పదేళ్ల నిరీక్షణ తర్వాత తెలంగాణ రాష్ట్ర గీతమైన అందెశ్రీ పాట
x

పదేళ్ల నిరీక్షణ తర్వాత తెలంగాణ రాష్ట్ర గీతమైన అందెశ్రీ పాట

పదేళ్ల నిరీక్షణ తర్వాత అందెశ్రీ రాసిన జయహే తెలంగాణ జయ జయహే తెలంగాణ పాట తెలంగాణ రాష్ట్ర గీతంగా పభుత్వం ఆమోద ముద్ర వేయడం మంచి పరిణామం అంటున్నారు ప్రముఖ సామాజికవేత్త బీ ఎస్ రాములు.


పదేళ్ల నిరీక్షణ తర్వాత అందెశ్రీ రాసిన జయహే తెలంగాణ జయ జయహే తెలంగాణ పాట తెలంగాణ రాష్ట్ర గీతంగా పభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఎన్నికలకన్నా ముందే ఎంతో అభిమానంతో అందెశ్రీని రేవంత్ రెడ్డి టీవీ లో సుదీర్ఘంగా ఇంటర్వ్యూ చేసారు. అదే ఒక సంచలనం. ఒక రాజకీయ నాయకుడు ఒక కవిని ఇంటర్వ్యూ చేయడమనేది ఒక గొప్ప నూతన సంప్రదాయం. ఆ తరువాత ముఖ్యమంత్రి అయ్యాక రేవంత్ రెడ్డి జయహే తెలంగాణ పాటను తెలంగాణ రాష్ట్ర/ జాతీయ గీతంగా ప్రకటించారు.

ఆ ప్రక్రియ పూర్తయ్యాక నిన్న అందెశ్రీతో ఉదయమే మాట్లాడాను. అంతకు ముందురోజును కూడా రోజూ మాట్లాడుతూనే వున్నాను. రెండున్నర నిమిషాల పాట మూడు చరణాలు పల్లవి తో ఉంటుంది . పూర్తిపాట 14 నిమిషాలు ఉంటుంది అని చెప్పాడు. 13 నిమిషాల పాట విన్న తరువాత అందరు భావోద్వేగంతో నిండి పోయారు. ఎవ్వరూ మాట్లాడలేక పోయారట! ముఖ్యమంత్రి మంత్రులతో సహా మందమందికి పైగా ఆ పాటను సంగీతభరితంగా విన్నారు. ఆ కొత్త సంగీతం ప్రజల విన్న సంగీతమే! ఉస్మానియా యూనివర్సిటీలో కాకతీయ యూనివర్సిటీ లో తెలంగాణ ధనం ధాం లో ఉర్రూతలు లూగి చిన పాట! నిన్న మమాట్లాడినపుడు అందెశ్రీ పాడిన ఉత్తేజం కన్నా గొప్పగా వచ్చింది అన్నాడు. జనగణ వలె మిలటరీ కవాతు సంగీతం నేపథ్యం గా వుందట! సారే జహాసే అచ్చా పాట కన్నా భావావేశంతో మహా ఉద్వేగంగా వచ్చిందట! బహుశా ఆర్ ఆర్ ఆర్ సినిమా లోని ఆస్కార్ విన్నర్ పాట వలె మహా వేగంగా కీరవాణి సంగీతం వుందేమో! రాడికల్ ఉద్యమంలో ని లాల్ సలాం లాల్ సలాం పాట! క్రాంతి తుజ్ కో లాల్ సలాం ! విప్లవమా నీకు లాల్ సలాం! పాటల ట్యూన్ యాదికి ఉన్నాయా ? అదే ట్యూన్ అందెశ్రీ రాసాడని అదే ట్యూన్ లో పాడారని మరిచి పోవద్దు! గొప్ప పాట ! ఈ పాటలో చెప్పినన్ని విషయాలు ఎవరూ ఇంతవరకు ఏ ఒక్క పాటలో చెప్పలేదు ! అదీ అందె శ్రీ గొప్ప తనం. ఈ పాటనుప్రజలు ఏనాటి నుండో తమ జాతీయంగా పాడుకుంటూ వచ్చారు.

జనగణ మన, వందే మాతరం సారే జహా సే అచ్చా పాటలు విని వాటి స్పూర్తి కూడా ఈ పాట రచనలో వుంది. అంతకన్నా గొప్పగా రాసిన పాట అందెశ్రీ రాసిన జయహే తెలంగాణ పాట. అందెశ్రీ ఈ పాట రాష్ట్ర గీతంగా ప్రజలు పాడుకున్నప్పటినుండే ఆయన కీర్తి హిమాలయాల శిఖరాలకు చేరింది. ఇపుడు ప్రభుత్వ ఆమోదంతో శాశ్వతంగా సుస్థిర స్థానం సంపాదించుకుంది. మహా కవి లోక కవి ఉద్యమ కవి డాక్టర్ అందెశ్రీకి హృదయ పూర్వక అభినందనలు. మంత్రి వర్గం ఆమోదించే చొరవ తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మంత్రివర్గం సభ్యులకు అభినందనలు.

బి ఎస్ రాములు,

సామాజిక తత్వవేత్త

Read More
Next Story