సుంకాల యుద్దం తీవ్రత వ్యవసాయంపై ఉండబోతుందా?
x

సుంకాల యుద్దం తీవ్రత వ్యవసాయంపై ఉండబోతుందా?

ట్రంప్ దెబ్బతో గందరగోళంలో పడిన ప్రపంచ వ్యవసాయరంగం


(మూలం.. రాచెల్ మిత్ర)

ప్రపంచం మొత్తం ట్రంప్ ప్రతిపాదించిన వాణిజ్య సుంకాల గురించే మాట్లాడుకుంటున్నారు. మిత్రులు, శత్రువుల అన్న తేడా లేకుండా అందరిపై ట్రంప్ సుంకాలు వడ్డీంచేశారు. ఇప్పుడు కేవలం ఒక్క ట్వీట్ దూరంలో వాణిజ్య యుద్దం నిలిచిపోయింది. ఈ పరిస్థితుల్లో భారత్ వ్యవసాయ రంగం సున్నితమైన కూడలిలో కొట్టామిట్టాడుతోంది.

మనదేశ వ్యవసాయ రంగం ఒక జూదం వంటిది. ఎక్కువ సాగు విస్తీర్ణం రుతపవనాలపై ఆధారపడే ఉంటుంది. సాగునీటి సదుపాయాలు చాలా తక్కువ. అలాగే పంట దిగుబడి చేతికి వచ్చే వరకూ నమ్మకం ఉండదు. ఎక్కువ భాగం అస్థిరత ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో దేశీయ, అంతర్జాతీయ పరిస్థితుల వల్ల కొనుగోలుదారుల్లో డిమాండ్ పడిపోవడంతో సాగుదారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారేలా కనిపిస్తోంది.
డొనాల్డ్ ట్రంప్ భారత్ వ్యవసాయరంగాన్ని లక్ష్యంగా చేసుకుని 26 శాతం పన్నులు విధించాడు. తరువాత తన పన్నులను ఉపసంహరించుకున్నాడు. అయితే ఇది తాత్కాలికమే. తనతో ఒప్పందానికి రాకుంటే తిరిగి వాటిని విధించే అవకాశం కనిపిస్తోంది. ఇది భారత్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొనుగోలుదారులలో ఆందోళన రేకేత్తిస్తున్నాయి.
వాణిజ్య మిగులు..
అమెరికా- భారత్ మధ్య జరిగే వాణిజ్యంలో ఢిల్లీ మిగులు సాధిస్తోంది. ఆ దేశానికి మనం బాస్మతి బియ్యం, రొయ్యలు, చేపలు, గోధుమలు, గేదె మాంసం వంటివి ఎగుమతి చేస్తున్నాము. 2014 లో భారత కు అమెరికా ప్రాసెస్ చేసిన ఆహారం విభాగంలో ఎగుమతులు 1.94 బిలియన్లు ఉండగా, భారత్ నుంచి దిగుమతులు గణీనీయంగా 6.04 బిలియన్లుగా ఉన్నాయని జేఎం ఫైనాన్షియల్ డేటా తెలియజేస్తోంది.
ఏప్రిల్ 2న ట్రంప్ అన్ని యూఎస్ దిగుమతులపై 10 శాతం సార్వత్రిక సుంకాన్ని ప్రకటించారు. ఇది ఏప్రిల్ 5 నుంచి అమలులోకి వస్తుంది. ఏప్రిల్ 9 నుంచి ప్రారంభం కానున్న 57 దేశాల దిగుమతులపై అదనపు పరస్పర సుంకాలు 11 నుంచి 50 శాతం విధిస్తున్నారు.
ప్రస్తుతం చైనా పైనే..
ప్రస్తుతం ట్రంప్ కేవలం చైనాపైనే అత్యధిక సుంకం అమలు చేస్తున్నారు. మిగిలిన దేశాలకు ఇచ్చిన సుంకాల మినహయింపు జూలై 8 న ముగుస్తుంది. ‘‘ 90 రోజుల కాల వ్యవధికి ముగిసే సమయానికి కొన్ని సానుకూలతలు ఉంటాయని మేము ఆశిస్తున్నాము’’ అని భారత సముద్ర ఆహార ఎగుమతిదారుల సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు కేవీ మోహనన్ ‘ ది ఫెడరల్’ తో అన్నారు.
