తెలంగాణ తల్లిని మార్చొచ్చా, అది అంతటితో ఆగుతుందా?
x

తెలంగాణ తల్లిని మార్చొచ్చా, అది అంతటితో ఆగుతుందా?

తెలంగాణ తల్లి పై నాకు కాపీ రైట్ హక్కు లేదు. మార్చుకోవచ్చు.. అయితే!

— బి ఎస్ రాములు

తెలంగాణ తల్లి పై నాకు కాపీ రైట్ హక్కు లేదు. పలువురి సూచనలతో తెలంగాణ తల్లి రూపొందించబడింది. మొదట గ్రామీణ తల్లి రూపమే రూపొందించ జేసీను. అది పిరజాతంత్ర వార పత్రికలో ముఖ చిత్రంగా వెలువడింది. మెమెంటోలకు క్యాలెండర్లకు విస్తరించింది. భరత మాత రాజ మాత. దేవతలకు రాజమాతలకు కిరీటాలున్నట్టుగానే

భరత మాతకు కిరీటం ఉంది. భరత మాత ముద్దు బిడ్డ అయిన తెలంగాణ తల్లి కూడ రాజమాత కనక కిరీటం ఉండాలనే చర్చ జరిగింది. అలా రాజనీతిగా సకల హంగులతో తెలంగాణ నగలు బట్టలు మట్టెలు, కొహినూర్ వజ్రం జాకోబు వజ్రం వడ్డాణం, మక్క కంతులు, బతుకమ్మ , వెండి కడెం అనిని తెలంగాణ సంస్కృతి చిహ్నంగా బతుకమ్మ తల్లి కి ప్రతి రూపంగా సమన్వయం చేయడం జరిగింది. ఆకు పచ్చ చీరతో కాంతులీనిన తెలంగాణ తల్లి రూప కల్పనలో. చివరి ఘట్టంలో వచ్చి ఆలె నరేంద్ర

భరత మాత ముద్దు బిడ్డ కనక తెలంగాణ తల్లి చీర కూడ అదే విధంగా వుంటే బాగుంుందన్నారు. ఆ ప్రతిపాదన మిగతా వారు మౌనంగా ఆమోదించారు. తొలుత పెద్ద సైజు క్యాలండర్లు వేయించాను.

కియాలండర్ లో వున్న విధంగా విగ్రహం కష్టం అని కొంత ఎత్తు తగ్గించి ఊరూరా ఒకే సైజు విగ్రహాలు పెట్టుకోవడం జరిగింది. గోదావరి ఖని బస్టాండ్ ఎదుట నేను అనుకున్న సైజులో విగ్రహం చేయించి ఆవిష్కరింప జేయడం జరిగింది. ఆ తరువాత తెలుగు యూనివర్సిటీ ఆవరణలో

ఆ విధంగా విగ్రహం రూపొందించడం జరిగింది. గ్రామీణ తల్లి రూపంతో తొలి విగ్రహం బేగం పేట అనే గ్రామంలో. యువకులు పెట్టారు. విజయశాంతి చేత ఆవిష్కరింప చేసారు.

