
ఇరాన్ దాడితో ఇజ్రాయెల్ అణు కర్మాగారం దగ్గర దెబ్బతిన్న భవనాలు
ట్రంప్ విరామం ప్రకటించడం నమ్మలేకపోతున్నారా?
ఇరాన్ దాడులతో తోకముడిచిన అమెరికా
ఇరాన్ పై చేస్తున్న దాడులకు హాఠాత్తుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విరామం ప్రకటించారు. ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, ఇంధన కేంద్రాలపై దాడులు చేస్తామని వెంటనే హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేయాలని హూంకారం చేసిన ట్రంప్ వెంటనే వెనక్కి తగ్గారు.
ఆకస్మిక నిర్ణయాలు తీసుకోవడం వెంటనే వెనక్కి తగ్గే అలవాటు ట్రంప్ కు ఉంది. ఆయన చరిత్ర తెలిసిన వారికి ఇదేమీ ఆశ్చర్యం అనిపించదు. ఈ ఐదు రోజుల విరామం ప్రకటనలో ఒక బిలియన్ (లేదా ట్రిలియన్) డాలర్ల ప్రశ్న ఉంది. ఇది తాత్కాలిక విరామమా? దీర్ఘకాలిక ముగింపు వైపు ప్రయాణిస్తుందా? అనేది చూడాలి.
కాకపోతే ఈ విరామం ఎక్కువగా దీర్ఘకాలిక శాంతివైపే ప్రయాణించే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే, ఇరాన్‌పై గత నాలుగు వారాలుగా జరిపిన సైనిక దాడులలో అమెరికా, ఇజ్రాయెల్‌లు ఇప్పటివరకు గుర్తించదగిన ప్రయోజనాలేవీ సాధించలేదు.
ఇరాన్ ప్రతీకార చర్యలు కొనసాగిస్తుందా?
అమెరికా మద్దతుదారులు తప్ప ఎవరూ ఈ దాడులను ఇప్పటి వరకూ సమర్థించలేదు. యుద్ధం చేస్తున్న దేశాల లక్ష్యాలు స్పష్టంగా లేవు. యుద్ధం ప్రారంభించడానికి ముందు ఇరాన్ పై ఎలాంటి ప్రాథమిక లక్ష్యాలు లేకుండానే దాడులకు దిగినట్లు తేటతేల్లం అయింది. కేవలం నాయకుడిని హతమారిస్తే పాలన కుప్పకూలుతుందని, ఇరాన్ తమ హస్తగతం అవుతుందని భావించారు. కానీ ఇది అనుకున్నట్లు జరగలేదు.
ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొస్సాద్, అమెరికా గూఢచారులు ఈ రెండు దేశాలకు సమాచారాన్ని పూర్తిగా అందించారని నమ్మారు. ఆ సమాచారం ప్రకారం, ఆర్థిక ఆంక్షల కారణంగా ఇరాన్‌లోని ఇస్లామిక్ పాలన బలహీనపడింది. దేశంపై దాడి చేస్తే దానిని కూలదోయవచ్చు.
ఈ అంచనాలు, ప్రకటనలకు విరుద్ధంగా, అమెరికా, ఇజ్రాయెల్ ఊహించిన విధంగా ఈ దాడులు జరగలేదు. ఇరాన్ సర్వోన్నత నాయకుడు, అయతోల్లా అలీ ఖమేనీ హత్యకు గురయ్యారు, కానీ దానివల్ల ఎలాంటి మార్పు రాలేదు. ఇరాన్ పరిపాలన, సైనిక ఉన్నతాధికారుల వరుస హత్యలు కూడా అలాగే జరిగాయి. కానీ వారి స్థానంలో వెంటనే కొత్తవారిని నియమించారు. అమెరికా, ఇజ్రాయెల్ టెహ్రాన్ ప్రతీకారం కొనసాగించింది. ఇది అగ్రరాజ్యం అమెరికా ఎంతమాత్రం ఊహించని విషయం.
అరబ్ దేశాల అజాగ్రత్త..