వాస్తవికత..
జేఎం ఫైనాన్షియల్ డేటా ప్రకారం.. వ్యవసాయం, మాంసం, ప్రాసెస్ చేసిన ఆహారంలో, భారత దేశానికి యూఎస్ ఎగుమతులు ఎదుర్కొంటున్న సగటు సుంకాలు 2024 లో 37. 66 శాతంగా ఉన్నాయి. అందుకు విరుద్దంగా భారతీయ ఎగుమతులు యూఎస్ లో కేవలం 5.29 శాతం సుంకాలను ఎదుర్కొంటున్నాయి.
రెండు దేశాల మధ్య 32. 37 శాతం తేడా ఉంది. విశ్లేషకులు రెండు దేశాల మధ్య నిజమైన సుంకాల అంతరాన్ని తప్పుగా చూపించారని అంటున్నారు. ‘‘సుంకాలను లెక్కించేటప్పుడూ ఉపయోగించే రిఫరెన్స్ రేటు చాలా క్లిష్టమైన సంఖ్య.
ఇందులో దేశీయ పన్నులు, కరెన్సీ మానిప్యూలేషన్ వంటి నాన్ టారిఫ్ చర్యలు ఉన్నట్లు కనిపిస్తుంది’’ అని బెర్న్ స్టెయిన్ విశ్లేషకులు వేణుగోపాల్ గారే, నిఖిల్ అరేలా ఒక నోట్ లో తెలిపారు.
విషయాలు..
దేశీయ పన్నులను చేర్చడానికి సుంకాలు దిగుమతులకు మాత్రమే కాకుండా ఇతర అన్ని వస్తువులకు వర్తిస్తాయని పేర్కొన్నారు. పెంచిన 52 శాతం సుంకాల ఆధారంగా అమెరికా, భారత్ పరస్పర సుంకాన్ని 26 శాతంగా నిర్ణయించినప్పటికీ, అన్ని వాణిజ్య అడ్డంకులను న్యాయంగా అంచనా వేసిన తరువాత నిజమైన సుంకాల అంతరం కేవలం 4.9 శాతానికి దగ్గరగా ఉంటుంది’’ జేఎం ఫైనాన్షియల్ విశ్లేషకుడు హితేశ్ సువర్ణ అన్నారు. చైనా, కెనడా, యూరోపియన్ లాగా ప్రతీకార సుంకాలను నివారించి, భారత్ జాగ్రత్తగా ఒక మార్గాన్ని రూపొందించుకుంది. ఇది దేశానికి కొంచెం మేలు చేసేదే.
ప్రతీకారం
అమెరికా సుంకాల చర్యలకు ప్రతిస్పందనగా, వాణిజ్య ఉద్రిక్తతలను తగ్గించడం, మరింత సమతుల్య వాణిజ్య సంబంధాన్ని పెంపొందించడం లక్ష్యంగా భారత్ బాదం, వాల్ నట్, క్రాన్ బెర్రీస్ వంటి కొన్ని అమెరికా వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాల తగ్గింపుకు అంగీకరించింది.
‘‘భారత ప్రభుత్వ విధానం ఇప్పటి వరకూ సహకారంగా ఉంది. ఇది బడ్జెట్ ప్రకటనలో సుంకాల తగ్గింపులో స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా అమెరికాపై ప్రతీకార చర్యలను భారత్ నివారించింది’’ అని సువర్ణ పేర్కొన్నారు.
భారత వాణిజ్య సంఘాలు దౌత్యపరమైన పరిష్కారం కోసం ఆశాభావంతో ఎదురుచూస్తున్నాయి. భారత సముద్ర ఆహార ఎగుమతిదారుల సంఘం ఫిబ్రవరి 17, 18న వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారులను కలిసి, భారత సముద్ర ఆహార ఎగుమతులపై ట్రంప్ ప్రతిపాదించిన ‘‘పరస్పర సుంకాల’’ ప్రభావాన్ని చర్చించడానికి కేంద్రానికి మెమోరాండం సమర్పించాయి.
ఆర్బీఐ ఏం చెబుతోంది..