తెలంగాణ తల్లి ఫ్లెక్సి బ్యానర్లు వేసి ప్రదర్శించి నపుడు కొందరు కొన్ని అభ్యంతరాలు వెలిబుచ్చారు. మా లంబడ తల్లి లా వుండాలన్నారు. మా అమ్మ వలె వుండాలి గదనే అన్నాడు గద్దర్. రైతు బిడ్డలా వుండాలన్నారు. ఎవరికి నచ్చినట్టు వారు చిత్రించి మా తెలంగాణ తల్లి అని రాసుకోండి. కులానికొక తల్లి కూడా పెట్టుకోవచ్చు. అయితే రాజ మాత గా తెలంగాణ తల్లి ఎవరి తల్లిలా వుండదు. దేవతలలో దేవత వలె కాజకురీటంతో వెలుగొందుతుంది. తెలంగాణ తల్లి గద్దరి తల్లిలా వుండదు. పాశం సాదగిరి తల్లిలా వుండదు. ఏలె సక్ష్మణ్, వైకుంఠం, కాపు రాజయ్య వేసిన గ్రామీణ అమాయక తల్లి లా వుండదు. తెలంగాణ తల్లి ఒక రాజ మాత. మన దేవతల వలె ఒక పవిత్ర్ర భావన కలిగే దేవతా రూపం. దేవతల బొమ్మలన్నీ 30 ఏళ్ల వయసులో నేవుంటాయి. అమృతం తాగారు కనక వారికి వృద్దాప్యం లేదు. ఆధునిక కాలంలో కూడ 20 ఏళ్లకు పెళ్లయితే 26 ఏళ్లకు ఇద్దరు పిల్లలతు జన్మనిచ్చిన తల్లి అవుతుంది. అందువల్ల గద్దర్ తల్లిలా వుండదు , గద్దర్ కూతురు ా. ుంటుంది అని వివరించాను. భిన్నాభిప్రాయాల్లో ఇవి కొన్ని. కొందరు తెలంగాణ తల్లికి మట్టెలు మంగళ సూత్రం పెట్టారు భర్త ఎవరు అని ప్రశ్నించిన వారు లేక పోలేదు. ఎల్లమ్మ ఫోషమ్మ మొదలైన మాతృ దేవతలకు పూజలు చేస్తాము. తెలంగాణ తల్లి కూడ ఒక మాతృదేవత. మన బతుకమ్మ నెత్తకున్న మన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక.

అని చెప్పడం జరిగింది.

తెలంగాతల్లిని మార్చు కోవాలంటున్నారు.

ఇది ఇక్కడితో ఆగి పోతుందనుకోకూడదు.

తల్లులను ఎప్పటికప్పుడు మార్చుకునే సంస్కృతికి బీజం వేసిన వారవుతారు. తన తల్ల్లి రూపం బాగా లేదని పిల్లలు భావించి తమ తల్లిని మార్చుకోవాలనే ఆలోచన కలిగితే ఆ తల్లి మనసు ఎంత క్షోభిస్తుందో! అది ఎక్కడికి దారి తీస్తుందో! తెలంగా తల్లి ఇపుడొక అమూర్త భావన కాదు నిర్దిష్ట రూపంతో వెలసిన తల్లి అని మరిచి పోరాదు.

తెలంగాణ తల్లి రూపం మార్చాలనే ఆలోచన రాజకీయంగా విపక్షాలకు ఉద్యమాలు చేయడానికి ఆయుధాలు అందించిన వారవుతారు. కిరీటం తొలగిస్తే రాజ్యాధికారం పడి పోయిన తల్లి గా కనిపించవచ్చు. రూపం మార్చితే మా తల్లి వలె లేదనే వారు ఆందోళన చేయ వచ్చు. తల్లి అనే సెంటు మెంటు తో కూడుకున్న వ్యవహారం. పాత విగ్రహాలు తొలగిస్తే అంబేద్కర్ విగ్రహం ను అగౌరవ పరిస్తే కదిలినట్టు ప్రజలు పెద్ద ఎత్తున విరుచుక పడ వచ్చు. చేయ వలసిన అర్జంటు పనులెన్నే వున్నాయి. వాటన్నిటిని వ్యాసాసాల్లో లేఖల్లో సూచించాను. నిరద్యోగ సమస్య, శిథిలమవుతున్న విద్యారంగం, గ్రామీణులకు స్థానికంగా ఉపాొధి కల్పన వంటి వాటి పై కృషి చేసి ప్రజల మన్నన పొందడం అవసరం. విషయాలు వివరించాను. ముందే చెప్పినట్టు తెలంగాణ తల్లి నాకు కాపీ రైట్ హక్కు లేదు. తెలంగాణ తల్లి మనందరి తల్లి. ఎలా వున్నా తల్లి తల్లే.

Read More
Next Story