యువ పారిశ్రామికవేత్తలకు వడ్డీ లేకుండా రూ.5 లక్షల రుణం..ఎక్కడంటే..
x

యువ పారిశ్రామికవేత్తలకు వడ్డీ లేకుండా రూ.5 లక్షల రుణం..ఎక్కడంటే..

యువ పారిశ్రామికవేత్తలకు వడ్డీ లేకుండా రూ.5 లక్షల రుణం ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌’’ అని సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు


యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడంలో భాగంగా వారికి వడ్డీ లేకుండా రూ.5 లక్షల రుణం ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌’’ అని సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ఉత్తరప్రదేశ్‌ను దేశానికి గ్రోత్ ఇంజిన్‌గా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యం అని అన్నారు.

గతంలో ఉత్తరప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ఇష్టపడేవారు కాదని, కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయిందన్నారు. దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు యూపీ కేంద్రంగా మారిందన్నారు. రాష్ట్ర రాజధానిలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రుణమేళాలో ఆదిత్యనాథ్ మాట్లాడారు. యూపీలో సాధించిన ప్రగతికి కారణం "డబుల్ ఇంజిన్" సర్కారేనని చెప్పారు. శత్రు దేశానికి చెందిన ఉత్పత్తులు వెనక్కి నెట్టి తమ రాష్ట్రంలో తయారైన ఉత్పత్తులకు ప్రజాదరణ పెరగడం సంతోషంగా ఉందన్నారు. ఈ రోజుల్లో దీపావళి, విజయ దశమి ఈద్, క్రిస్మస్ పండుగ సందర్భాలలో లభ్యమయ్యే అలంకరణ వస్తువులన్నీ ఉత్తరప్రదేశ్‌లో తయారైనవేనని చెప్పారు.

MSME రంగానికి రూ. 30,826 కోట్ల రుణాలను పంపిణీ చేసిన ఆదిత్యనాథ్ ఓడీఓపీ, విశ్వకర్మ శ్రమ సమ్మాన్ యోజన పథకాల కింద లబ్ధిదారులకు టూల్‌కిట్‌లను కూడా పంపిణీ చేశారు.

Read More
Next Story