ట్రంప్ - పుతిన్ మధ్య లో మోదీ ఇరుక్కున్నారా?
x
డొనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోదీ, పుతిన్

ట్రంప్ - పుతిన్ మధ్య లో మోదీ ఇరుక్కున్నారా?

భారత్ పై సుంకాలు ప్రకటించిన అమెరికా, రష్యా నుంచి చమురు, ఆయుధాలు కొనుగోలు చేయడం ఆపేయాలని హుకుం


కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు భారత ప్రభుత్వాధినేతను ఇరుకున పడేలా చేస్తున్నాయి. ప్రస్తుతం న్యూఢిల్లీ అమెరికాను ఎదుర్కోవడం కంటే ట్రంప్ ను సంతృప్తిపరచడానికే ఎక్కువగా ఇష్టపడుతున్నట్లు కనిపిస్తుంది.

రష్యా- ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడానికి ఆత్రపడుతున్న ట్రంప్.. ఈ వివాదాన్ని మరింత సంక్లిష్టంగా మార్చినట్లు కనిపిస్తోంది. ఎన్నికల ప్రచారంలో తాను ఒకే రోజులో యుద్దాన్ని ముగిస్తామని ట్రంప్ గొప్పలు చెప్పుకున్నారు.

తరువాత రూట్ మార్చి బెదిరింపులకు దిగారు. ప్రపంచం మొత్తం తన ఆజ్ఞలను లొంగిపోరని తెలుసుకున్నాక ఏం చేయాలో తెలియక సందిగ్థ అవస్థలో నిరాశను ఆంక్షల రూపంలో వ్యక్తం చేస్తున్నారు.

