మహారాష్ట్రలో సీట్ల సర్దుబాటుపై రాహుల్ చర్చలు ఫలిస్తాయా?
x

మహారాష్ట్రలో సీట్ల సర్దుబాటుపై రాహుల్ చర్చలు ఫలిస్తాయా?

లోక్ సభ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. ఇటు సీట్ల సర్దుబాటుపై ఇండియా కూటమి భాగస్వామ పార్టీలతో సంప్రదింపులు జరుపుతోంది.


లోక్ సభ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. ఇటు సీట్ల సర్దుబాటుపై ఇండియా కూటమి భాగస్వామ పార్టీలతో సంప్రదింపులు జరుపుతోంది. అందులో భాగంగానే రాహుల్ గాంధీ మహారాష్ట్ర శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేతో సంప్రదింపులు జరుపుతున్నారు.
మహారాష్ర్టలో మొత్తం 48 ఎంపీ స్థానాలున్నాయి. ముంబైలోని ఆరు లోక్‌సభ స్థానాల్లో మూడింటిలో పోటీ చేయడానికి కాంగ్రెస్ ఆసక్తి చూపుతోంది. ముంబై సౌత్ సెంట్రల్, ముంబై నార్త్ సెంట్రల్, ముంబై నార్త్ వెస్ట్. మరోవైపు ముంబైలోని నాలుగు - ముంబై సౌత్, ముంబై నార్త్ వెస్ట్, ముంబై నార్త్ ఈస్ట్ ముంబై సౌత్ సెంట్రల్‌తో సహా రాష్ట్రంలోని 18 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయాలని శివసేన భావిస్తోంది.
మహా వికాస్ అఘాడి (MVA) కూటమిలో భాగస్వాములైన కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే (శివసేన) శరద్ పవార్ (NCP) దాదాపు 40 సీట్లపై ఒప్పందం కుదుర్చుకోగలిగారు. అయితే మిగిలిన ఎనిమిది స్థానాలపై అవగాహనకు రావాల్సి ఉంది.
మాజీ సీఎం అశోక్ చవాన్, కేంద్ర మాజీ మంత్రి మిలింద్ దేవరా వంటి కీలక కాంగ్రెస్ నాయకులు పార్టీని వీడడంతో ఎంవిఎ నియోజకవర్గాల సీట్ల సర్దుబాటుపై కొలిక్కి రావడం కొంత కష్టంగా మారిందని సమాచారం. కాంగ్రెస్ ఫిరాయింపుల తర్వాత ముంబయి సీట్లలో థాకరే పార్టీకి ఎక్కువ వాటా కావాలని పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది.
ఏది ఏమైనా ఠాక్రే, పవార్, రాహుల్, మల్లికార్జున్ ఖర్గే బీజేపీని ఎదుర్కోడానికి గట్టిగానే ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.
అవిభక్త శివసేన 2019 లోక్‌సభ ఎన్నికల్లో 48 స్థానాలకు 22 స్థానాల్లో పోటీ చేసి, ముంబైలో మూడింటితో పాటు 18 స్థానాల్లో విజయం సాధించింది. అయితే, మహారాష్ట్ర రాష్ట్ర ఎన్నికల తర్వాత భాగస్వామ్య పార్టీతో ఏర్పడ్డ విభేదాల కారణంగా బీజేపీతో బంధాన్ని తెంచుకుంది.
గత ఏడాది జూన్‌లో శివసేన, ఏక్‌నాథ్ షిండేల మధ్య విభేదాలు ఏర్పడి బీజేపీతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో థాకరే నేతృత్వంలోని ఎంవీఏ ప్రభుత్వం కూలిపోయింది. తరువాత, శరద్ పవార్ నేతృత్వంలోని MVA ఇతర భాగం, NCP కూడా అతని మేనల్లుడు అజిత్ పవార్ సంకీర్ణ ప్రభుత్వంలో చేరడంతో చీలికను చవిచూసింది.
Read More
Next Story