ప్రపంచంలో వ్యవసాయ రంగంపై ఎదురుగాలులు వీచినప్పటికీ ఆర్బీఐ మాత్రం వ్యవసాయంపై నమ్మకం పెట్టుకుంది. జలాశయంలోని నీటిమట్టం స్థాయిలు, బలమైన పంట ఉత్పత్తి వల్ల అనేక అవకాశాలు ఉన్నాయని నమ్ముతోంది.
సిస్టమాటిక్స్ ఇన్ స్టిట్యూషనల్ ఈక్విటీస్ లో సహ హెడ్, పరిశోధన విభాగాధిపతి ధనంజయ్ సిన్హాకు మాట్లాడుతూ.. ఆశావాదం దేశ ఆర్థిక స్థితిస్థాపకతకు(ముందుకు సాగడం) ముఖ్య కారణం అన్నారు.
‘‘మంచి రుతుపవనాల కారణంగా వ్యవసాయం ఒక సిల్వర్ లైనింగ్ లా మిగిలిపోయింది. దేశంలో బలహీనమైన డిమాండ్, పెరిగిన ప్రపంచ రక్షణవాదం దృష్ట్యా, మార్కెట్లు ప్రభుత్వ విధానాల ప్రతిస్పందనల మీద ఆధారపడి ముందుకు సాగుతాయి. ఈ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడానికి రక్షణాత్మక పెట్టుబడి వ్యూహానికి పిలుపునిస్తాయి’’ అని ఆయన పేర్కొన్నారు.
రక్షణ వాదం, విధానపరమైన సంక్షోభం తలెత్తినప్పుడూ మొదటి దెబ్బ వ్యవసాయంపైనే పడవచ్చు. కానీ వాటికి కచ్చితంగా హానిచేస్తాయమని మాత్రం చెప్పలేమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
అమెరికాలో రొయ్యల పై ప్రజలు ఖర్చు చేసేది చాలా తక్కువ. కాబట్టి అక్కడ సుంకాలు పెరిగిన మనదేశం నుంచి చేసే ఎగుమతుల్లో పెద్దగా తేడా రాదు. ఇక బాస్మతి బియ్యం విషయానికి వస్తే ఇక్కడ చాలా పోటీతత్వం ఉంది. ముఖ్యంగా చైనా,వియత్నాం, థాయ్ లాండ్ వంటి పోటీదారుల వల్ల కొంతకాలం ఇబ్బంది తప్పకపోవచ్చు.
ఆలోచించే విషయాలు..
గతంలో భారత్ కొన్ని రకాల బియ్యాన్ని ఎగుమతి చేయాడాన్ని నిషేధించింది. ముఖ్యంగా ఆఫ్రికా, ఆగ్నేయాసియా దేశాలకు వీటిని పంపకుండా ఆంక్షలు విధించింది. ఆ కాలంలో వీటి ధరలు బాగా పెరిగాయి.
దేశీయ సరఫరాలను పెంచడానికి ద్రవ్యోల్భణం నియంత్రించడానికి ప్రభుత్వం అప్పట్లో ఈ చర్యలను తీసుకుంది. సింగపూర్ లోని నాన్యాంగ్ టెక్నాలాజికల్ యూనివర్శిటీ లోని ఎన్టీయూ ఎస్ బీఎఫ్ ప్రకారం.. థాయిలాండ్, వియత్నాం వంటివి ఆఫ్రికా దేశాలలో సరఫరా లోటుపాట్లను పూరించాయి. భారత్ విడిచిపెట్టిన ఎగుమతుల వాటాను స్వాధీనం చేసుకోవడానికి ఇవి తమ ఎగుమతి సామర్థ్యాలను ఉపయోగించుకున్నాయి.
ట్రంప్ సుంకాలకు ముందు కూడా ఐఎంఎఫ్ రక్షణాత్మక చర్యలు ఆహార ధరల అస్థిరతను తీవ్రం చేస్తుందని హెచ్చరించింది. ప్రతీకార వాణిజ్య సుంకాలు ప్రపంచ వ్యవసాయ మార్కెట్లలో ఇప్పటికే బలహీనంగా ఉన్న సమతుల్యతను ఇవి దెబ్బతీసే అవకాశం ఉందని ఐఎంఎఫ్ లో ప్రధాన ఆర్థికవేత్త పియరీ ఆలివర్ గౌరీంచాస్ అన్నారు.
ఇప్పుడున్న పరిస్థితులు భారత్ తన వ్యవసాయ మార్కెట్ సంబంధిత అంశాలను జాగ్రత్తగా మదింపు చేయాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయి.
Read More
Next Story