
రష్యా నుంచి చమురు దిగుమతులు మళ్లీ పెరుగుతాయా?
అమెరికా ఆంక్షలను భారత్ పట్టించుకోవట్లేదా? కారణం ఏంటీ?
ప్రసన్న మొహంతి
అమెరికా గత నెల నవంబర్ 21 న రెండు రష్యన్ ముడి చమురు కంపెనీలైన రాస్ నెఫ్ట్, లుకోయిల్ పై ఆంక్షలు విధించింది. తరువాత ఊహించిన విధంగానే డిసెంబర్ లో రష్యా నుంచి భారత్ ముడిచమురు దిగుమతి బాగా పడిపోయింది.
మొత్తం ముడి చమురు దిగుమతుల్లో రష్యన్ వాటా నవంబర్ 36.3 శాతం అంటే రోజుకు 1.84 మిలియన్ బ్యారెల్లు నుంచి డిసెంబర్ 25 వరకూ 24.1 శాతానికి అంటే రోజుకు 1.2 మిలియన్ బ్యారెళ్లకు పడిపోయింది.
ఈ ఏడాది జూన్ లో భారత్, రష్యా నుంచి ముడి చమురు దిగుమతులు 44.4 శాతానికి చేరుకున్నాయి. ఆ తరువాత అది క్రమంగా క్షీణించడం ప్రారంభమయింది. దీనికి ప్రధాన కారణం ట్రంప్ భారత్ ను నేరుగా బెదిరించడం, తరువాత సుంకాల మోత మోగించడం.
రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ద్వారా ఉక్రెయిన్ పై యుద్దానికి పరోక్షంగా భారత్ సాయం చేస్తుందని ట్రంప్ ఆరోపించారు. దీనితో అక్టోబర్ లో రష్యన్ ఆయిల్ వాటా 33 శాతానికి తగ్గింది. అయితే ఫ్రంట్ లోడింగ్ కారణంగా నవంబర్ లో మరోసారి ఆయిల్ వాటా 36.3 శాతానికి పెరిగింది.
పెరుగుదలకు కారణాలు..
అయితే జనవరి నుంచి రష్యా నుంచి ఆయిల్ దిగుమతులు మరోసారి పెరిగే అవకాశం కనిపిస్తోంది. దీనికి మూడు కారణాలు ఉన్నాయి. ఒకటి నవంబర్ 21 నుంచి రాస్ నెఫ్ట్ నుంచి ముడి చమురు స్వీకరించడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ వాషింగ్టన్ నుంచి ఒక నెల రాయితీ పొందిందని రాయిటర్స్ వెల్లడించింది. రిలయన్స్ ప్రపంచ లాభాలను ఆస్వాదిస్తున్నట్లు చమురు పరిశ్రమ వర్గాలు చెబుతున్న మాట.
రెండో కారణం ఏంటంటే.. రియల్ టైమ్ డేటా, అనలిటిక్స్ ప్రొవైడర్ అయిన కెప్లర్ ప్రకారం.. నయారా ఎనర్జీకి రాస్ నెప్ట్ లో 49 శాతం వాటా ఉంది. దీనివల్ల ఇది ఆయిల్ నిరంతర సరఫరాకు దారితీసే అవకాశం ఉంది. ఇందుకోసం కొత్తమధ్యవర్తిత్వ కంపెనీలు పుట్టుకొచ్చాయి. ఆకర్షణీయ డిస్కౌంట్ కారణం కూడా మరో కారణం.
మూడో ముఖ్యకారణం..రష్యన్ ముడి చమురుపై మృదువుగా వ్యవహరించినట్లు కనిపిస్తోంది. తద్వారా ఒత్తిడిని తగ్గించింది. ఇది ఇతర రష్యన్ సరఫరాదారులపై ఆంక్షలు ఇంకా ముందుకు తీసుకెళ్లలేదు. దిగుమతిదారులపై రెండో రౌండ్ ఆంక్షలు ప్రకటించలేదు. ప్రస్తుతం రాస్ నెప్ట్ నుంచి నయారా ఎనర్జీపై ఎలాంటి ఆంక్షలు లేదు.
అమెరికా వాటా పెరగలేదు
భారత్ మొత్తం ముడి చమురు దిగుమతుల్లో అమెరికా వాటా 11.6 శాతానికి చేరుకున్న తరువాత దాని వాటా నవంబర్ 8.9 శాతానికి ఆ తరువాత డిసెంబర్ లో 7.5 శాతానికి చేరింది. అలాగే మధ్య ప్రాచ్య దేశాల వాటా 40 శాతం కంటే తగ్గిపోయింది. జనవరి 2025 నుంచి భారత్ మొత్తం చమురు దిగుమతుల్లో రష్యా- అమెరికా వాటా క్రింది విధంగా ఉంది.
49.2 శాతం ముడి చమురు ఉత్పత్తి చేసే రెండు రష్యన్ మేజర్లు అయిన రాస్ నెప్ట్, లుకోయిల్ భారత్ దిగుమతులను ఎంత దోహదం చేశాయా? మొత్తం రష్యన్ ముడి చమురు లో క్యాలెండర్ సంవత్సరంలో రాస్ నెప్ట్ వాటా సగటున 54 శాతం ఉండగా, లుకోయిల్ వాటా 15.8 శాతంగా ఉంది. డిసెంబర్ లో రాస్ నెప్ట్ వాటా 63.4 శాతం, లుకోయిల్ వాటా 4.5 శాతంగా ఉంది.
రష్యా ముడి చమురు సరఫరా వాటాలను గ్రాఫ్ లలో చూస్తే..
డిసెంబర్ లో రష్యన్ ముడి చమురు సరఫరదారులలో రాస్ నెప్ట్, మోర్ ఎక్స్ పెర్ట్, జరుబెన్ నెప్ట్, రెడ్ ఉడ్ గ్లోబల్ సప్లై, వంటివి ఉన్నాయని కెప్లర్ డేటా చూపిస్తుంది.
నెమ్మదిగా పెరుగుదల..
కెప్లర్ ప్రధాన పరిశోధన విశ్లేషకుడు సుమిత్ రిటోలియా ప్రకారం.. జనవరిలో రష్యన్ ముడి చమురు దిగుమతులు ‘‘నెమ్మదిగా స్థిరంగా పెరుగుతాయని’’ అంచనా వేస్తున్నారు. ‘‘ఇటీవల కొత్తగా పుట్టుకొచ్చిన మధ్యవర్తులు, స్థితిస్థాపకత, ఆకర్షణీయమైన తగ్గింపులను కూడా కారణంగా చెప్తున్నారు.
‘‘రిఫైనర్లు నిబంధనలకు లోబడి నియమించబడని సరఫరాదారులకు కట్టుబడి ఉన్నంతకాలం, కొనుగోళ్లు కొనసాగుతాయి’’ అని ఆయన అన్నారు. రష్యన్ ముడిచమురు కొనుగోలు కొనసాగుతాయి అది కూడా మధ్యవర్తిత్వాలు ద్వారానే.
బారెల్స్ ను మూడ పార్టీ ట్రేడింగ్ సంస్థల ద్వారా సరఫరా చేస్తే, అవి రోస్ నెప్ట్, లుకో యిల్ కాదని ఆంక్షలు విధిస్తే చెప్పగలరు. ఇది రిఫైనర్ల నుంచి కాదని వేరే నుంచి సేకరిస్తున్నామని చెప్పవచ్చు.
Next Story

