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) చీఫ్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేస్తుందా? ఆ పార్టీ నేతలేమంటున్నారు?


ఆప్‌ చీఫ్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను అరెస్టు చేస్తారన్న వార్తలు గుప్పుమనడంతో ఆయన ఇంటికి ఆప్‌ నేతలు క్యూ కడుతున్నారు. మరోవైపు కేజ్రీవాల్‌ ఇంటి చుట్టూ గురువారం ఢిల్లీ పోలీసులు భద్రతను పెంచారు.

‘‘ముఖ్యమంత్రి ఇంటికి వెళ్లే మార్గాలను మూసివేశారు. అన్ని ఎంట్రీ, ఎగ్జిట్‌ పాయింట్ల వద్ద పోలీసులు మొహరించారు. సాధారణంగా ముఖ్యమంత్రి ఇంటి వద్ద ఉంటే పోలీసు సిబ్బందిని కూడా లోపలికి వెళ్లనివ్వడం లేదు’’ అని ఆప్‌ వర్గాలు పీటీఐకి తెలిపాయి.

తాజాగా మరోసారి సమన్లు..

55 ఏళ్ల ఆప్‌ జాతీయ కన్వీనర్‌ మూడోసారి ఈడీ ముందు హాజరుకావడానికి నిరాకరించారు. ఈడీ మొండిగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమన్ల జారీ చట్టవిరుద్ధమని కేజ్రీవాల్‌ పంపిన ఐదు పేజీల ప్రత్యుత్తరాన్ని ఈడీ పరిశీలిస్తోంది. ఈడీ ముందు ఈ సారి కూడా హాజరు కాకపోతే .. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) కింద ఈడీ నాల్గోసారి సమన్లు జారీ చేయవచ్చని సమాచారం.

అరెస్ట్‌ అలర్ట్‌..

కేజ్రీవాల్‌ను అరెస్టు వార్తల నేపథ్యంలో కొందరు ఆప్‌ నాయకులు అలర్ట్‌ అయ్యారు. తమ ఆందోళనను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసారు. గురువారం కేజ్రీవాల్‌ నివాసంపై ఈడీ దాడి చేసి అతన్ని అరెస్టు చేయవచ్చని వారి పోస్టుల్లో సారాంశం.

‘‘అరవింద్‌ కేజ్రీవాల్‌ నివాసంపై ఈ ఉదయం ఈడీ దాడి చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అరెస్టు చేసే అవకాశం ఉంది.’’ అని ఢల్లీి క్యాబినెట్‌ మంత్రి, ఆప్‌ నాయకుడు అతిషి బుధవారం రాత్రి ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి ఇంటిపై దాడికి అవకాశం ఉందని ఆప్‌ నాయకుల మాటల నేపథ్యంలో భద్రత పెంచామని ఢల్లీి పోలీసు సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు.

‘‘ముఖ్యమంత్రి సెక్యూరీటి సిబ్బందిని ఆపలేదు,’’ అని మరొక పోలీసు అధికారి చెప్పారు. పోలీసు బలగాల మోహరింపు ‘‘సాధారణ విస్తరణ’’నేనని పేర్కొన్నారు.

Read More
Next Story