
నేషనల్ హెరాల్డ్ కేసు
నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ లను ‘ఈడీ’ అరెస్ట్ చేస్తుందా?
‘ది ఫెడరల్’ నిర్వహించే ‘క్యాపిటల్ బీట్’ తాజా ఎపిసోడ్ లో సీనియర్ న్యాయవాదీ హెగ్డే వివరణ
(అనువాదం.. చెప్యాల ప్రవీణ్)
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై కేసులు నమోదయిన సంగతి తెలిసిందే. వీరిపై తాజాగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మనీలాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) లోని వివిధ సెక్షన్ల కింద చార్జీషీట్ దాఖలు చేసింది.
వీరు ఈ కేసులో ఏ1, ఏ2 లుగా పేర్కొంది. ఈ అంశంపై ‘ది ఫెడరల్’ నిర్వహించే ‘క్యాపిటల్ బీట్’ తాజా ఎపిసోడ్ లో నీలు వ్యాస్ తో పాటు సీనియర్ న్యాయవాదీ సంజయ్ హెగ్డే చార్జీషీట్ లోని అంశాలను డీకోడ్ చేయడానికి ప్రయత్నించారు.
ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ముందు ఈ చార్జీషీట్ సమర్పించారు. పీఎంఎల్ఏ చట్టంలోని సెక్షన్ 44, 45, 70 ప్రకారం సోనియా, రాహుల్, తో పాటు సుమన్ దూబే, సామ్ పిట్రోడా, యంగ్ ఇండియన్ అండ్ డోటెక్స్ మర్చంట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో పాటు డోటెకస్ ప్రతినిధి సునీల్ భండారి పేర్లను చేర్చింది.
కీలక ఆరోపణలు..
నేషనల్ హెరాల్డ్ ప్రచుకరణ కర్త అయిన అసోసియేట్ జర్నల్స్ లిమిటేడ్(ఏజేఎల్) వాటాలను యంగ్ ఇండియన్ కు నామమాత్రపు ధర అంటే కేవలం రూ. 50 లక్షలకు బదిలీ చేయడం ద్వారా కాంగ్రెస్ అగ్రనాయకులు, సహచరులు ఆ సంస్థను తమ ఆధీనంలోకి తీసుకోవడానికి కుట్రపన్నారని దర్యాప్తు సంస్థ ఆరోపించింది. యంగ్ ఇండియా సంస్థలో సోనియా, రాహుల్ గాంధీలకు చెరో 38 శాతం అంటే మొత్తంగా 76 శాతం వాటాలు ఉన్నాయి.
నిజానికి కాంగ్రెస్ పార్టీ ఏజేఎల్ కి రూ. 90 కోట్ల రుణాన్ని ఇచ్చి దాన్ని ఈక్విటీగా మార్చారు. దీనివలన యంగ్ ఇండియన్ కు రూ. 2 వేల కోట్ల విలువైన రియల్ ఎస్టేట్ ఆస్తుల యాజమాన్యం కారుచౌకగా గాంధీల వశం అయ్యే అవకాశం ఉంది.
కంపెనీల చట్టంలోని సెక్షన్ 25 ప్రకారం.. యంగ్ ఇండియా అనేది లాభాపేక్ష లేని సంస్థగా నమోదు చేశారు. కానీ ఇప్పటి వరకూ ఎటువంటి దాతృత్వ కార్యకలాపాలలో పాల్గొనలేదని ఏజెన్సీ పేర్కొంది.
మనీలాండరింగ్..
సీనియర్ న్యాయవాదీ సంజయ్ హెగ్డే మాట్లాడుతూ.. వ్యాపార ప్రపంచంలో కార్పొరేట్ సంస్థల పునర్ ఏకీకరణ జరుగుతుందని, ఇది వాటాదారుల అభిప్రాయం మేరకు సాధ్యమే అని చెప్పారు. ‘‘ఇలాంటివి తరుచుగా పన్ను ప్రణాళికదారుల సూచన మేరకు జరుగుతాయి’’ అని ఆయన అన్నారు. అయితే ఈ లావాదేవీలు భారత ప్రభుత్వ చట్టం ప్రకారం మనీలాండరింగ్ కిందకు వస్తుందా? అని సందేహం వెలిబుచ్చారు.
‘‘మనీలాండరింగ్’’ అనే పదం మూలాలను అన్వేషిస్తూ.. ఇది 1920 లో అమెరికాలో నిషేధకాలంలో ఎక్కువగా వాడుకలోకి వచ్చిందన్నారు. ప్రారంభంలో అక్రమ ఆయుధాలు, మాదకద్రవ్యాలు వ్యాపారంతో ముడిపడి ఉండేదని వివరించారు. అయితే మనదేశంలో మాత్రం పీఎంఎల్ఏ విస్తృత శ్రేణి నేరాలకు వర్తింపజేశారన్నారు.