ఓ సామెత చెప్పినట్లుగా, రెండు ఏనుగుల మధ్య పోరాటంలో, కింద ఉన్న గడ్డి నలిగిపోతుంది. ఇప్పుడు అరబ్ దేశాల పరిస్థితి అలాగే ఉంది. అమెరికా, ఇజ్రాయెల్ తమ దేశంపై దాడి చేస్తే అమెరికా ఆశ్రయం ఇచ్చిన గల్ప్ దేశాలపై ఇరాన్ ఎదురుదాడికి దిగింది. ఇందులో కువైట్, ఖతార్, ఒమన్, యూఏఈ, సౌదీ లాంటి సంపన్నదేశాలు ఉన్నాయి. ఏ ఒక్కరిని అది విడిచిపెట్టలేదు.
గల్ఫ్ దేశాలకు అమెరికా తన ఆయుధ "రక్షణ గొడుగు"ను అందిచినప్పటికీ, అది కేవలం ఒక భ్రమ మాత్రమే అని గల్ప్ దేశాలకు అర్థం అయింది. ఇదే సమయంలో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ గల్ప్ దేశాల ప్రతినిధులతో మాట్లాడుతూ.. తమకు వారిపై ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదని దౌత్యం నడుపుతున్నారు. కేవలం అమెరికా ప్రయోజనాలను మాత్రమే దెబ్బతీస్తున్నామని చెప్పారు.
ఇరాన్‌పై సైనిక దాడులు ప్రారంభమైన ఫిబ్రవరి 28 నుంచి గత నాలుగు వారాలుగా, ప్రతి దేశం ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని ట్రంప్ తో పాటు ఇరాన్‌లను అభ్యర్థించింది. స్పష్టంగా, వారు దాడుల నుంచి వెనక్కి తగ్గమని అమెరికాపై ఒత్తిడి తెస్తున్నారు.
ఇది అమెరికా విస్మరించలేని ఒత్తిడి. ఇరాన్ - ఖతార్ సంయుక్తంగా పంచుకుంటున్న సౌత్ పార్స్ గ్యాస్ కేంద్రంపై ఇజ్రాయెల్ దాడి చేయడం చివరి అంకం. ఈ దాడులతో దోహా దిగ్భ్రాంతికి గురైంది. పరిస్థితిని మరింత దిగజార్చేలా, ఖతార్ ఇంధన వనరులలో కిరీటంలో రత్నం వంటి రాస్ లఫాన్‌పై దాడి చేసి ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంది. ఇది అమెరికా - ఇజ్రాయెల్ మధ్య మొదటి పెద్ద విభేదానికి కారణమైంది. ట్రంప్ ఈ దాడి నుంచి తన చేతులు దులుపుకుని, ఇరాన్ గ్యాస్ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవద్దని నెతన్యాహును ఆదేశించారు.
ట్రంప్ గడువు
హార్ముజ్ జలసంధిని విడిపించకపోతే ఇరాన్ ఇంధన నెట్‌వర్క్‌పై దాడి చేస్తామని ట్రంప్ విధించిన గడువు, బెదిరింపులు మరింత ఆందోళనను కలిగించాయి. గల్ఫ్ దేశాల్లోని అమెరికాకు చెందిన అన్ని ఇంధన మౌలిక సదుపాయాలను, అలాగే ఆ ప్రాంతానికి జీవనాధారమైన ఉప్పునీటి శుద్ధి కర్మాగారాలను కూడా పేల్చివేస్తామని ఇరాన్ హెచ్చరించింది.
సోమవారం (మార్చి 23) గడువు తేదీ కావడంతో ప్రపంచం మొత్తం ఉత్కంఠతో చూస్తుండగా, ట్రంప్ వెనక్కి తగ్గారు. ఆయన బెదిరింపును ముందుకు తీసుకెళ్లి ఉంటే, అది మొత్తం ప్రాంతానికి విపత్తును తెచ్చిపెట్టి ఉండేది. అందువల్ల, ప్రళయాన్ని నివారించాలంటే ఈ యుద్ధం ముందుకు సాగడానికి మార్గం లేదు కాబట్టి, ట్రంప్ తీసుకున్న ఈ విరామం శాశ్వతంగా ఉండాల్సిందే.
యూరప్‌లోని తన మిత్రదేశాలు రంగంలోకి దిగి అమెరికాకు కొంత ఊపిరి పీల్చుకునే అవకాశం ఇస్తాయని ట్రంప్ లెక్కగట్టినట్లయితే, అది జరగలేదు. తమది కాని యుద్ధంలో పాలుపంచుకోవడానికి నిరాకరించిన తన నాటో మిత్రదేశాలను, ఇతర స్నేహపూర్వక దేశాలను అమెరికా అధ్యక్షుడు బహిరంగంగా విమర్శించారు. కానీ ఆయన ఎంత చేసిన అవి మాత్రం ముందుకు కదలలేదు. దాంతో ఆయన తాను ఒంటరిగా మిగిలినట్లు అర్థం చేసుకున్నారు. ట్రంప్ "విరామం" వెనుక ఇది కూడా ఒక కారణం కావచ్చు.
