పదవీకాల పరిమితులు భారత్ కు తీసుకురావచ్చా?
x
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భారత ప్రధాని నరేంద్ర మోదీ

పదవీకాల పరిమితులు భారత్ కు తీసుకురావచ్చా?

అమెరికాలో అమలులో ఉన్న రెండు పర్యాయాల అధ్యక్ష ఎన్నిక


అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ మూడోసారి కూడా పోటీ పడాలని అనుకుంటున్నారని అప్పుడే ఊహగానాలు వినిపిస్తున్నాయి. అయితే అమెరికా రాజ్యాంగం ప్రకారం మాత్రం ఏ అధ్యక్షుడు రెండుసార్లకు మించి పోటీ చేయడానికి వీలులేదు.

అమెరికా రాజ్యాంగాన్ని సవరించడం అంత తేలికైన విషయం కాదు. అయినప్పటికీ అవకాశాలు తెరిచి ఉంచాలని నిర్ణయించుకున్నాడు. ట్రంప్ పరిపాలనపై అమెరికాతో సహ ప్రపంచంలోని అనేక దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మిత్రులు, శత్రువులు అని చూడకుండా అందరిపై సుంకాలు విధిస్తూ హడలు పుట్టిస్తున్నారు. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలకు సమాఖ్య దళాలకు, ప్రభుత్వ సిబ్బందిని తొలగించడం వంటి చర్యలకు ఉపక్రమించారు.

ట్రంప్ అమెరికా, ప్రపంచం ఇంకో మూడు సంవత్సరాలు భరించాల్సిందే. ఆ తరువాత ఆయన దిగిపోతారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఆయన మరోసారి పోటీ చేసే అవకాశం లేదు.

