నటుడు శివాజీపై మహిళా కమిషన్ ఆగ్రహం
x

నటుడు శివాజీపై మహిళా కమిషన్ ఆగ్రహం

దాదాపు మూడుగంటల నుండి(Telangana women commission) కమిషన్ ఛైర్ పర్సన్ నేరెళ్ళ శారద విచారణ కొనసాగుతోంది


మహిళల వస్త్రధారణపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సినీనటుడు శివాజీపై మహిళా కమిషన్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తంచేసింది. మహిళల వస్త్రధారణపై నోటికొచ్చినట్లు మాట్లాడినందుకు నోటీసులిచ్చి మరీ కమిషన్ శనివారం విచారణకు పిలిపించింది. దాదాపు మూడుగంటల నుండి(Telangana women commission) కమిషన్ ఛైర్ పర్సన్ నేరెళ్ళ శారద విచారణ కొనసాగుతోంది. ఒక సినిమా ప్రమోషన్లో భాగంగా (Actor Sivaji)శివాజీ మాట్లాడుతు అమ్మాయిలు వేసుకోవాల్సిన బట్టలపైన నోటికొచ్చినట్లు మాట్లాడాడు. మాట్లాడటం కూడా సినీనటి (Heroine Nidhi Agarwal)నిధి అగర్వాల్ కు ముడిపెట్టినట్లుగా మాట్లాడటంతో వివాదం రేగింది.

చిన్మయి, అనసూయ, పాయల్ రాజ్ పుత్ లాంటి కొందరు సెలబ్రిటీలు నిధి అగర్వాల్ కు మద్దతుగా రంగంలోకి దిగి శివాజీపై మాటలతో యుద్ధం మొదలుపెట్టారు. దాంతో వివాదంకాస్త బాగా పెరిగిపోయింది. జరుగుతున్న విషయాలను గ్రహించిన మహిళా కమిషన్ సూమోటోగా శివాజీ వ్యాఖ్యలపై విచారణ చేపట్టింది. ఇందులో భాగంగానే ఈరోజు కమిషన్ కార్యాలయానికి నటుడిని విచారణకు పిలిపించింది. మహిళల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలపైన కమిషన్ తీవ్రస్ధాయిలో ఆగ్రహం వ్యక్తంచేసినట్లు తెలిసింది. మహిళల వస్త్రధారను కించపరిచేట్లుగా వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందనే కోణంలో శివాజీని విచారిస్తున్నట్లు సమాచారం.

Read More
Next Story