బహుళ పార్టీల ప్రభుత్వాలను స్వాగతించాలి
x

బహుళ పార్టీల ప్రభుత్వాలను స్వాగతించాలి

ఏక పార్టీ ప్రభుత్వాలు భారీ పారిశ్రామిక వేత్తల, జాతీయ దళారీ వర్గాల కనుసన్నలలో సాగుతాయి. బహుళ పార్టీ ప్రభుత్వాలు స్థానిక, ప్రాంతీయ, జాతీయ పారిశ్రామిక వేత్తల ప్రయోజనాలకు ప్రాధాన్యత నిస్తాయి.


1947 లో నెహ్రూ తొలుత జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పరిచారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్, జన సంఘ్ మూల పురుషుడైన శ్యామ్ ప్రకాశ్ ముఖర్జీ, కృపలానీ మరికొందరు సోషలిస్టులను కలుపుకొని నడిచారు. 1967 నుండి ఇతర పార్టీల మద్దతుతో కేంద్ర ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. ఇవి ఆయా ప్రాంతాల , భాషా ప్రజల ఆకాంక్షలకు, భారత రాజ్యాంగంలోని ఫెడరల్ స్వభావానికి నిదర్శనం.

ఫజల్ అలీ కమిషన్ చేసిన నష్టాలు.

రాష్ట్రాల పునర్ విభజించాలని ఏర్పాటు చేసిన ఫజల్ అలీ కమిషన్ నివేదిక తెచ్చి పెట్టిన కష్టాలు నష్టాలు, పర్యవసానంగా సాగిన సంఘర్షణలు ఇన్నీ అన్నీ కావు. ఆదివాసీ గిరిజన ప్రాంతాల ప్రత్యేకతను గుర్తించకుండా ఆయా రాష్ట్రాలలో సరిహద్దులుగా కలిపారు. జాతీయోద్యమ కాలంలో పాలకులకు వ్యతిరేకంగా స్వయం ప్రతిపత్తి కోసం చేసిన 170 తిరుగుబాట్ల చరిత్రను మరిచారు. భాష ఒకటే అనే పేరిట అసమానతల ప్రాంతాలను దబ్బనంతో కుట్టారు.

నాడు 15 కోట్లు నేడు 32 కోట్లు జనాభా గల అమెరికాలో 56 రాష్ట్రాలున్నాయి. నాడు 30 కోట్లు నేడు 140 కోట్లున్న ఇండ్యాలో 14 రాష్ట్రాలు చాలు అనుకోవడమే ఒక పెద్ద పొరపాటు. 565 సంస్థానాలను, నైజాం, కాశ్మీర్, గోవా, పుదుచ్చేరి రాజ్యాలను బ్రిటిష్, ఫ్రెంచ్ పాలిత ప్రాంతాలను ⁠ఫజల్ అలీ కమిషన్ సూచనలతో 14 రాష్ట్రాలుగా మార్చినంత సులభంగా సంస్కృతులు భాషలు ఆకాంక్షలు మారవు. అసలా ఏర్పాటు వల్లే అనేక సంఘర్షణ లు , అసమానతలు, అంతర్గతవలసలు,, వలస వాదాలు పెరిగాయి. అనేక ఉద్యమాలతో 29 రాష్ట్రాలయ్యాయి. . ఇంకా 15 ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు సాగుతున్నాయి. ఉత్తర ప్రదేశ్ ను 8 రాష్ట్రాలుగా, బిహార్ ను 5 రాష్ట్రాలుగా, మధ్య ప్రదేశ్ ను నాలుగు రాష్ట్రాలుగా, మహరాష్ట్రను 5 రాష్ట్రాలుగా ఏర్పాటు చేయాల్సివుండగా కలిపి కుట్టారు. శతాబ్దాలుగా కొనసాగిన గోండ్వానా , విదర్భ, నాగపూర్ రాష్ట్రాలు, నైజాం రాజ్యం అస్తిత్వం లేకుండా చేశారు. దేశం అసమ అభివృద్దికి అంతర్గత వలసాధిపత్య దోపిడి అణిచివేతలకు వివక్షకు వెలివేతకు మూల భూతమయ్యారు. అధిక పార్లమెంటు సీట్లు గల రాష్ట్రాలే కేంద్రంలో చక్రం తిప్పారు.

