భారత రాజ్యాంగానికి పునాది ఎట్లా పడిందంటే...
x

భారత రాజ్యాంగానికి పునాది ఎట్లా పడిందంటే...

దేశాన్ని పాలించేందుకు డీలర్లు కాదు, లీడర్లు రావలసి ఉంది అని న్యాయ శాస్త్ర పండితుడు ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ స్వాతంత్య్ర దినం సంర్భంగా రాసిన వ్యాసానికి ఇది ముగింపు



భారతరాజ్యాంగానికి పునాది ఈస్టిండియా కంపెనీలో ఎలా పడిందో ఒక సారి పరిశీలిద్దాం.

ఈస్టిండియా కంపెనీ హాయంలో ఇండియా చట్టం పేరుతో ఇంకో చట్టం వచ్చింది.. దాని పేరు పిట్స్ ఇండియా చట్టం (East India Company Act, 1784). 1858 దాకా ఈ చట్టపు పరిణామాలే మన భారత రాజ్యాంగానికి ప్రాతిపదికగా పునాదిగా నిలబడ్దాయి. ఒక నాటి గ్రేట్ బ్రిటన్ ప్రధాని విలయం పిట్ (William Pitt (28 May 1759 – 23 January 1806)తన ఇండియా చట్ట లక్ష్యాన్ని 1784 జూలై 6న పార్లమెంటులో మాట్లాడుతూ, ‘‘భారతదేశానికీ, ఈస్టిండియా కంపెనీకీ ఏ విధమైన హానీ జరక్కుండా, మేలు చేయడమే ఈ బిల్లు ఉద్దేశ్యం.’ అంటూ వివరించాడు. ఇందులో గమనింపవలసిన విషయాలు మూడు ఉన్నవి. మొదటిది భారతదేశంతో దేశానికి ఉన్న వ్యాపారం. రెండవది ఆ వర్తక సంబంధం ఫలితంగా మనకు లభిస్తున్న సంపద. స్థానిక ప్రజల క్షేమం. వీటి నిర్వహణకూ బ్రిటిష్ రాజ్యాంగానికీ గల సంబంధం.” అని చాలా స్పష్టంగా చక్కగా చెప్పారు.

సుప్రీంకోర్టు స్థాపన చెన్నైలో

1797 తరువాత మూడేళ్లకు చెన్నపట్నంలో ఒక సుప్రీంకోర్టును స్థాపించారు. అందుకో శాసనం చేసారు. అప్పుడే 1807లొ మద్రాస్ బోంబాయ్ గవర్నరులకు కూడా న్యాయస్థానాలు, గవర్నర్ జనరల్కు అధికారాలు ఇచ్చారు. ఆ సమయంలోనే నెపోలియన్ వచ్చాడు. అప్పుడు రేవులకు బ్రిటిష్ వ్యవహారాలు బంద్ అయిపోయినాయి. అప్పుడే 1813న చార్టర్ ఆక్ట్ చేసింది పార్లమెంట్. దాని ఫలితం ఏమంటే భారతదేశంలోని ‘కుంపిణీ’ భూభాగాలపై సర్వాధికారం బ్రిటిష్ రాజుకే లభించింది.

లార్డ్ మెకాలే





లార్డ్ మెకాలే, జేమ్స్ మిల్ కృషి వల్ల 20 ఏళ్ల తరువాత పార్లమెంటు 'భారత రాజ్యాంగం'లో చాలా ముఖ్యమైన మార్పులు చేస్తూ శాసనం చేసింది. లార్డ్ మెకాలే, జేమ్సమిల్ కృషి ఫలితమే ఈ శాసనం. ఈ శాసనం వల్ల కలిగిన మార్పులలో ఒకటి ఈస్టుఇండియాకంపెనీవారు ఇరవై సంవత్సరాలవరకూ బ్రిటిష్ రాజూ, ఆయన వారసుల తరఫున ధర్మకర్తలుగా భారతదేశాన్ని పాలించడానికి జరిగిన ఏర్పాటు. ఇంతకు పూర్వం భారతదేశంతో వ్యాపారం చేయాలంటే ఆ వర్తక కంపెనీ బ్రిటీష్ ప్రభుత్వం నుండి లైసెన్సులు పొందుతూ ఉండాలి.

