బంగ్లాదేశ్ తో సంబంధాలు అంత ఈజీ కావా?
x

బంగ్లాదేశ్ తో సంబంధాలు అంత ఈజీ కావా?

చిన్న చిన్న అంశాలే పెద్ద వివాదాలుగా మారుతున్నాయా?


Click the Play button to hear this message in audio format

షేక్ హసీనా సర్కార్ పతనం తరువాత బంగ్లాదేశ్ తో ఏర్పడిన ఉద్రిక్తతలను తగ్గించుకోవడం భారత్ కు తప్పనిసరి అయింది. అయితే ఇదే సమయంలో ఐపీఎల్ నుంచి ముస్తాఫిజుర్ రెహ్మన్ తొలగించారు.

ఈ నిర్ణయానికి భారత ప్రభుత్వం ఎందుకు అనుమతి ఇచ్చిందో సరిగా తెలియదు. ముస్తాఫిజుర్ ను తప్పించడం కచ్చితంగా రాజకీయంగా, వ్యూహాత్మక తప్పిదంగా చెప్పవచ్చు. దీని వలన భారత్ తన సరిహద్దు దేశంతో సంబంధాలను పునరుద్ధరించుకోవడం చాలా కష్టమవుతుంది.

ఇది ఇప్పుడు అత్యల్ప కనిష్ట స్థాయిలో ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో గెలవబోతున్న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బిఎన్‌పి) భారత్ తో సంబంధాలను సులభతరం చేస్తుందని విస్తృతంగా అంచనాలు ఉన్నాయి. కానీ, ముస్తాఫిజుర్ పట్ల భారత్ వ్యవహరించిన తీరును బంగ్లాదేశ్ ప్రతిస్పందనలో దూకుడును బట్టి చూస్తే, న్యూఢిల్లీ ఢాకాతో ఒకప్పుడు తన స్నేహపూర్వక సంబంధాన్ని పునరుద్ధరించడం కొంచెం సవాల్ కూడుకున్న పనే అని అర్థం అవుతుంది.

టీ20 ప్రపంచకప్ లో భాగంగా భారత్ తో మొదట ఆడటానికి నిరాకరించిన పాకిస్తాన్ చివరకు ఎలాగో అలా ఒప్పుకుంది. ఇది క్రికెట్ అవసరాలను, దానితో ముడిపడి ఉన్న అపారమైన ఆర్థిక పరిస్థితులకు కారణం. కానీ, ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, బంగ్లాదేశ్ టోర్నమెంట్ నుంచి వైదొలిగిన తర్వాత జరిగిన సంఘటనలు.
షేక్ హసీనాను నిష్క్రమణ తరువాత భారత్ చేసిన తప్పిదాలను పాకిస్తాన్ తనకు అనుకూలంగా ఉపయోగించుకుంటూనే ఉంది. ముస్తాఫిజుర్ విషయంలో అది చేసిన గేమ్ ప్లాన్ ఇదే రూఢీ చేస్తోంది.
యూనస్ పరిపాలనతో చేతకానితనం ఇస్లామాబాద్ కు కొత్త బూస్ట్ ఇచ్చింది. వారి స్నేహాన్ని సుస్థిరం చేసుకోవడానికి, న్యూఢిల్లీని దూరం చేయడానికి సమర్థవంతంగా వాడుకుంది.
బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక మధ్య జరిగిన గందరగోళం, భారత్-పాకిస్తాన్ ప్రపంచ కప్ ఎన్‌కౌంటర్ పునరుజ్జీవనానికి వీలు కల్పించింది. న్యూఢిల్లీ ఈ దౌత్య సమీకరణం నుంచి దూరంగా ఉందని స్పష్టం చేసింది.

ఇలాంటి నిర్ణయం ఎవరూ తీసుకున్నారు?

బంగ్లాదేశ్‌తో ఉద్రిక్తతలను తగ్గించడం మోదీ ప్రభుత్వానికి తప్పనిసరి అయిన సమయంలో, ముస్తాఫిజుర్ ఎపిసోడ్ జరగడానికి అది ఎందుకు అనుమతించిందో అర్థం కావడం లేదు. భారత క్రికెట్ బోర్డు, ఈ నిందను తీసుకుంటుంది. కానీ భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI) చర్య న్యూఢిల్లీలోని ప్రభుత్వం సూచన మేరకు జరిగి ఉండవచ్చనేది సందేహం లేని అంశం.
ముస్తాఫిజుర్‌ను ఐపీఎల్ నుంచి తొలగించడం ద్వారా బీసీసీఐ ఏమి సాధించాలనుకుంటుందో స్పష్టంగా తెలియదు. అతను టోర్నమెంట్‌లో ఆడటం ద్వారా రెండు పొరుగు దేశాల మధ్య రాజకీయాలను లేదా ఇతర అంశాలను మరే విధంగా ప్రభావితం చేయలేడు. ఇది భారతదేశాన్ని ఏ విధంగానూ దెబ్బతీసి ఉండేది కాదు. ఈ చర్య ప్రభావవంతంగా అసభ్యకరంగా, సమర్థించలేనిదిగా అనిపించింది.
ముఖ్యంగా ఇది ముస్తాఫిజుర్, నటుడు షారుఖ్ ఖాన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (కెకెఆర్) మధ్య కుదిరిన ఒప్పందం దీని ప్రభావం పెద్దగా ఉండేది కాదు. కానీ దీనిని అనవసర వివాదంగా మార్చారు. ముస్తాఫిజుర్ సంఘటన జరగకపోతే, బంగ్లాదేశ్ T20 ప్రపంచ కప్‌లో షెడ్యూల్ ప్రకారం భారత్ లో ఆడినట్లయితే, అది ఇద్దరి మధ్య అప్పటికే ఉన్న స్నేహాన్ని సజీవంగా నిలిపి ఉంచేది.
పాకిస్తాన్ దానిలో అవకాశవాదంగా పాల్గొనకుండా దూరంగా ఉంచుతుంది. 2024 ఆగస్టులో బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా హసీనా పదవీచ్యుతురాలైనప్పటి నుంచి న్యూఢిల్లీ - ఢాకా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.
న్యూఢిల్లీ, హసీనా మధ్య అత్యంత సన్నిహిత సంబంధాలు, భారత్ లో ఆమె ఆశ్రయం కారణంగా ఆ దేశంలో మనదేశ వ్యతిరేక భావాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం.
తీవ్ర ఇస్లామిస్ట్ భావనలు బంగ్లాదేశ్ లో ప్రచారం చేస్తున్న జమాత్-ఇ-ఇస్లామి కీలక పాత్ర పోషించిన విద్యార్థుల నేతృత్వంలోని తిరుగుబాటు పర్యవసానంగా, మైనారిటీ హిందువులను అక్కడి మతోన్మాదులు లక్ష్యంగా చేసుకున్నారు.
ఇది భారత పాలక హిందూత్వ ఉన్నత వర్గాలలో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. అక్కడ జరుగుతున్న సంఘటనలతో రెండు దక్షిణాసియా పొరుగు దేశాల మధ్య సంబంధాలు మరింత దిగజారుతున్నాయి.