ఇండియా ఫెడరల్ స్వభావం ప్రత్యేకమైనది

ఇండియా ఫెడరల్ స్వభావం ప్రత్యేకమైనది. అది కుల వ్యవస్థ నిర్మిత సమాజంలో అగ్ర కుల ఆధిక్యత, బహుజన కులాల సాధికారికత అనే రెండు రూపాలు తీసుకున్నాయి. మరోవైపు ఆదివాసీ స్వయం ప్రతిపత్తి ఉద్యమ రూపాలు తీసుకున్నాయి. అలా కేంద్రం , కాంగ్రెస్, బిజెపీ పార్టీల ఇష్టాయిలతో వెరవకుండా ముందుకు నడిచారు. . వారు ప్రాంతీయ శక్తులుగా ఎదిగారు.

అందుకు రకరకాల నినాదాలను సిద్దాంతాలను ముందుకు తెచ్చారు. అలా ఏర్పడుతూ వచ్చినవే ప్రాంతీయ పార్టీలు. నేటికీ అవి తమ వనరులు ఉద్యోగాలు తమకే అంటూ తమ ప్రాంత అభివృద్ధి సంస్కృతి, స్వీయ పరిపాలన, ఆత్మ గౌరవం, స్వేచ్చ సమానత్వం , స్వీయ అస్తిత్వం కోసం పెనుగులాడుతున్నాయి. . పోరాడుతున్నాయి. ఇదే క్రమంలో బీసీలు మహిళలు , చిన్న భాషల వారు తమ సంస్కృతుల రక్షణ కోసం , తమ వనరులతో తమ స్వీయ అభివృద్ది కోసం స్వీయ ఆత్మ గౌరవం కోసం తమ స్ఖానిక పార్టీలు స్థాపించుకుని సర్పంచ్ నుండి ఎమ్మెల్యేలే, ఎంపీ దాకా గెలిపించుకుంటున్నారు. ఇవాళఇపుడు దేశంలో 100 కు పార్టీలు పైగా భారత రాజ్యాంగం పరిధిలో ఎన్నికల కమిషన్ గుర్తించి పార్టీలు ప్రజల చేత ఎన్నుకోబడుతున్నాయి. వీటన్నింటిని కాదని దేశ వ్యాప్తంగా ఏక పార్టీ అధికారంలోకి రావాలని కోవడం, మిగతా అందరినీ అణిచి వేయడమే.

బహుళ పార్టీల వ్యవస్థ ప్రజాస్వామ్యానికి నిదర్శనం

నేడు 50 పార్టీలతో ఏర్పడే సంకీర్ణ ప్రభుత్వాలు అని పిలుస్తున్న బహుళ పార్టీ ప్రభుత్వాలు భారత రాజ్యాంగంలో ఫెడరల్ స్వభావానికి, రాష్ట్రాల హక్కులకు, ఆకాంక్షలకు నిదర్శనం. సంకీర్ణ ప్రభుత్వాలను నిజానికి జాతీయ ఫెడరల్ ప్రభుత్వాలు అని పిలవాలి. ప్రాంతీయ పార్టీలు సంకీర్ణ ప్రభుత్వాల్లో కోరేవి ఫెడరల్ విధానంలో తమ ప్రాంత తమ పార్టీ ప్రయోజనాలు . ఇవి రాజ్యాంగం ఫెడరల్ స్వాభావానికి సంబంధించినవి. ఏక పార్టీ ప్రభుత్వాలు ఫెడరల్ రాజ్యాంగం విలువలను సీమితులను కాదని అన్నిటిలో తొచ్చుకు వస్తాయి. నియంతృత్వం చెలాయిస్తాయి. ఇందిర గాంధీ ఎమర్జెన్సీ, బిజేపీ నరేంద్ర మోడీ! కు చేసిన ప్రజా వ్యతిరేక చట్టాలు ఎన్నో! బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు ఏక పార్టీ పాలన నిరాకరించాయి. సంకీర్ణ ఫెడరల్ ప్రభుత్వాల వల్లనే కుల గణన ఒక తొలి అడుగుగా ముందుకు వచ్చింది. ప్రభుత్వాలు ఏకపార్టీ స్థిరత్వంలో పడితే ప్రజలకు కీడు జరుగుతుంది. మార్పు అడ్డగించ బడుతుంది.