రాజ్యాంగాన్ని సవరించే మార్గం తమకు కనిపించడం లేదని ప్రతినిధుల స్పీకర్ చెప్పారు. దీనిపై ట్రంప్ స్పందించారు. ఇది చాలా విచారకరమైన విషయమని అన్నారు. అయితే ఫ్లోరిడాకు చెందిన రాండీ ఫైన్ వంటి కొంతమంది నాయకులు రాజ్యాంగాన్ని సవరించాలని సూచించడం ద్వారా ఈ అవకాశాన్ని సజీవంగా ఉంచడానికి ప్రయత్నించారు.
భారత్ కు పదవీకాల పరిమితి..
అధ్యక్ష పదవీకాల పరిమితి అనే భావన అన్ని ప్రజాస్వామ్య దేశాలకు సంబంధించినది. ప్రస్తుతానికి, ఇటువంటి పరిమితులు ఎక్కువగా అధ్యక్ష లేదా సెమీ ప్రెసిడెన్షియల్ ప్రభుత్వ వ్యవస్థలకే పరిమితం అయ్యాయి.
కొన్ని దేశాలు తప్ప, లాటిన్ అమెరికా, ఆఫ్రికా అంతట అధ్యక్ష పదవీకాల పరిమితులు పాటిస్తున్నారు. ఇదే సమయంలో భారతదేశంలోని పార్లమెంటరీ వ్యవస్థకు ఉన్న అడ్డంకుల గురించి మాట్లాడాలి.
గతంలో అధ్యక్ష తరహా ప్రభుత్వానికి మారాలని సూచనలు ఉన్నాయి. కానీ ప్రధానమంత్రి, రాష్ట్రాల ముఖ్యమంత్రితో సహా ఎన్నికైనా అధికారులపై పదవీకాల పరిమితులు ప్రతిపాదించాల్సిన అవసరం ఉందని చాలా తక్కువ మంది అంటున్నారు.
భారత్ లో ప్రధానమంత్రి అత్యంత శక్తివంతమైన రాజ్యాంగ శక్తి. అయితే అధ్యక్షుడి పాత్రకు మారడం ఆచరణాత్మక ప్రయోజనాల కోసం మాత్రమే. కేంద్రమంత్రివర్గం, పార్లమెంట్ నిర్ణయాలను ఆమోదించడం తేలికైన పని.
ఇక్కడ ప్రజలు ఒక రాజకీయ పార్టీకి ఓటు వేసి అధికారంలోకి వస్తారనేది పట్టింపు లేదు. ఆ పార్టీ తన నాయకుడిని ఎన్నుకుంటుంది. ఆ తరువాత అతను ప్రధానమంత్రి అవుతాడు.
ఏ ప్రజాస్వామ్యంలో అయినా అధికారం వ్యక్తుల చేతులలో కాకుండా సంస్థలలో ఉండాలి. పరిమిత కాలానికి ప్రధానంగా ఎన్నికైనా నాయకుడు దాని విస్తరణ ద్వారా ప్రజాస్వామ్యాన్ని, వ్యవస్థలను నాశనం కాకుండా ఉద్దేశించారు.
ఏ వ్యక్తి అయినా తన ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవస్థను మార్చుకోవడానికి సుదీర్ఘకాలం పదవిలో ఉండే అవకాశం ఉన్నా వాటికి రక్షణ లభిస్తుంది.
పదవీకాల పరిమితి అనే భావన భారత్ కు కొత్త కాదు. బ్యూరోక్రసీ విషయంలో బ్యాంకింగ్ రంగంలో ఒక నిర్ధిష్ట సమయంలో ఒక విభాగం, మరోక విభాగానికి లేదా ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి అధికారులు ట్రాన్స్ ఫర్ అవడం సర్వసాధారణం. ఇది ఒక్క దగ్గరే ఉండిపోకుండా పారదర్శకత నెలకొల్పడం, మోసాన్ని నిరోధించడం మొదలైన వాటి లక్ష్యం.
వ్యక్తిగత అశాంతిని తగ్గిస్తుంది
ప్రధాని, ముఖ్యమంత్రుల పదవీకాలానికి పరిమితి ఉంటే అది వారి వ్యక్తిగత అహంకారాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. 1975 లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తన రెండో పదవీకాలంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.
ఇది దేశంలోని ప్రజాస్వామిక వ్యవస్థలు ప్రమాదానికి దూరంగా లేవని నిరూపించింది. 2014 నుంచి మూడోసారి అధికారంలో ఉన్న ప్రధాని గా ఉన్న నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం కూడా ముఖ్యంగా రెండవ పదవీకాలంలో ప్రజాస్వామ్య నిబంధనలు నీరుగార్చిందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి.
ఇదే పరిస్థితి రాష్ట్రాలలో కూడా పునరావృతం అవుతోంది. ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్న ముఖ్యమంత్రులు ప్రజాస్వామ్యానికి హాని కలిగించే చర్యలు తీసుకోవచ్చు.
అమెరికాలో ఈ వ్యవస్థ ట్రంప్ చేత సవాలు చేయబడటం ఇదే మొదటిసారి. అమెరికా అధ్యక్షుడు మూడోసారి పదవీకాలం తిరస్కరించడం అనేది కేవలం సంప్రదాయంగా ఉండేది. మొదటి అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ స్వచ్చందంగా మూడో పదవీకాలాన్ని తిరస్కరించారు.
ఫ్రాంక్లిన్ డీ రూజ్ వెల్ట్ రెండు పర్యాయలకు పైగా పోటీ చేశారు. ఆయన 1933-45 నుంచి అధికారంలో ఉన్నారు. దీనికి ప్రధాన కారణం రెండో ప్రపంచ యుద్ధం. 1951 లో మాత్రం అమెరికా 22 వ రాజ్యాంగ సవరణ ద్వారా రెండు పర్యాయాల పరిమితిని చట్టబద్ధం చేశారు. ఇప్పుడు దీనిని ఎలా అధిగమించాలని ట్రంప్ బృందం ఆలోచిస్తోంది.