అమెరికాతో ట్రేడ్ డీల్..

ఈ మధ్య మరో పరిణామం కూడా జరిగింది. బంగ్లాదేశ్‌తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇతర విషయాలతోపాటు, ఢాకాను న్యూఢిల్లీ నుంచి మరింత దూరం చేసే విషయాలు ఇక్కడ ఉన్నాయి.
ముడి పత్తి ఎగుమతులను భారత్ బంగ్లాదేశ్ కు ఎగుమతి చేయడం నిలిపివేసిన తరువాత ఇప్పుడు అమెరికా తన దగ్గర ఉన్న పత్తిని దిగుమతి చేసుకోవడానికి ఎత్తులు వేస్తోంది. ఇది ఆ దేశానికి ప్రయోజనకరం కూడా. వారి వస్తువులపై ఎలాంటి సుంకాలు ఉండవు.
భారత పత్తి ఉత్పత్తిదారులు, ఎగుమతిదారులను పణంగా పెట్టి అమెరికా - బంగ్లాదేశ్ మధ్య కుదిరిన ఒప్పందం, ట్రంప్ దృక్పథం ఉన్న ప్రపంచంలో, దౌత్యపరమైన సున్నితత్వాలకు చోటు లేదని మరోసారి చూపిస్తుంది.
కొత్త ఒప్పందం బంగ్లాదేశ్ వస్త్ర తయారీదారులకు పని చేస్తే, అది భారతదేశాన్ని బంగ్లాదేశ్ వస్త్ర వ్యాపారం నుంచి సమర్థవంతంగా తొలగిస్తుంది. అలాగే భారతదేశంపై తక్కువ ఆధారపడేలా చేస్తుంది. ఇది న్యూఢిల్లీ దాని సరిహద్దు దేశాలతో ఇప్పటికే పలుచబడిన పరపతిని మరింత తగ్గిస్తుంది.

తారిక్ రెహమాన్ పాత్ర

బీఎన్పీ నాయకుడు తారిక్ రెహమాన్ ప్రవాసం నుంచి ఢాకాకు తిరిగి రావడం మాత్రమే భారత్ కు ఉన్న ఏకైక మంచి అంశం. అతను భారత్- బంగ్లాదేశ్ మధ్య వేగంగా జారిపోతున్న సంబంధాలను తిరిగి పునర్మించగలడని అది నమ్ముతోంది.
కానీ ముస్తాఫిజుర్ ఎపిసోడ్ వంటి చిన్న చిన్న అంశాలే రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింతగా పెంచుతున్నాయి. టర్కీ, చైనా మద్దతుతో బంగ్లాదేశ్ లో పాకిస్తాన్ ఎక్కువగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
ఈ నేపథ్యంలో దేశంలో ఉన్న ఈ నెగటివిటీని తట్టుకుని తారిక్ రెహ్మన్ ఏదైన మంచి చేస్తాడా? చర్చనీయాంశమైన అంశం. విద్యార్థులు, హసీనా వ్యతిరేకులు కూడా భారత్ పై మానసికంగా వ్యతిరేకంగా ఉండటంతో ఆయనకు కూడా మనతో అంత సులభంగా సంబంధాలు నెరపడానికి అవకాశం ఇవ్వకపోవచ్చు.
ఇదే సమయంలో పాకిస్తాన్ కూడా చురుకుగా ఉంటుంది. కొత్త పాలనతో సంతృప్తి చెందడానికి , బంగ్లాదేశ్-భారతదేశ సంబంధాలలో పునఃస్థాపనను నిరోధించడానికి తన శక్తి మేరకు ప్రతిగా ప్రయత్నిస్తుంది. మనం ప్రారంభించిన చోటికి తిరిగి వచ్చి చూస్తే, ముస్తాఫిజుర్‌ను IPL నుంచి తొలగించడం ఖరీదైన తప్పుగా కనిపిస్తుంది.
Read More
Next Story