‘‘భారత్ లో పీఎంఎల్ఏ దాదాపు అన్నింటిని అదుపు చేసే షెడ్యుల్ ను రూపొందించారు’’ అని హెగ్డే వివరించారు.
కుట్ర జరిగిందా?
ఈడీ మోపిన అభియోగాలు నేరపూరిత కుట్రలా ఉన్నాయా? అని నీలు వ్యాస్ సీనియర్ న్యాయవాదీని అడిగినప్పడూ.. ‘‘కొన్నిసార్లు ప్రతి అంశం నేరపూరిత కుట్రలా కనిపిస్తుంది’’ అని వివరించారు. ఈ పదబంధాన్ని ప్రస్తుత విషయంలో విస్తృతంగా వర్తింపజేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
తమిళనాడు ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈడీ ఈ కేసును దర్యాప్తు ప్రారంభించిందని చెప్పారు. ‘‘ముందస్తు కుట్ర, నేరం కోర్టు కొట్టివేస్తే, మనీలాండరింగ్ ఫిర్యాదుకు విలువ ఉండదు’’ అని ఆయన వివరించారు.
చార్జీషీట్ సమయం..
ఈడీ దర్యాప్తు సమయం పూర్తయ్యే చివరి రోజున తన చార్జీషీట్ ను దాఖలు చేసింది. ఇది దాని ఉద్దేశంపై ప్రశ్నలు లేవనెత్తింది. ‘‘ఈ రోజు వారు ఎవరిని విచారిస్తున్నారో.. రేపు అదే వ్యక్తులు వారిని విచారించలేకపోవచ్చును. ఇది ఈడీ అధికారులకు కూడా తెలుసు’’ అని సీనియన్ న్యాయవాదీ పేర్కొన్నారు.
మీడియా సంస్థలు ఈ విషయాలపై విస్తృతంగా నివేదికలు ఇచ్చినప్పటికీ సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు సహ చాలామంది నాయకులకు చార్జీషీట్ కాపీ అందలేదని ఆయన అన్నారు.
‘‘ఇవి ఉద్దేశపూర్వకంగా చేసిన్ లీక్ లు’’ అని ఆయన అన్నారు. ప్రజల అవగాహానను ప్రభావితం చేయడానికి ఈడీ మీడియాను ఉపయోగిస్తుందని చెప్పారు.
మీడియా.. ప్రజా విచారణ..
చట్టపరమైన విచారణ జరుగుతున్నప్పుడు అదే సమయంలో మీడియా బహిరంగ విచారణ నిర్వహించడంపై నీలు వ్యాస్ ఆందోళన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు కూడా ఇలాంటి లీక్ లను ఖండించిందని గుర్తు చేశారు. మీడియా సంస్థలు మాత్రం ఆత్మపరిశీలన చేసుకోవడం లేదని న్యాయవాదీ హెగ్డే అన్నారు. ప్రస్తుతం కేసు అప్పీల్ దశలోనే ఉందని అన్నారు.
అరెస్ట్ కు అవకాశం.. రాజకీయ చిక్కులు..
రాహుల్ లేదా సోనియా గాంధీని అరెస్ట్ చేయవచ్చా? ప్రశ్న ఎదురైనప్పుడూ హెగ్డే మాట్లాడుతూ.. అవును.. విచారణలో ఉన్న ఖైదీలుగా ఉండటాని అవకాశం ఉందన్నారు.
అరెస్ట్ చేయడానికి, బెయిల్ నిరాకరించడానికి ఈడీకి అధికారం ఉందని చెప్పారు. అయితే ఫిర్యాదు నిజం అని రుజువైతేనే కేసు ఉంటుందని, లేకపోతే తరువాత పెట్టిన సెక్షన్లు ఆటోమెటిక్ గా వీగిపోతాయని చెప్పారు. ఇది రాజకీయ ప్రతీకారచర్య అని ఆయన చెప్పారు.
ముందున్న మార్గం ఏంటీ?
తదుపరి విచారణ ఏప్రిల్ 25న జరగనుంది. ఆ రోజు కోర్టు చార్జీషీట్ ను పరిగణలోకి తీసుకోవచ్చు. ఏదైన అరెస్ట్ నిర్ణయానికి రాజకీయా అనుమతి అవసరమని హెగ్డే అభిప్రాయపడ్డారు.
‘‘కోర్టులు నిర్ణయం తీసుకోవడంలో కొంత సమయం తీసుకుంటాయని చెప్పవచ్చు’’ అని ఆయన అన్నారు. ఈడీ చార్జీషీట్ పై కాంగ్రెస్ దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగిస్తోంది.
ప్రతిపక్షాలు భిన్నాభిప్రాయాతో ఉండి, వాటిని పక్కన పెట్టి ఏకమవుతున్న తరుణంలో నేషనల్ హెరాల్డ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఇవి దేశంలోని చట్టం, రాజకీయాలు, అధికారం గురించి కొత్త ప్రశ్నలను లేవనెత్తింది.
Next Story