ఈ 1833 శాసనం ప్రకారం భారతదేశంతో వ్యాపారం చేయాలంటే ఆ వర్తక కంపెనీ బ్రిటీష్ ప్రభుత్వం నుండి లైసెన్సులు పొందవలసిన అవసరం లేకుండాపోయింది. అంటే ఎవరుపడితే వారు యథేచ్ఛగా భారతదేశానికి పోయి వ్యాపారం చేసుకోవచ్చు. 1853 లో పార్లమెంటు మరొక శాసనం ద్వారా వెనుకటి ఏర్పాట్లనే ధ్రువపరుస్తూ కంపెనీ ధర్మకర్తృత్వానికి మాత్రం గడువు అంటూ ఏమీ పెట్టలేదు.

మరో గొప్ప పరిణామం కొత్త శాసనసభ ఏర్పడడమే. 1853 శాసనం భారతదేశంలో ఒక లెజిస్లేటివ్ కౌన్సిలు స్థాపనకు అవకాశం కల్పించింది. ఈ శాసనాన్ని పార్లమెంటు 1853 ఆగస్టు 20వ తేదీన ఆమోదించింది, ఈ శాసనం ప్రకారం బెంగాలుకు ఒక ప్రత్యేక గవర్నరును, సలహాసంఘాన్ని నియమించడానికి వీలుకలిగింది. అలాగే బొంబాయి, బెంగాల్, మద్రాసు రాజధానులు గాక కొత్త రాజధానులను స్థాపించడానికి ఈస్టుఇండియాకంపెనీ డైరెక్టర్లకు ఆధికారం లభించిందని జర్నలిస్టు వివరించారు.

‘‘ఈ శాసనసభను నియమించేందుకు గవర్నరు జనరలుకు అధికారం ఇవ్వవచ్చు. ఈ ఇద్దరు సభ్యులు కూడా కుంపిణీవారి నౌకరీలో ఉన్నవారే కావాలి. అయితే వీరు కేవలం శాసనాలను చేసే సందర్భంలోనే కౌన్సిల్ సమావేశాలకు హాజరవుతూ, వోటు చేయడానికి హక్కు కలిగిఉంటారు. ఇది మన దేశానికి ఏర్పడిన మొదటి చట్టసభ.ఈ సభకు గవర్నరు జనరల్ అధ్యక్షుడు. ఆయనే ఒక ఉపాధ్యక్షుని నియమించవచ్చు’’.

1854వ సంవత్సరంలో పార్లమెంటు చేసిన శాసనమే ఈస్టిండియా కంపెనీకి భారతదేశంపైగల అధికారాలకు సంబంధించిన ఆఖరు శాసనం. ఆ తరువాత ప్రభుత్వ చట్టాలు మొదలైనాయి.

చరిత్రగతి తప్పిన 1857 సిపాయి విప్లవం



ఆ దశలో మన దేశంలో ఒక్కొక్క రాజ్యాన్నీ కబళించింది. అసంతృప్తితో ఉన్న రాజులు కంపెనీకి వ్యతిరేకంగా కత్తిదూశారు. రైతాంగంలో, చేతివృత్తుల వారిలోనూ అసంతృప్తి పేరుకుపోయింది. తమ సొంతదేశంలో తమను చిన్నచూపు చూడటం, భారతీయ సిపాయీలకు తక్కువ వేతనాలు ఇవ్వడమనేది సిపాయీల తిరుగుబాటుకి దారితీసింది. సైన్యంలో కొత్తగా ప్రవేశపెట్టిన కొవ్వు పూతపూసిన కార్ట్రిడ్జిలు ఉపయోగించబోమని మంగళ్‌ పాండే ఎదురుతిరిగాడు. అప్పుడు పెద్ద తిరుగుబాటు మొదలైంది. 1857 మార్చి 29న బారక్‌పూర్‌లో మంగళ్‌ పాండే అనే సిపాయి పూతపూసిన తూటాలను వాడనంటూ అధికారులపై దాడి చేసి, ఒకరిని చంపేయడం వల్ల దాడి తీవ్రమైంది. ఆ తరువాత మంగళ్‌ పాండేను ప్రభుత్వం ఉరితీసింది. మే 10న మీరట్‌ సిపాయీలు, 11న ఢిల్లీ చేరుకున్న సిపాయీలు వృద్ధుడైన బహదూర్‌ షాను తమ నాయకుడిగా ప్రకటించారు. బహదూర్‌ షా ప్రతినిధిగా బఖ్త్‌ఖాన్‌ (ఢిల్లీ), నానాసాహెబ్‌, తాంత్యాతోపే (కాన్పూర్‌), బేగం హజ్రత్‌ మహల్‌ (లక్నో), లక్ష్మీబాయి (ఝాన్సీ), కువర్‌ సింగ్‌ (జగదీశ్‌పూర్‌) బ్రిటిష్‌ వారిపై తిరగబడ్డారు. కాని ఆధునిక ఆయుధాలు, రవాణా సాధనాలు ఉన్నందున తిరుగుబాటుని రెండేండ్లలోపే అణచివేసారు.

