ఫిబ్రవరి 29 తరువాత కూడా పని చేస్తాం: పేటీఎం
x

ఫిబ్రవరి 29 తరువాత కూడా పని చేస్తాం: పేటీఎం

పేటీఎం సేవలు ఫిబ్రవరి 29 తరువాత కూడా కొనసాగుతాయని, అందులో ఉన్న నిల్వలను ఖాతాదారులు వాడుకోవచ్చని కంపెనీ ప్రకటించింది.


డిజిటల్ సేవలు, చెల్లింపుల యాప్ పేటీఎం ఫిబ్రవరి 29 తరువాత కూడా యథావిధిగా పని చేస్తుందని ఆ సంస్థ ప్రకటించింది. కంపెనీ సీఈఓ, వన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటేడ్ వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ శుక్రవారం ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో ట్వీట్ చేశారు. కంపెనీ మీ అందరి ఆమోదం, అనుమతితో ఇప్పటికీ దేశ సేవ చేయడానికి సిద్ధంగా ఉందన్నారు.

"ప్రతి పేటీమర్ కు చెప్తున్నా. మీకు ఇష్టమైన పేటీఎం యాప్ ఫిబ్రవరి 29 తరువాత కూడా పని చేస్తుంది. ఆర్బీఐ ఆర్డర్ నిజంగా స్పీడ్ బంప్. త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి" అని శర్మ చెప్పారు.

నిషేధించిన ఆర్బీఐ

ఫిబ్రవరి 29, 2024 తరువాత కొత్త కస్టమర్ ఖాతా, ప్రిపేయిడ్ సాధనాలు, వాలెట్లు, ఫాస్ట్ ట్యాగ్ లలో డిపాజిట్లు, టాప్ అప్ లను ఆమోదించకుండా పే టీమ్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటేడ్(PPBL) ని ఆర్బీఐ నిషేధించింది. OCL కి, PPBLలో 49 శాతం వాటా ఉంది. కానీ దానిని అనుబంధ సంస్థగా కాకుండా కంపెనీకి అసోసియేట్ గా వర్గీకరిస్తుంది.

" మీ ఎల్లలు లేని అభిమానం నిలుపుకోవడానికి మేము నిరంతరం పనిచేస్తూనే ఉన్నాం. మా ప్రతి పేటీఎం సభ్యులు మీకు హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాం. చెల్లింపుల ఆవిష్కరణలు, ఆర్థిక సేవలలో భారతదేశం ప్రపంచ ఖ్యాతిని పొందుతూనే ఉంది. దాంట్లో ఇప్పటికీ పేటీఎం కరోనే అతి పెద్ద ఛాంపియన్ గా ఉంది" అని శర్మ అన్నారు.

పేటీఎం టాప్ మేనేజ్ మెంట్ పీపీబీఎల్, వాలెట్, ఫాస్ట్ ట్యాగ్ మొదలైన ఇతర బ్యాంకులతో ఉన్న వినియోగదారులకోసం మైగ్రేషన్ ప్లాన్ ను అమలుచేయాలని ఆలోచిస్తున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ప్రస్తుతం ఆర్బీఐ ఆదేశాలతో తమకు రూ. 500కోట్ల వరకూ వార్షిక లాభాలపై ప్రభావం పడుతుందని కంపెనీ అంచనావేస్తోంది. అయితే క్యూఆర్, పేటీఎం సౌండ్ బాక్స్, నెట్ వర్క్ ఆఫర్ వంటి వాటిపై ప్రభావం చూపదని కంపెనీ భావిస్తోంది.

పేటీఎం పేమెంట్ ఆన్ లైన్ వ్యాపారాలను యథావిధిగా చేసుకోవచ్చని, అలాగే బీమా, ఈక్విటీ బ్రోకింగ్ వంటి ఇతర ఆర్థిక సేవలు కూడా చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఇదీ పేటీఎం కు చెందిన అసోసియేట్ బ్యాంక్ కు సంబంధించినవి కావని, ఆర్బీఐ ఆదేశాలు వీటికి వర్తించవని కంపెనీ వెల్లడించింది. అలాగే పేటీఎంలో ఇప్పటికీ ఉన్న నిల్వలను వాడుకోవచ్చని వివరించింది. ఆర్బీఐ మార్చి 15, 2024 లోపు అన్ని పైప్ లైన్ లావాదేవీలు, నోడల్ ఖాతాలను పరిష్కారించాలని ఆదేశించిదని, తరువాత ఎలాంటి లావాదేవీలు మాత్రం వీటి నుంచి జరపలేరని స్పష్టం చేసింది.

Read More
Next Story