తమిళనాడులో బీజేపీ పట్టు సాధిస్తుందా? దశాబ్దాల కల నెరవేరుతుందా?
x

తమిళనాడులో బీజేపీ పట్టు సాధిస్తుందా? దశాబ్దాల కల నెరవేరుతుందా?

తమిళనాట బీజేపీ దశాబ్దాల కల నెరవేరుతుందా? రాష్ట్ర బీజేపీ చీఫ్ అన్నామలై అందుకు తగట్టుగానే కసరత్తు చేస్తున్నారా?


కమలనాధులు దక్షిణాదిపై పట్టుకోసం వేచిచూస్తున్నారు. కీలక రాష్ట్రమైన తమిళనాడులో బీజేపీ జెండా ఎగరేయాలని దశాబ్దాలుగా ఉవిల్వూరుతున్నారు. ఎన్నికల రూపంలో రాష్ట్రంలో తమ బలం నిరూపించుకునేందుకు అవకాశం కూడా వచ్చింది.

400 లోక్ సభ స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా ప్రధాని మోదీ శ్రమిస్తున్నారు. వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తూ.. ప్రతిపక్షాలపై విరుచుకుపడుతున్నారు. ఇక తమిళనాడు బీజేపీ చీఫ్ కె అన్నామలై కూడా పార్టీని గెలిపించే బాధ్యతను భుజనా వేసుకున్నారు. ఆయనపై అధిష్టానం కూడా అంతే నమ్మకం పెట్టుకుంది.

అయితే చాలా మంది విమర్శకులు ఎన్నికల ఫలితాలు ప్రకటించినప్పుడు అతను గుచ్చుకున్న బెలూన్ లాగా ఉంటారని భావిస్తున్నారు.

తొలుత వెనకంజ..

అన్నామలై ఎన్నికలలో పోటీ చేయడానికి తొలుత ఆసక్తి చూపలేదట. పార్టీ గెలుపు లక్ష్యంగా ఎన్నికల వ్యూహరచన, అభ్యర్థుల తరుపున ప్రచారం తదితర పనుల కారణంగా బరిలో దిగేందుకు వెనుకాడినట్లు సమాచారం. అయితే పార్టీ హైకమాండ్ ఆయనను ఒప్పించి, పట్టుబట్టి ఎన్నికల రణక్షేత్రంలోకి దింపింది.

కాన్ఫిడెంట్‌గా అన్నామలై..

తన నాయకత్వంలో 20 శాతానికి పైగా ఓట్లు సాధించగలనన్న నమ్మకంతో ఉన్నారు అన్నామలై. 39 లోక్ సభ స్థానాలున్న తమిళనాడు కొన్నేళ్లుగా బీజేపీకి గట్టి సవాలుగా నిలిచింది. దశాబ్దాలుగా ఆ పార్టీకి రాష్ట్రంలో పెద్దగా గుర్తింపు లేదు.

తగ్గుతున్న ఓట్ల శాతం..

2019 లోక్‌సభ ఎన్నికలలో కేవలం 3.5 శాతం ఓట్ షేర్‌ను పొందగలిగిన బీజేపీ.. 2021 అసెంబ్లీ ఎన్నికలలో అది 2.62 శాతానికి పడిపోయింది. అయితే నలుగురు అభ్యర్థులు మాత్రం అసెంబ్లీలో అడుగుపెట్టగలిగారు. గత రెండు సందర్భాల్లోనూ బీజేపీకి అన్నాడీఎంకే మిత్రపక్షంగా ఉంది. ఇదే పొత్తును లోక్‌సభ ఎన్నికలలో కూడా కంటిన్యూ చేయాలని బిజెపి తీవ్ర ప్రయత్నాలు చేసింది. అయితే ఎఐఎడిఎంకె అందుకు ఆసక్తి చూపలేదు. చివరికి బిజెపి నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ నుండి ఎఐఎడిఎంకె వైదొలిగింది.

ఇక తమతో కలిసివచ్చే పార్టీలతో జతకట్టి మొత్తం 39 లోక్‌సభ స్థానాల్లో 19 స్థానాల్లో పోటీకి తమ అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన స్థానాలను ఏడు మిత్రపక్షాలకు (PMK, AMMK, తమిళ మానిలా కాంగ్రెస్‌)కు వదిలేసింది.

2019లో బీజేపీకి వచ్చిన ఫలితాలు కర్ణాటక ఇచ్చే అవకాశం లేకపోవడంతో.. ఇక తమిళనాడుపై తన దృష్టిని కేంద్రీకరించింది కమలం పార్టీ. గెలిచి తీరాలన్న కసితో పార్టీ అగ్రనేతలు మొదలు కిందిస్థాయి నాయకులు శ్రమిస్తున్నారు. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ సందర్భంగా కేవలం మూడు నెలల్లోనే ప్రధాని మోదీ రాష్ట్రంలో దాదాపు ఆరు సార్లు పర్యటించడమే అందుకు నిదర్శనం.

