యూపీలో ఫలించిన వ్యూహం- 8వ అభ్యర్థిని కూడా గెలిపించుకున్న బీజేపీ
x

యూపీలో ఫలించిన వ్యూహం- 8వ అభ్యర్థిని కూడా గెలిపించుకున్న బీజేపీ

ఉత్తరప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికలు రసవత్తరంగా జరిగాయి. బీజేపీ తరుపున బరిలో నిలిచిన 8 మంది విజయం సాధించారు. సమాజ్ వాదీ త రుపున ఇద్దరు గెలిచారు.


ఉత్తరప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికలు రసవత్తరంగా జరిగాయి. బీజేపీ తరుపున బరిలో నిలిచిన 8 మంది విజయం సాధించారు. సమాజ్ వాదీ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వారిని గుర్తించడంలో కాషాయ పార్టీ సక్సెస్ అయ్యింది. ఆ పార్టీ అసమ్మతివాదులను గుర్తించడంలో 8వ అభ్యర్థి విజయం సులువైంది.

ఉత్తరప్రదేశ్‌లో మంగళవారం రాజ్యసభ ఎన్నికలు ముగిశాయి. బరిలో నిలిచిన ఆర్‌పిఎన్ సింగ్, చౌదరి తేజ్‌వీర్ సింగ్, అమర్‌పాల్ మౌర్య, సంగీతా బల్వంత్, సుధాన్షు త్రివేది, సాధనా సింగ్, నవీన్ జైన్లను సులభంగా గెలిపించుకోగలిగింది బీజేపీ. క్రాస్ ఓటింగ్ కు వేసే వారిని ముందుగానే గుర్తించి తమ ఎనిమిదోసారి అభ్యర్థి అయిన వ్యాపారవేత్త, మాజీ SP పార్లమెంటేరియన్ సంజయ్ సేథ్ గెలిపించుకోగలగడం గమనార్హం.

కాగా సమాజ్ వాదీ చీఫ్‌కు ఈ ఎన్నికలలో గట్టి దెబ్బే తగలింది. గత నెలలో ఎన్‌డిఎలో కీలక మిత్రపక్షం జయంత్ చౌదరి ఆర్‌ఎల్‌డి ఓడిపోవడం, అనంతర పరిణామాల నేపథ్యంలో ఎస్‌పి మూడింటిలో రెండింటిని మాత్రమే కైవసం చేసుకోగలిగింది. సమాజ్ వాదీ అభ్యర్థులు జయా బచ్చన్, దళిత నాయకుడు రాంజీలాల్ సుమన్ సునాయాసంగా విజయం సాధించారు. పార్టీ చీఫ్ విప్ మనోజ్ కుమార్ పాండే ఓటమి చెందారు.

SP తన ముగ్గురి అభ్యర్థులను ఎన్నుకోవడానికి అవసరమైన ఓట్లు సరిపోవని (రాష్ట్రం నుండి ఖాళీగా ఉన్న 10 స్థానాలకు, ప్రతి అభ్యర్థి విజయానికి కనీసం 37 మొదటి ప్రాధాన్యత ఓట్లు అవసరం) సోమవారమే తెలిసిపోయింది. మంగళవారం పోలింగ్ ప్రారంభం కావడంతో SP తన ముగ్గురు అభ్యర్థుల విజయానికి అవసరమైన ఎమ్మెల్యేల సంఖ్య లేకపోవడంతో అఖిలేష్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.

లక్నోకు చెందిన రాజకీయ వ్యాఖ్యాత శరత్ ప్రధాన్ ది ఫెడరల్‌తో మాట్లాడుతూ కొంతమంది ‘‘ఎస్‌పి ఎమ్మెల్యేలను చీల్చడంలో బిజెపి విజయం సాధించింది. అయితే ఆ పార్టీ ఎస్‌పీ శాసనసభ్యులను ఎలా గుర్తించగలిగిందన్నది ముఖ్యం.’’ అని అన్నారు.

బిజెపికి క్రాస్ ఓటింగ్ వేసిన వారిలో ఏడుగురు సమాజ్ వాదీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒకరు మహారాజీ ప్రజాపతి ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.

రాయ్ బరేలీ నుంచి బీజేపీ తరుపున పాండే..

మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే.. క్రాస్ ఓటింగ్‌పై గందరగోళం తొలగకముందే, రాయ్‌బరేలీ నుంచి తమ అభ్యర్థిగా బీజేపీ ఉంచాహర్ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎంపికయిన ఎమ్మెల్యే, ప్రముఖ బ్రాహ్మణ నాయకుడు పాండేని పోటీకి దింపవచ్చని ఊహాగానాలు వెల్లువెత్తాయి. 2004 నుంచి సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక స్థానం రాయ్ బరేలీ. ఆమె ఈ సారి రాజ్యసభ నుంచి ఎంపికకావడంతో ఈసారి ఆ స్థానం ఖాళీ అయ్యింది. మాజీ మంత్రి, అత్యాచార దోషి గాయత్రీ ప్రసాద్ ప్రజాపతి భార్య ప్రజాపతి కూడా ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో అమేథీ అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ఉత్తర ప్రదేశ్ లో మొత్తం లోక్ సభ స్థానాలు 80. వీటిలో సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాల్లో విజయం సాధించడమే బీజేపీ ముందున్న అసలు సవాల్. ఆ దిశగానే కషాయ పార్టీ అగ్రనేతలు వ్యూహాలు రచిస్తున్నారు.

Read More
Next Story