మార్పులు వేగవంతం కావడానికి సంఘర్షణ తప్పదు

నిలకడగా సాగే కుల వ్యవస్థలో, మార్పులు వేగవంతం కావడానికి సఘర్షణ తప్పదు. అంబేద్కర్, జ్యోతిరావు ఫూలే, రాజా రామమోహన్ రాయ్ , మార్క్స్ కూడ సంఘర్షణ తప్పదు అని చెప్పిన వారే. అందుకే బీయస్పీ కాన్శీరాం ‘డిస్ట్ర బెన్స్ ఈజ్ అవర్ ఫిలాసఫీ’ అన్నారు. మార్పు కోరేవారు ప్రభుత్వాలు స్థిరంగా ఉంటే గల ప్రమాదాలు గుర్తిస్తారు. డియంకె అన్నాడియంకే ఎన్టీఆర్ హయాంలో కేంద్రం రాష్ట్రాల కనువుగా పని చేయాల్సి వచ్చింది. జయలలిత మద్దతు అనివార్యం కావడం వల్లనే కమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లను పార్లమెంటు ఆమోదించి కోర్టులు జోక్యం చేసుకోకుండా 9 వ షెడ్యూల్ లో చేర్చడం జరిగింది.

ఏకపార్టీ పాలన నియంతృత్వానికి దగ్గరి దారి

పూర్తి మెజారిటీ వుంటే ఏం జరుగుతుందో ఇందిరా గాంధీ పెట్టి ఎమర్జెన్ ీ, అమలు చేసిన నల్ల చట్టాలు, నరేంద్రమోడీ అమిత్ షా ల రెండెడ్ల బండి ఒకే దేశం ఒకే భాష నినాదాలు అనేక నల్ల చట్టాలు నిదర్శనం. దాంతో నేను సరే మంచిదే యూరపులో వలె భాషల వారీగా దేశం సోవియట్ యూనియన్ 13 దేశాలుగా ప్రశాంతంగా విడి పోయినట్టు విడిపోతే సరి! అని స్పష్టం చేశాను. సామ్రజ్య వాదులు అశోకుడు, అక్బర్, ఔరంగ దేబ్, ఆంగ్లేయుల కాలంలో తప్ప భారత ఉపఖండం ఒకే దేశంగా ఒకే పరిపాలనలో ఎన్నడూ లేదు.

ఏక పార్టీ ప్రభుత్వాలు మార్వాడీ గుజరాతీ సేట్లకు జాతీయ ప్రయోజనాల పేరిట రాష్ట్రాల సహజ వనరులను అప్పగిస్తాయి. స్థానిక , ఆయా రాష్ట్రాల పారిశ్రామిక వేత్తలను ఎదగకుండా చేస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఏక పార్టీ ప్రభుత్వాలు భారీ పారిశ్రామిక వేత్తల , జాతీయ దళారీ వర్గాల కనుసన్నలలో సాగుతాయి. బహుళ పార్టీ ప్రభుత్వాలు స్థానిక, ప్రాంతీయ ఆయా రాష్ట్రాల జాతీయ పారిశ్రామిక వేత్తల ప్రయోజనాలకు ప్రాధాన్యత నిస్తాయి.

