
సానుభూతి ఓట్లు ఎన్నాళ్లు అడుక్కుంటారు?
పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు, లీడర్లకు గుర్తింపు ఇవ్వరా?
-వేనేపల్లి పాండురంగా రావు
ప్రజా ప్రతి నిధులు పదవి కాలం మధ్యలో చనిపోయినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులకు పార్టీలు ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్లు ఇవ్వకూడదు. ఇచ్చినా వాళ్ళు తీసుకోకూడదు. వాళ్లిచ్చినా, వీళ్ళు తీసుకున్నా, ప్రజలు గెలిపించ కూడదు.
జూబ్లీ హిల్స్ ప్రజల నుంచే ఈ మార్పు మొదలవ్వాలి. ఈ అనవాయితీ తుదముట్టించాలి.
మనం రాచరికన్ని రాజుల పాలనను అంతమొందించుకుని, ప్రజాస్వామ్య ప్రజా పాలన కు రేపో మాపో వందేళ్లు పూర్తి చేసుకుంటున్నా ఇంకా అ రాచరికపు ఆవలక్షణాలు వదిలించుకోవడం లేదు. రాజకీయ పక్షాలు ఎన్నికల్లో నిజాయితీగా పాల్గొనడం లేదు. అనేక ప్రలోభాలకు పాల్పడుతున్నవి.
అందులో ఒకటీ పదవి కాలం మధ్యలో ప్రజా ప్రతి నిధులు చనిపోతే సానుభూతి ఓట్ల కోసం మధ్యoతoర ఉప ఎన్నికల్లో కుటుంబసభ్యులకు టికెట్లు ఇవ్వడం.
మాజీ ముఖ్య మంత్రి టంగుటూరి అంజయ్య భార్య మణెమ్మ, మావోయిస్టుల చేతుల్లో మరణించిన మాగుంట సుబ్బారామిరెడ్డి, భార్య పార్వతమ్మ, ఎలిమినేటి మాధవ రెడ్డి భార్య ఉమ, ధీరవత్ రాగ్య నాయక్ భార్య భారతమ్మ, ప్రత్యర్థుల చేతిలో హత్య గా వించబడ్డ వంగవీటి మోహన రంగా, భార్య రత్నకుమారి పరిటాల రవి భార్య సునీత, విమాన ప్రమాదం లో మరణించిన ముఖ్య మంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి భార్య విజయమ్మ లు, ఆనాటి పరిస్థితుల్లో వాళ్లకు సనుభూతి తో టికెట్లు ఇవ్వడం ప్రజలు గెలిపించడం జరిగింది. ఇలా చాలా మంది సందర్బాలలో భార్యలు భర్తలు చనిపోయాక పార్టీ నుంచి ‘సానుభూతి టికెట్లు’ ఎమ్మెల్యేలు అయ్యారు.
వేనేపల్లి పాండురంగా రావు
దానితో ఇది ఆనవాయితిగా ఒక హక్కుగా మారుతూ వస్తున్నది. 2016లో పాలేరు శాశనసభ్యు డు రామిరెడ్డి వెంకటరెడ్డి మరణిస్తే, భార్య సుచరితారెడ్డి కి కాంగ్రెస్ టికెట్ ఇస్తే, టిఆర్ ఎస్ అభ్యర్థి గా తుమ్మల నాగేశ్వర రావు ను నిల బెట్టి గెలిపించుకుంది.
ఇ దే భారత రాష్ట్ర సమితి(BRS), అదే అనవాయితీగా సానుభూతి ఓట్ల కోసం, దుబ్బాక MLA సోలిపేట రామలింగారెడ్డి మరణిస్తే భార్య సుజాతకు టికెట్ ఇచ్చింది. అపుడు బీజేపీ అభ్యర్థి రఘునoదన రావు గెలిచాడు, ఆ మధ్య కoటోన్మెంట్ MLA సాయన్న మరణిస్తే కూతురు లాస్య నందిత కు టికెట్ ఇచ్చారు. ఎన్నికల్లో ఆమె గెలవడం, ఆమె కూడా ప్రమాదం లో మరణించడం జరిగింది. ఇవ్వాళ జుబ్లీ హిల్స్ లో ఉపఎన్నిక జరుగుతున్నది. బిఆర్ ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ చనిపోవడంతో ఈ ఉప ఎన్నిక వస్తున్నది. ఇక్కడ సానుభూతి ఓట్ల తో గెలవడానికి బిఆర్ ఎస్ పార్టీ గోపీనాథ్ భార్య సునీతకు టికెట్ ఇచ్చారు. అంటే వారసత్వ రాజకీయాలనుప్రోత్సహిస్తున్నారన్నమాట. ఇలా సానుభూతి మీద గెలపించుకోవాలనుకునే ఈ ఆనావాయితీ ని ఆపివేయాలి.