ఇరాన్ సామర్థ్యాన్ని తప్పుగా అంచనా వేసినట్లు కనిపించిన ఇజ్రాయెల్ విషయానికొస్తే, అమెరికాతో కలిసి వారు ప్రారంభించిన సైనిక దాడులే దాని తలరాతగా మారాయి. ఒకవైపు, ఇజ్రాయెల్‌పై ఇరాన్ జరిపిన ప్రతీకార దాడులు, దేశాన్ని లక్ష్యంగా చేసుకున్న ఏ క్షిపణినైనా నిర్వీర్యం చేస్తుందని చెప్పుకున్న యూదు దేశపు 'ఐరన్ డోమ్' రక్షణ వ్యవస్థలోని లోపాలను బట్టబయలు చేశాయి.
"ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ": వ్యర్థ ప్రయత్నం.
ఇజ్రాయెల్ సైనిక అధికారులు, ఐరన్ డోమ్ వ్యవస్థలో ఎక్కడ పొరపాటు జరిగిందో తెలుసుకోవడానికి తమ రక్షణ వ్యవస్థలపై ఆడిట్ చేపడుతున్నట్లు తెలిపారు. ఇజ్రాయెల్‌కు ఇది పెద్ద దెబ్బ. ప్రపంచ ఆయుధ మార్కెట్‌లో వారి క్షిపణి నిరోధక వ్యవస్థ ప్రతిష్ట దెబ్బతింది. సైనికంగా తమను ఎవరూ ఏమీ చేయలేరన్న వారి అహంకారపూరిత నమ్మకం కూలిపోయింది, వారి "రహస్య" డిమోనా అణు కర్మాగారంపై దాడి జరగడానికి ఇరాన్ సిద్ధపడింది.
ఇరాన్‌పై దాడి చేసినందుకు ఇజ్రాయెల్ ప్రభుత్వానికి ఒరిగిందేమీ మిగల్లేదు. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడులు ఇరాన్‌లోని పౌరులపై తీవ్ర ప్రభావం చూపాయనడంలో సందేహం లేదు. ఆసుపత్రులు, పాఠశాలలు, మాల్స్ దెబ్బతిన్నాయి.
కొన్ని వేల మంది మరణించగా, వందలాది మంది గాయపడ్డారు. ఇన్ని జరిగినా, ఎదురుదాడి చేయాలన్న ఇరాన్ ఆత్రుత తగ్గలేదు. బహుశా ఇదే ట్రంప్‌ను వెనక్కి తగ్గేలా చేసి ఉండవచ్చు. ముఖ్యంగా, ఇటీవలే యుద్ధాన్ని "ముగించడం" గురించి మాట్లాడిన తర్వాత ట్రంప్ ఈ ఐదు రోజుల విరామం ప్రకటించారు, కాబట్టి శాంతి అనేది తార్కికంగా తదుపరి అడుగుగా కనిపిస్తోంది.
అయినప్పటికీ, ఇరాన్ విద్యుత్ గ్రిడ్‌పై దాడి చేస్తామన్న బెదిరింపును అమలు చేయడానికి ముందు, సైనికంగా తనను తాను సిద్ధం చేసుకోవడానికి అమెరికా తీసుకున్న ఒక వ్యూహాత్మక చర్య మాత్రమే ట్రంప్ విరామం అయ్యే అవకాశం ఉంది.
ట్రంప్ విశ్వసనీయత ఎంతగా ఉందంటే, ఆయన మాటల అసలు అర్థాన్ని నమ్మే సాహసం ఎవరూ చేయలేరు. ట్రంప్‌ను తక్కువ అంచనా వేయలేనప్పటికీ, మళ్లీ దాడి చేసే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే, "ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ" అని పిలవబడేది ఎప్పుడూ ఒక వ్యర్థ ప్రయత్నమేనని ఆయన కూడా బహుశా ఇప్పటికి గ్రహించి ఉంటారు.
Next Story