బహుళ పార్టీ ప్రభుత్వాలు నెహ్రూ కాలం నుంచే ఉన్నాయి

నెహ్రూ కాలం నుండే బహుళ పార్టీ జాతీయ ప్రభుత్వాలు కొనసాగాయి. 1967 నుండి సగం రాష్ట్రాల్లో కాంగ్రెస్ స్థానంలో బహుళ పార్టీలు అధికారంలోకి వచ్చాయి. ఆ తరువాత ఏ పార్టీ కూడా ప్రజా సమస్యలపై గెలిచిన దాఖలాలు లేవు. 1971 లో పాకిస్తాన్ యుద్ధంతో, 1977 లో ఎమర్దెన్సీ వ్యతిరేకతతో, 1984 లో ఇందిర హత్య సానుభూతితో, 1989 లో రాజీవ్ గాందీ సానుభూతితో, 1995లో, 2014, 2019, 2024 రామ జన్మ భూమి జపంతో గెలుచుకుంటూ వచ్చారు. ప్రాంతీయ పార్టీలు కమ ప్రయోజనాలను ముందుకు తెస్తూ గెలుస్తూ వస్తున్నాయి. సహజంగానే వీటీ స్వభావం ఫెడరల్ స్వభావం. భాషలు వేరు. సంస్కృతులు వేరు. అవసరాలు ప్రాధాన్యతలు వేరు. తమ అస్తిత్వం కోసం పోరాటం చేస్తాయి, బేరం చేస్తాయి, కేంద్రం నుండి సాధించుకుంటాసి. ఇలా ఫెడరల్ , బహుళ పార్టీ ప్రభుత్వాలు భారత రాజ్యాంగం మౌలిక లక్ష్యాలతో కనీస కార్యక్రమంతో ముందుకు సాగితే బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు సాధ్యమే . అందుకు 69 శాతం రిజర్వేషన్లు ఆమోదించిన గత ప్రభుత్వాలే నిదర్శనాలు అని మరిచి పోకూడదు

మొదటే చెప్పాల్సిన ముఖ్యాంశం

మొదటే చెప్పాల్సిన ముఖ్యాంశం చివరన గుర్తు చేస్తున్నాను. మన ప్రజా స్వామ్యంలో అన్ని ప్రాంతాలకు , అన్ని సామాజిక వర్గాలకు, యువతకు, రైతులకు, కార్మికులకు, మహిళలకు బీసీలకు, ఉపాధ్యులకు , విద్యావంతులకు సరైన ప్రాతినిధ్యం లభించాలంటే యూరప్ అమెరికా, ఆస్ట్రేలియా, చైనా , రష్యాలలో వలె జనాభా దామాషా ప్రకారం పార్లమెంటులో శాసన సభల్లో సీట్లు పెంచాలి. ఈ దేశ ప్రాతినిధ్యం ప్రకారం చూస్తే 3150 పార్లమెంటు సీట్లుండాలి. చైనాలో 2950 సీట్లున్నాయి. శాసన సభల్లో కూడా ఇలా సీట్లు పెంచుకున్నపుడే

అధికార వికేంద్రీకరణ జరిగి ప్రజలకు ప్రజాస్వామ్యం అందుబాటులోకి వస్తుంది. కేరళలో వలె అందరికి , సరైన ప్రాతినిధ్యం లభిస్తుంది. అంతదాకా డబ్బున్నోల్లదే రాజ్యం. అంతదాకా డబ్బున్న రియల్ ఎస్టేట్, కాంట్రాక్టర్లు , డబ్బున్న పారిశ్రామిక వేత్తలే వెనక వుండి రాజ్యం నడిపిస్తారు.

Read More
Next Story