సీతారామన్ పన్ను తగ్గింపు... వృద్ధిని పెంచుతుందా?
x

సీతారామన్ పన్ను తగ్గింపు... వృద్ధిని పెంచుతుందా?

బడ్జెట్ పై ‘ ది ఫెడరల్’ ఎడిటర్ ఇన్ చీఫ్ ఎస్. శ్రీనివాసన్ విశ్లేషణ


విజయ్ శ్రీనివాస్

ఇంధనం, మౌలిక సదుపాయాల వంటి రంగాలలో భారత్ అనేక సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. దీని పై ‘ది ఫెడరల్’ ఎడిటర్ ఎస్ శ్రీనివాసన్ తాజాగా ‘టాకింగ్ విత్ శ్రీని’ లో తన అభిప్రాయాలను వెల్లడించారు.

మధ్యతరగతికి అనుకూలంగా..
బడ్జెట్ లో మధ్య తరగతి ప్రజలకు పెద్ద ఎత్తున పన్నూ రాయితీ ప్రకటించారని ఎడిటర్ అభిప్రాయపడ్డారు. ‘‘ ఏటా రూ. 12 లక్షలు సంపాదిస్తున్న మధ్య తరగతి జీవులకు పెద్ద ఊరట. వారు ఎలాంటి పన్ను చెల్లించనవసరం లేదు’’. పన్ను మినహాయింపులు ప్రధానంగా కొత్త పన్ను విధానంలో ఉన్నవారికి ప్రయోజనం చేకూరుస్తాయని శ్రీనివాసన్ వివరించారు.
పన్ను మినహయింపుల్లో రూ. 12. 75 లక్షల లేదా అంతకంటే ఎక్కువ సంపాదించే వ్యక్తులకు రూ. 75 వేల వరకూ లాభం చేకూరే అవకాశం ఉందని, వారికి పన్ను మినహయింపు కూడా ఉంటుందని ఆయన విశ్లేషించారు.
దీనివలన నా క్లయింట్ లలో దాదాపు 20 శాతం మంది ఇక నుంచి రిటర్న్ లు దాఖలు చేయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. పన్ను విస్తృత ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని అనేక అంశాలను ప్రస్తావించారు.
ఈ పన్ను మినహాయింపులు ప్రధానం ఢిల్లీని ప్రభుత్వ ఉద్యోగులకు చాలా ఉపశమనాన్ని అందిస్తుందని, రాబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇది ప్రతిధ్వనించబోతుందని ఆయన పేర్కొన్నారు. ‘‘మధ్యతరగతి ప్రజలు దీనిని స్వాగతించబోతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల జనాభా ఢిల్లీలో ఎక్కువ’’ అన్నారు.
రాజకీయ సమయం.. వ్యూహం
ఢిల్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు బడ్జెట్ ప్రవేశపెట్టం వెనక దాగి ఉన్న రాజకీయ సమయాన్ని శ్రీనివాసన్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘ రాజకీయ లాభాలపై దృష్టి పెట్టకుండా ప్రభుత్వాలు ఏమి చేయవు’ అని అభిప్రాయపడ్డారు.
మధ్య తరగతి ఓటర్లను ఇలాంటి వాటి ద్వారానే ఆకర్షిస్తారని చెప్పారు. అలాగే బీహర్ పేరు ను పదే పదే ప్రస్తావించడంపై ఆయన అక్కడ జరగుతున్న సంకీర్ణ రాజకీయాలను కూడా వివరించే ప్రయత్నం చేశారు. కూటమి పాలన సంతోషంగా ఉండటంతోనే ఆ రాష్టం పేరు కనీసం అరడజన్ సార్లు విన్నామని పేర్కొన్నారు.
ఆర్థిక వృద్ధి
జీడీపీలో మూలధన వ్యయం వాటా స్వల్పంగా ఉన్నప్పటికీ, కాపెక్స్ పై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. ‘‘ జీడీపీలో వ్యయం తగ్గినప్పటికీ ప్రభుత్వం దాని మొత్తం క్యాపెక్స్ తగ్గించలేదు’’ అని ఆయన వివరించారు.
మూలధనం పై ప్రభుత్వ వాటా 22.13 శాతంగా ఉందని తెలిపారు. ఇది మౌలిక సదుపాయాలను వేగంగా అభివృద్ది చేసేందుకు ఉపయోగపడుతుందని అన్నారు. వినియోగాన్ని పెంచడానికి, ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజపరిచేందుకు కీలకమన్నారు.