వైస్ ప్రెసిడెంట్ గా పోటీ..
వచ్చే ఎన్నికలలో ట్రంప్ అధ్యక్షుడిగా కాకుండా వైస్ ప్రెసిడెంట్ గా పోటీ చేస్తారు. ఎన్నికల తరువాత కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు పదవీ విరమణ చేస్తారు. అప్పుడు ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తారు.
కానీ అమెరికా 12 వ సవరణ ప్రకారం.. రెండు పర్యాయాలు అధ్యక్షుడిగా ఉన్న తరువాత ఒక వ్యక్తి ఎటువంటి రాజ్యాంగ పదవినీ చేపట్టకుండా స్పష్టంగా నిషేధం విధించింది.
‘‘రాజ్యాంగపరంగా అధ్యక్ష పదవికి అనర్హమైన ఏ వ్యక్తి కూడా అమెరికా ఉపాధ్యక్ష పదవికి అర్హులు కారు’’ అని న్యాయ నిపుణులు చెబుతున్న మాట. ఇదే నిజమైతే ట్రంప్ ఉపాధ్యక్ష పదవికీ పోటీ చేయడానికి కూడా అనర్హుడు.
అయితే ట్రంప్ బృందం మరో వాదన ముందుకు తెస్తోంది. మొదటి, రెండో వాటి మధ్య విరామం ఉన్నందున అతను మరొకసారి అధ్యక్ష పదవికి అర్హత ఉంటుంది. చట్టంలో దీనిలో స్పష్టంగా వివరణ ఉన్నప్పటికీ ఈ నిబంధన ఇప్పటికే సవాల్ చేయవచ్చిన వారు భావిస్తున్నారు.
అగ్రరాజ్యాలలో ఇలాంటి నిబంధనలు మామూలే. ఆ దేశాలలో పదవీకాల పరిమితులు ఉన్నాయి. రష్యన్ రాజ్యాంగంలోనూ ఏ వ్యక్తి రెండు పర్యాయాలకు మించి అధ్యక్షుడిగా ఉండటానికి వీలులేదు. అయితే 2000 నుంచి 2008 వరకూ రెండు పదవీకాలాలు పూర్తి చేసిన ఆయన తన అనుచరుడు దిమిత్రి మెద్వదేవ్ ను అధ్యక్షుడిగా నిలిపారు.
తాను ఉపాధ్యక్షుడిగా బరిలోకి దిగారు. అధ్యక్షుడి పదవీకాలాన్ని నాలుగు నుంచి ఆరు సంవత్సరాలకు పెంచగా, అనేక కొత్త సవరణలు తీసుకువచ్చారు. దీనితో ఆయన 2018 లో మరోసారి మాస్కో పీఠం అధిష్టించారు. ప్రస్తుతం పుతిన్ పదవిలో కొనసాగింపును ప్రభావితం చేయని విధంగా సవరణలు చేశారు. ఈ నిబంధనలు 2024 నుంచి అమలులోకి వచ్చాయి. ప్రస్తుతం పుతిన్ 2036 వరకూ అధికారంలో ఉండవచ్చు.
వెనిజువెలా ఇలాంటి తరహ ప్రయత్నం జరిగింది. దాని అధినేత హ్యుగో చావేజ్ 1998 నుంచి 2013 వరకూ అధికారంలో ఉన్నారు. ఆయన మొదట అధికారంలోకి వచ్చినప్పుడూ ఆ దేశంలో ఆరు సంవత్సరాలు పదవీకాలం, రెండు టర్మ్ లు మాత్రమే ఆ పదవిలో కొనసాగాలి.
2007 లో ఈ నిబంధనలు సవరించాలనే ప్రతిపాదన విఫలమైంది. ఆ తరువాత ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా విజయం సాధించారు. కానీ 2013 లో ఆయన క్యాన్సర్ తో మరణించారు.
ఆఫ్రికాలో కూడా రెండు టర్మ్ లు అధికారంలో ఉండేలా నిబంధనలు ఉన్నాయి. తాజాగా కెన్యాలో అధ్యక్ష పదవీకాలాన్ని ఏడు సంవత్సరాలకు పెంచాలని ప్రతిపాదనలు ఉన్నాయి.
కానీ ప్రజా నిరసనల వల్ల ఇది విఫలమైంది. ప్రస్తుతం దాని అధ్యక్షుడు 2027 లో జరగనున్న తదుపరి ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలుగా రెండుసార్లు పదవీకాలం ఉన్న ఐదు సంవత్సరాల పరిమితిని తొలగించడానికి చట్టాన్ని తీసుకురావాలని ఆలోచనలు మదిస్తున్నారు.
ఆఫ్రికా సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ ప్రకారం.. గత పది సంవత్సరాలలో కనీసం 14 దేశాల పాలక వర్గాలు పదవీకాల పరిమితుల ప్రతిపాదనలు తప్పించుకోగలిగాయి. వీటిలో ఈజిప్ట్, ఉగాండా, రువాండా, అల్జీరియా వంటివి ఉన్నాయి.
భారత్ వంటి ప్రజాస్వామిక పార్లమెంటరీ ప్రజాస్వామ్య దేశాలలో పదవీకాల పరిమితులు పనిచేస్తాయా? ఇది ప్రాథమికంగా ఈ వ్యవస్థ కొంతమంది చేతుల్లో అధికారం కేంద్రీకృతం కాకుండా నిరోధిస్తుంది.
కాబట్టి ఇది సహేతుకంగా కనిపిస్తుంది. కానీ పాలక వర్గాలు తమకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటాయా? ఒక వేళ పదవీకాల పరిమితి అనేది ప్రస్తుత ప్రభుత్వాన్ని ప్రభావితం చేయని విధంగా కానీ భవిష్యత్ లో అమలు చేసే విధంగా రూపొందించవచ్చు.


Read More
Next Story