ఉరుము ఉరిమి ఉరిమి మంగళం మీద పడ్డట్లు.. ఇప్పుడు ఈ వివాదం ముదిరి ఇండియా వైపు దూసుకు వస్తోంది. రష్యాతో వ్యాపారం చేయవద్దని హెచ్చరించిన ట్రంప్.. భారత్ పై 25 శాతం సుంకాలు విధించారు. తదుపరి జరిమానా విధిస్తానని కూడా హెచ్చరించారు. ట్రంప్ తీసుకున్న ఈ మలుపు భారత్ కు చాలా ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. దాని ప్రతిష్టను మసకబారే అవకాశం కనిపిస్తుంది.
స్నేహపూర్వక ముఖం మసకబారింది..
పుతిన్ ను నిలబెట్టడానికి కీలకమైన అంశంగా పరిగణించబడే రష్యా నుంచి భారత్ ముడి చమురు దిగుమతి చేసుకోవడం, యూరప్ లోని నాటో దేశాలకు ఎల్లప్పూడు చిరాకు తెప్పించే అంశం. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం, ఉక్రెయిన్ తో యుద్ధాన్ని ముగించడంలో ఆయన రష్యాకు అనుకూలంగా వ్యవహరించడం వలన మాస్కో తో న్యూఢిల్లీ నెరుపుతున్న సంబంధాలను కొంతమేరకు కఠిన నిర్ణయాలు వెలువడకుండా కాపాడింది.
కానీ ట్రంప్ సడన్ గా ఇప్పుడు ప్లేట్ మార్చి భారత్, రష్యా ఆర్థిక వ్యవస్థలను డెడ్ ఎకానమీగా అభివర్ణించాడు. ఇప్పుడు మోదీ ప్రభుత్వం దీన్ని సవాల్ చేయాలనే నిర్ణయానికి బదులుగా, ట్రంప్ ను బుజ్జగించడానికి నడుంబిగించినట్లు తెలుస్తోంది.
రాయిటర్స్ వార్తా సంస్థను ఓ వార్తను ప్రచురిస్తూ భారత చమురు శుద్ది కర్మాగారాలు అయిన ఇండియన్ ఆయిల్, హిందుస్తాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం, మంగళూర్ రిఫైనరీ పెట్రోకెమికల్ గత వారం రోజులుగా రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేయలేదని పేర్కొన్నాయి. దీనికి ప్రతిస్పందనగా ట్రంప్ దీనిని మంచి పరిణామంగా అభివర్ణించారు.
రష్యా నుంచి ఆపేస్తే..
రష్యా చమురు దిగుమతుల నిలిపివేతపై వచ్చిన వార్తలు నిజమైతే భారత్ చర్య పుతిన్ కు నష్టం కలిగిస్తుంది. న్యూఢిల్లీకి అది అంత సులభం కాదు. గత 20 ఏళ్లుగా అమెరికా, దాని పాశ్చాత్య మిత్రదేశాల పట్ల భారత్ వైఖరిని అనుమానంగా చూసిన రష్యా.. న్యూఢిల్లీని ఇతర మార్గాల్లో దెబ్బతీసేందుకు ప్రయత్నించవచ్చు. ఇప్పుడు భారత్ తన విదేశాంగ విధానంలో హబ్సన్ ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. రష్యా - ఉక్రెయిన్ యుద్ధం ముగించకపోతే త్వరలోనే ఇది జరగడ ఖాయంగా కనిపిస్తుంది.
ఫిబ్రవరి 24, 2022న రష్యా, ఉక్రెయిన్ పై దాడికి దిగినప్పటి నుంచి యుద్ధం సులభమైన పరిష్కారాన్ని సూచించే దీర్ఘకాలిక ఘర్షణగా రూపాంతరం చెందింది. ఈ ఘర్షణ ఉక్రెయిన్ మ్యాప్ ను పూర్తిగా మార్చివేసింది. రష్యన్ దళాలు తూర్పు సరిహద్దులో ఉత్తరం నుంచి దక్షిణం వరకూ విస్తారమైన భూభాగాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.
యుద్ధం ముగియాలంటే యుద్దానికి ముందున్న ఉన్న స్థానానికి రష్యా దళాలు వెళ్లాలని ఉక్రెయిన్ డిమాండ్ చేస్తోంది. అలాగే 2014 లో రష్య ఆక్రమించుకున్న క్రిమియా ద్వీపాన్ని సైతం విడిచిపెట్టాలని అది కోరుతోంది. అయితే వీటిని వెనక్కి ఇవ్వడానికి పుతిన్ నిరాకరిస్తున్నారు. తన దేశ సరిహద్దుకు, ఉక్రెయిన్ నుంచి ఆక్రమించిన ప్రాంతాలు బఫర్ జోన్ గా ఉంటాయని క్రిమ్లిన్ వాదన.
ప్రస్తుతం ఉక్రెయిన్ దాడి చేస్తుందంటే దానికి కారణం నాటో దేశాలు అందిస్తున్న సైనిక సాయం వల్లే. ఇది ఉక్రెయిన్ సైన్యంతో పాటు నాటో దేశాలపై కూడా దాడి చేస్తోంది.
పుతిన్ పై ట్రంప్ ఆరోపణలు..
పుతిన్ తో తనకున్న గత స్నేహం, ఉక్రెయిన్ అమెరికా సాయంపై ఆధారపడటం వల్ల రెండు దేశాలు యుద్ధ విరమణకు వీలు కలుగుతుందని ట్రంప్ లెక్కించారు. జనవరి చివరలో రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టిన ఒక నెల తరువాత వైట్ హౌజ్ వద్ద ట్రంప్ చేసిన విన్యాసాలు ప్రపంచం మొత్తం చూసింది.
