కత్తిపోట్లతో మహిళ హత్య
x

కత్తిపోట్లతో మహిళ హత్య

వెంటతెచ్చుకున్న కత్తితో అనేకసార్లు పొడవటంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది


వనస్ధలిపురం గ్రీన్ సిటీ కాలనీలోని ఒక మహిళ కత్తిపోట్లకు బలై చనిపోయింది. ఇంట్లో ఉన్న మహిళను మహేష్ అనే వ్యక్తి బుధవారం మధ్యాహ్నం కత్తితో పొడిచి చంపేశాడు. విషయం ఏమిటంటే గ్రీన్ సిటీ కాలనీలో సునీత అనే వివాహిత తన తల్లితో కలిసి ఉంటోంది. ఈరోజు మధ్యాహ్నం సునీత తల్లి బట్టలు ఆరేయటానికని మేడమీదకు వెళ్ళింది. అదేసమయంలో పెట్రోలు డబ్బా, కత్తి తీసుకుని మహేష్ అనే వ్యక్తి సునీత ఇంట్లోకి చొరబడ్డాడు. ఇంట్లోకి ఎంటరవ్వటమే పెట్రోలు చల్లేశాడు. సదరు వ్యక్తి తనింట్లో పెట్రోలు చల్లటాన్ని గమనించిన సునీత గట్టిగా కేకలు పెట్టింది.

సదరు మహిళ కేకలు పెట్టడంతో వ్యక్తి సునీత మీద దాడిచేసి వెంటతెచ్చుకున్న కత్తితో అనేకసార్లు పొడవటంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. మహిళ కేకలు విన్న బయటవాళ్ళు అక్కడికి చేరుకున్నారు. దాంతో ఇంట్లో నుండి బయటకు పారిపోయే అవకాశాలు లేకపోవటంతో మహేష్ వెంటనే సునీతను వదిలేసి ఇంట్లోని బాత్ రూములోకి వెళ్ళి తలుపేసుకున్నాడు.

ఇంట్లోకి వచ్చి జరిగిన ఘోరాన్ని వ్యక్తి బాత్ రూములోకి వెళ్ళటాన్ని గమనించిన బయటవాళ్ళు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు వచ్చేటప్పటికే సునీత చనిపోయింది. బాత్ రూములో నుండి రమ్మని పోలీసులు ఎంతచెప్పినా లోపల వ్యక్తి రాలేదు. దాంతో పోలీసులు తలుపులు బద్దలు కొట్టి సదరు వ్యక్తిని బయటకు లాక్కొచ్చారు. ఆ వ్యక్తి పోలీసులతో మాట్లాడుతు తన పేరు మహేష్ అని సునీత తన భార్యని చెప్పాడు. తనకు తెలీకుండా రెండో వివాహం చేసుకున్నదన్న కోపంతోనే తాను చంపేసినట్లు అంగీకరించాడు. మహేష్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read More
Next Story