రాజకీయ పార్టీలు కష్టపడ్డ కార్యకర్తలకు నాయకులకు మాత్రమే ఇలా అరుదుగా వచ్చే అవకాశాలలో టికెట్లు ఇవ్వాలి. వారసత్వం అనేది కుటుంబానికి మాత్రమే పరిమితం. అది రాజకీయాల్లో ప్రజాజీవితంలో పాలనలో ఉండకూడదు. ఉండవలసిందల్ల పార్టీకోసం పనిచేయడం మాత్రమే.
పార్టీ కోసం, ప్రజల కోసం పైసా పనిచేయకుండా కేవలం కుటుంబసభ్యుల కీర్తి ప్రతిష్టలను వాడుకొని ప్రజా ప్రతినిధులు కావడం ఆత్మభిమానం వున్నవాళ్లు చేయవలసింది కాదు. వాళ్ళ ఆత్మగౌరవా నికి కూడా మంచిది కాదు..
ఆలా టికెట్స్ ఇవ్వడం అనేది కూడా పార్టీలకు మంచిది కాదు. పార్టీ కోసం ప్రజలకోసం పనిచేసిన వాళ్ళను వదిలేసి సానుభూతి కక్కుర్తి తో ప్రజలను మానసిక ఒత్తిడి కి గురిచేసి ఓదార్పు సానుభూతి లోకి నెట్టి వేయడం క్షమించరాని విషయం. ఇప్పటి వరకు అలా ఫోటి చేసి గెలిచిన వాళ్ళు ప్రజలను ఉద్దరించిన దాఖలాలు కూడా లేవు.
చనిపోయిన వాళ్ళు పేదవాళ్ళు అయితే పార్టీ వాళ్ళను ఆర్ధికంగా ఆదుకోవాలి. పిల్లలు చదువుకునే చూడాలి. ఉద్యోగ సహాయం చేయాలి. అంతే గాని ఇలా ప్రజల మీద రుద్ద కూడదు..
ఒక నియోజక వర్గ మంచి చెడ్డలు బరువు బాధ్యతలు వారసత్వoగా ఇవ్వకూడదు. దయచేసి రాజకీయ పార్టీలు సానుభూతి ఓట్ల కోసం కుటుంబసభ్యులకు టికెట్లు ఇవ్వకూడదు. ఇచ్చినా ఆ కుటుంబసభ్యులు తీసుకో కూడదు.
వాళ్ళు ఇచ్చినా, వీళ్ళు తీసుకున్నా ప్రజలు గెలిపించకూడదు. ఈ ఉప ఎన్నికల్లో జూబ్లీహిల్స్ ప్రజలు విజ్ఞత తో వ్యవహరించి, వారసత్వ కుటుంబ సభ్యులను గెలిపించడం మానేయాలి. ఇది జూబ్లీహిల్స్ నుంచే మొదలు కావాలి.
ఎన్నికల్లో రాజకీయాల్లో ప్రజా పాలనలో మార్పునాశించే వాళ్ళు తప్పకుండ ఈ విషయం లో కలిసి రావాలని కోరుకుంటున్నాను.
ప్రజల ఇష్టా ఇష్టాలను గుర్తించకుండా 2001 నుంచి గెలుపు వంక తో డబ్బున్నవాళ్ళకే టికెట్లు ఇచ్చే జబ్బు మానుకోవాలని కల్వకుoట్ల చంద్ర శేఖర్ రావుకు మనవి.
Next Story