ఉపాధ్యక్షుడు జేడీవాన్స్, ట్రంప్ ఇద్దరు కలిసి ఉక్రెయిన్ అధ్యక్షుడిపై ఒత్తిడి తేవడంతో ఆయన ఇంటికెళ్లిపోయారు. కానీ జూన్ ప్రారంభంలో రష్యాలోని సుదుర ప్రాంతాలలో ఉన్న దాని వైమానిక స్థావరాలపై డ్రోన్లతో దాడి చేసి అందరిని విస్తుపోయేలా చేసింది.
ఆపరేషన్ స్పైడర్ వెబ్ గా పిలిచే ఈ దాడిలో అనేక రష్యన్ బాంబర్లను తునాతునకలు చేసింది. టర్కీలో రష్యాతో చర్చలు జరుగుతున్న సమయంలో ఈ దాడి జరిగింది. తరువాత రష్యా కూడా ఎదురుదాడికి దిగి డ్రోన్లు, క్షిపణులను ఉపయోగించి ఉక్రెయిన్ అంతటా దాడులు చేసింది.
ఇప్పటి వరకూ యుద్ధాన్ని ముగించడంలో ట్రంప్ విఫలమవడం నిరాశ పరిచింది. పుతిన్ తనను స్నేహితుడు అని పిలవడం గురించి మాట్లాడటం మొదలు పెట్టి.. ప్రస్తుతం పుతిన్ అసహ్యకరమైన వ్యక్తి అని రష్యా దాడులను చెత్త దాడులని ఆరోపిస్తున్నారు.
ట్రంప్ యుద్ధవాదా?
ట్రంప్ చేసిన ముఖ్యమైన తప్పులలో ఒకటి తనను తాను అతిగా ఊహించుకోవడం. శాంతిని తీసుకురావడానికి ఆయన పనిచేస్తున్నందుకు కొంతమంది ఆయనను తప్పుపట్టినప్పటికీ దౌత్యం అనే ముసుగులో ఆయన చేసిన బెదిరింపులు ప్రతికూల ఫలితాలను ఇచ్చాయి.
తన స్నేహితుడు అని చెప్పుకునే పుతిన్ అంతరంగాన్ని ట్రంప్ చదవడంలో విఫలం అయ్యారు. చర్చలతో ఈపాటికే యుద్ధాన్ని ముగించి ఉంటే మొత్తం క్రెడిట్ దక్కించుకుని, నోబెల్ బహుమతి వరకు వెళ్లిపోయేవాడు. కానీ పుతిన్ పెరిగిందంతా పూర్వపు సోవియట్ యూనియన్ లో, వారు.. యూఎస్ఎస్ఆర్ పతనాన్ని అంగీకరించరు.
రష్యాపై అమెరికా మరో అస్తిత్వయుద్ధంలో గెలవడం పుతిన్ కచ్చితంగా కోరుకోడు. ఎందుకంటే అమెరికా, నాటోలోని దాని మిత్రదేశాలు ఉక్రెయిన్ ను పాశ్చాత్య సైనిక కూటమిలో సభ్యుడిగా చేర్చుకోవడానికి అంగీకరించడం ద్వారా రష్యాపై తమ ఆధిపత్యాన్ని సవాల్ చేస్తున్నాయని పుతిన్ యుద్ధానికి దిగారు.
ప్రస్తుతం ట్రంప్ యుద్ధోన్మాదిగా మారి, దుష్టచర్యలకు దిగడం ఆశ్చర్యం కలిగించలేదు. జూలై 29న ఉక్రెయిన్ తో కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చోవాలని లేదా ఆంక్షలకు సిద్దంగా ఉండాలని, సుంకాలు ఎదుర్కోవాలని ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు. దీనికి ప్రతిస్పందనగా రష్యా ఉక్రెయిన్ తో శాంతి చర్చలకు ఇష్టపడుతుందని వైట్ హౌజ్ భావించింది. అయితే రష్యా వీటిని తోసిపుచ్చింది.
అమెరికాతో ప్రత్యక్ష యుద్ధం..
ట్రంప్ ఇప్పటికే ఉక్రెయిన్ కు అత్యాధునిక పేట్రియాట్ క్షిపణులతో సహ ఇతర ఆయుధాలను పంపింది. అలాగే ఇంతకుముందు కంటే అధిక ఆయుధ సాయాన్ని కూడా ప్రకటించారు.
ఈ నేపథ్యంలో రష్యా మాజీ అధ్యక్షుడు, రష్యా భద్రతా మండలి డిప్యూటీ చైర్మన్ దిమిత్ర మెద్వేదేవ్ తన రష్యా-అమెరికా మధ్య ప్రత్యక్ష యుద్ధం గురించి హెచ్చరికలు జారీ చేశారు. దీనికి ప్రతిస్పందనగా యుద్దంలో దెబ్బతిన్న ప్రాంతాలకు సమీపంలో రెండు అణు జలాంతర్గాములు మెహరించాలని ట్రంప్ ఆదేశించారు.
2022 లో యుద్ధం ప్రారంభమైనప్పుడూ జెలెన్స్కీ, పుతిన్ ను వెనక్కి తరమడానికి అమెరికాను అభ్యర్థించాడు. అయితే అప్పటి అధ్యక్షుడు బైడెన్ ఈ యుద్ధం మరొక ప్రపంచ యుద్ధంగా మారగలదని భయపడ్డాడు.
తన ఎన్నికల ప్రచారంలో శాంతి గురించి మాట్లాడి, అమెరికా ప్రమేయాన్ని తగ్గించి సంఘర్షణను అంతం చేస్తానని ట్రంప్ అమెరిక్లకు హమీ ఇచ్చారు. అయితే వీటిని పక్కన పెట్టి ప్రపంచంలోనే మరో అతిపెద్ద యుద్ధానికి నాంది పలికారు.
Read More
Next Story