ప్రముఖ యూట్యూబర్ కోమలి ఆత్మహత్య
x
YouTuber Komali

ప్రముఖ యూట్యూబర్ కోమలి ఆత్మహత్య

అతి తక్కువ కాలంలోనే యూట్యూబర్ గా కోమలి మంచి గుర్తింపు తెచ్చుకున్నది


ప్రముఖ యూట్యూబర్ కోమలి బుధవారం ఆత్మహత్య చేసుకున్నది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. విశాఖపట్నంకు చెందిన కోమలి హైదరాబాదులోని చిత్రపురి కాలనీలో బంధువుల ఇంట్లో ఉంటు ఓకాలేజీలో బీఎస్సీ చదువుతోంది. ఒకవైపు చదువుతునే మరోవైపు అతి తక్కువ కాలంలోనే యూట్యూబర్ గా కోమలి మంచి గుర్తింపు తెచ్చుకున్నది.

అందుబాటులోని సమాచారం ప్రకారం కోమలి ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ప్రేమించింది. ఏడాది క్రితం ఇద్దరికీ బ్రేకప్ అయిపోయింది. ఆ బాధలో ఉన్న యూట్యూబర్ కొంతకాలం క్రితం కూడా ఆత్మహత్యకు ప్రయత్నించింది. అయితే బంధువులు చూడటంతో అప్పుడు ప్రాణాపాయం నుండి బయటపడింది. కొంతకాలం తర్వాత కోలుకున్న యూట్యూబర్ మామూలుగానే ఉంటోంది. అయితే ఈమధ్యనే సదరు సాఫ్ట్ వేర్ ఉద్యోగితో కోమలికి పెద్ద గొడవ జరిగినట్లు తెలిసింది. తీవ్ర మనస్తాపానికి గురైన యూట్యూబర్ ఇంట్లో ఎవరులేని సమయంలో ఉరివేసుకున్నది. బంధువులు ఇంటికి వచ్చి చూసేటప్పటికే యూట్యూబర్ మరణించింది.

బంధువుల ద్వారా సమాచారం తెలుసుకున్న ఆమెతల్లి వైజాగ్ నుండి బయలుదేరి హైదరాబాద్ వచ్చారు. తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తుచేస్తున్నారు. తల్లి ఫిర్యాదుతోనే కోమలి ఆత్మహత్య విషయం బయటకు పొక్కింది.

Read More
Next Story