మధ్యతరగతి ప్రజల్లో ఎక్కువ ద్రవ్యాన్ని మిగల్చడం ద్వారా వినియోగాన్ని పెంచడానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇచ్చిందని, ఇది వినియోగదారుల వ్యయం పెరగడానికి దారి తీస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇది ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇస్తుందని చెప్పారు.

సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలు..
ఉపాధి కల్పన, ఆర్థిక వృద్ధికి కీలక రంగమైన సూక్ష్మ,చిన్న తరహా పరిశ్రమలపై ప్రభుత్వ తన దృష్టిని కేంద్రీకరించింది. ‘‘చిన్న పరిశ్రమలకు ఊతం ఇవ్వడం చాలా కీలకమైనది’’ అని ఎడిటర్ నొక్కి చెప్పారు.
ఈ రంగంలో ఉన్న అనేక నిర్మాతణాత్మక, వ్యవస్థాపూర్వకమైన సమస్యలను తొలగించడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రస్తుతం వృద్దికి కేంద్రంగా ప్రైవేట్ రంగమే ఉండగా, తాజా సూక్ష్మ, చిన్న మధ్య తరహ పరిశ్రమలకు ఊతం ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. రాబోయే కాలాల్లో ఇది మరింత మద్దతు పొందే అవకాశం ఉంది.
అణుశక్తి..
రాబోయే కాలాల్లో శక్తి వనరుల కోసం ప్రభుత్వం 20 వేల కోట్లతో అణు శక్తి ప్రొగ్రామన్ని ముందుకు తీసుకుపోయే కార్యక్రమం ప్రకటించిందని, ఇది బడ్జెట్ లో చెప్పుకోదగ్గ పరిణామం అన్నారు. శిలాజ ఇంధనాలు, పునరుత్పాదక ఇంధనాల మధ్య 50: 50 ని 2030 నాటికి సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
అందుకోసం అణు విద్యుత్ ను వాడుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో ప్రత్యేకించి ప్రైవేట్ రంగానికి ప్రాధాన్యం ఇవ్వాలని అనుకోవడం పెద్ద మార్పు అన్నారు. ఇది కార్పొరేట్లకు పెట్టుబడుల గమ్యస్థానంగా మారవచ్చు.
ఆర్థిక ఏకీకరణ..
ప్రభుత్వం ఆర్థిక ఏకీకరణపై పెద్ద ఎత్తున దృష్టి పెట్టిందని, ఇందుకు బడ్జెట్ లో మధ్య తరగతి ప్రజలకు ప్రకటించిన పన్ను ఉపశమనం ఒక భారీ అడుగు అన్నారు. ‘‘2025-26 ఆర్ఠిక లోటు లక్ష్యం జీడీపీలో 4.4 శాతంగా నిర్ణయించారు.
ఇది మంచి సంఖ్య’’ అని అభిప్రాయపడ్డారు. ఇలాగే ఉంటే వృద్ది రేటు ప్రభుత్వ లెక్కలకు అనుగుణంగా ఉంటుందని అన్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ద్రవ్యోల్భణాని స్థిరంగా నిర్వహించడం కష్టమని అభిప్రాయపడ్డారు.
వడ్డీ రేట్లలో ఆర్బీఐ పాత్ర..
ఆర్బీఐ తన ద్రవ్యపరపతిలో భాగంగా వడ్డీరేట్లను తగ్గించిన ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా తన మద్దతును కొనసాగిస్తుందని ఊహించారు. ‘‘ ఈ బడ్జెట్ లో లిక్విడిటీని మార్కెట్లో ఉంచడానికి ప్రయత్నాలు జరిగాయి.
ఇది తక్కువ వడ్డీ రేట్లకు దారి తీస్తుంది’’ అని ఆయన అన్నారు. ఫిబ్రవరి 7 నాడు ఆర్బీఐ పరపతి సమీక్షలో తీసుకునే నిర్ణయం కీలకం అన్నారు. రేట్ల తగ్గింపు ద్వారా ప్రభుత్వ ప్రయోజనాలకు, ప్రజలకు అందించాల్సిన బాధ్యత ఆర్బీఐదే.
బడ్జెట్ లో మధ్య తరగతి ప్రజలకు ఊతం ఇవ్వడానికి, మౌలిక సదుపాయాలపై వ్యయాన్ని పెంచడానికి, అణుశక్తిలో ప్రయివేట్ రంగం నిర్ణయం తీసుకోవడం చాలా సాహసోపేతమైన చర్యగా అభివర్ణించారు. కొన్ని రంగాల్లో మంచి అభివృద్ది సాధించినా, ఆర్థిక వ్యవస్థ సరైన దారిలో నడవడానికి దవ్యోల్భణం పై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఎడిటర్ అభిప్రాయపడ్డారు.
Read More
Next Story