వెంటాడుతున్న వివాదాలు..

మోడీ ఎన్నికల దూకుడు కొనసాగిస్తున్నా.. అన్నామలై కోర్టు వివాదాలు వెంటాడుతున్నాయి. అన్నామలై కోయంబత్తూరు లోక్‌సభ నియోజకవర్గం పోటీ చేస్తున్నారు. ఇక్కడ డిఎంకెకు చెందిన గణపతి రాజ్‌కుమార్, ఎఐఎడిఎంకెకు చెందిన సింగై రామచంద్రన్‌ బరిలో దిగారు.

ఎన్నికల తర్వాత ఎఐఎడిఎంకె పతనమవుతుందని వ్యాఖ్యనించిన అన్నామలై అన్నాడీఎంకేపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. అవకాశం ఇస్తే, 2024 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ద్రవిడ పార్టీలేవీ ఉండవని ప్రకటించారు.

ఎడప్పాడిని టార్గెట్ చేస్తూ..

ఎఐఎడిఎంకె ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళనిస్వామిని అన్నామలై ఘాటుగా విమర్శించారు. ఆయనకు అహంకారం ఎక్కువని, ఆధిపత్య వైఖరి ప్రదర్శిస్తుంటాడని ఆరోపించారు. అన్నాడీఎంకే నాయకుల అవినీతి సంబంధాల కారణంగానే 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలయ్యిందని పేర్కొన్నారు. అన్నామలై వ్యాఖ్యలకు అన్నాడీఎంకే నేతలు కౌంటర్ ఇచ్చారు.

‘‘పల్లడంలో మోదీ తన ప్రసంగంలో ఎంజీఆర్, జయలలిత గురించి ప్రస్తావించినప్పుడు అన్నామలై ఎందుకు విభేదించలేదు? అని అన్నాడీఎంకే తిరుగుబాటుదారుడు ఏఐఏడీఎంకే నేత, మాజీ ఎంపీ కేసీ పళనిసామి ప్రశ్నించారు. అన్నామలై రాజకీయ అనుభవ రాహిత్యంగా మాట్లాడుతున్నారని విమర్శించారాయన.

2021 అసెంబ్లీ ఎన్నికలలో అన్నాడీఎంకే బీజేపీ వల్లే ఎక్కువ సీట్లు గెలిచిందనేది నిజమైతే, అరవకురుచ్చి నియోజకవర్గంలో అన్నామలై ఎందుకు ఓడిపోయారో చెప్పాలని పళనిసామి డిమాండ్ చేశారు.

చివరి క్షణం వరకు బీజేపీ ఏఐఏడీఎంకేతో పొత్తు కోసం ప్రయత్నించిందని, చివరకు అన్నామలైని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించేందుకు కూడా సిద్ధపడిందని చెప్పారు. అన్నాడీఎంకేను కనుమరుగు చేసేంతా ‘పెద్ద మాంత్రికుడా’ అని మరో ఏఐఏడీఎంకే నేత ఓఎస్ మణియన్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బయటి వ్యక్తిగా బీజేపీ..

తమిళనాడులో డిఎంకె, ఎఐఎడిఎంకె పార్టీలు బీజేపీని బయటి వ్యక్తిగా పరిగణిస్తున్నాయి. ఆ పార్టీని అంత ప్రాముఖ్యం కూడా ఇవ్వడం లేదని తెలుస్తోంది. కోయంబత్తూరులో ఇటీవల జరిగిన ప్రెస్ మీట్‌లో పరిశ్రమల శాఖ మంత్రి టిఆర్‌బి రాజా బిజెపి గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి నిరాకరించారు. ప్రతిపక్ష పార్టీ అన్నాడిఎంకెపై వచ్చిన ఆరోపణలకు మాత్రమే సమాధానమిస్తానని చెప్పారు. అన్నాడీఎంకే కూడా ఇదే విధానాన్ని అవలంభిచింది. తమిళనాడులో అన్నాడీఎంకే, డీఎంకే మధ్య పోరు సాగుతుందని అన్నాడీఎంకే మాజీ మంత్రి ఎస్పీ వేలుమణి పేర్కొన్నారు. మూడో స్థానంలో ఉన్న బీజేపీపై మాట్లాడి నా సమయాన్ని వృథా చేసుకోదలుచుకోలేదని అని చెప్పారు.

"బిజెపి గణనీయమైన ఓట్‌షేర్‌ను సాధించగలదు. బిజెపి గట్టి పోటీ ఇస్తోందనే భావనను సృష్టించడంలో అన్నామలై కొంత విజయం సాధించారు" అని ఒక విశ్లేషకుడు అన్నారు. ఏది ఎలా ఉన్నా అన్నామలై ఆధ్వర్యంలో కాషాయ పార్టీ ఎన్ని స్థానాలు గెలుస్తుందో చూడాలంటే.. జూన్ 4 వరకు వేచిచూడాల్సిందే.

తమిళనాడులో ఏప్రిల్ 19న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి.

Read More
Next Story