విప్లవ విఫలం, ప్రభుత్వ చట్టం

సిపాయి విప్లవం 1857 లో విఫలం కావడంతోనే బ్రిటీష్ పార్లమెంటు భారతదేశంపై ఈస్టిండియా కంపెనీ అధికారానికి స్వస్తి చెప్పింది. 1858 ఆగష్టులో కొత్త ఇండియా ప్రభుత్వ చట్టం తయారైంది. ఈ చట్టం ప్రకారం భారతదేశంపై విక్టోరియా మహారాణికి సర్వాధికారం సంక్రమించింది. ఆమె తరఫున భారతదేశ పరిపాలనను నిర్వహించేందుకు ఒక సెక్రటరీ ఆఫ్ స్టేట్ ను నియమించడానికి ఏర్పాటు చేసింది. అదనంగా, పదిహేనుమంది సభ్యులతో ఒక ఇండియా కౌన్సిలును కూడా ఈ శాసనం ఏర్పాటు చేసింది. ఇందులో ఏడుగురిని ఈస్టిండియా కంపెనీవారూ, మిగతా 8 మందినీ విక్టోరియారాణీ నియమించేవారు. దానిపేరు 'భారత గవర్నరు జనరల్ కౌన్సిల్'. ఈ కౌన్సిల్ సభ్యులకు పార్లమెంటులో పాల్గొనే అధికారం లేదు అని చెబుతూ పండితారాధ్యులవారు తన వ్యాసంలో...

‘‘భారతదేశం నుండి వచ్చే రహస్య ఉత్తరాలను వేటినీ ఈ కౌన్సిలుకు తెలియజేయవలసిన అవసరం లేదు. ఈ కౌన్సిలు నిర్ణయాలను త్రోసిరాజనడానికి ప్రభుత్వ కార్యదర్శికి పూర్తి ఆధికారం ఉంది. భారత దేశాదాయాన్ని ప్రభుత్వ కార్యదర్శి, ఆయన సంఘం తీర్మానించే విధంగా ఖర్చుచేయవలసి ఉంటుంది. ఈ జమాఖర్చుల వివరాలను ఏటా ప్రభుత్వ కార్యదర్శి పార్లమెంటుకు సమర్పించాలి. లోగడ ఈస్టిండియా కంపెనీవారు చేసుకొని ఉన్న ఒడంబడికలనన్నింటినీ బ్రిటిష్ మహారాణి పాలించాలని కూడా ఈ శాసనం నిర్బంధించింది’’.

ఈ చట్టం కింద చార్లెస్ జాన్ కానింగ్ ( ఆయన్ని విస్కౌంట్ కానింగు అని కూడా పిలుస్తారు) భారతదేశానికి మొదటి వైస్రాయిగా, గవర్నర్ జనరలుగా నియమించినట్లు 1858 విక్టోరియా మహారాణి ప్రకటించింది.

వర్ణ వివక్షత రద్దు

వర్ణ వివక్షతను రద్దుచేస్తూ ప్రభుత్వోద్యోగాలకు బ్రిటిష్ పౌరులందరూ సమానార్హులేనని కూడా విక్టోరియా మహారాణి ప్రకటించింది. సంస్థానాధీశులు తమ పరిమితులకు లోబడి, స్థాయికి, హోదాకు తగ్గవు. ఆ తరువాత చేసిన మరొక కీలకమైనది ‘‘భారత ప్రభుత్వం చట్టం 1935’’లో బ్రిటిష్ పార్లమెంట్ చేసింది. ఈ చట్టమే కాలక్రమేణ మన రాజ్యాంగంగా మారింది. ఆ చట్టమే 1947లో సవరించారు.

మాంట్ - ఫర్డ్ సంస్కరణలు (Montagu-Chelmsford)

మాంట్ - ఫర్డ్ సంస్కరణలలో గమనింపదగ్గది 1909 శాసనం. మొదటి దఫా శాసనసభల సభ్యులకు ఎన్నిక పద్ధతి ఈ చట్టం ద్వారానే ఏర్పడింది. ఈ శాసనాన్ని అనుసరించే బెంగాలుకూ, ఇతర లెప్ట్ నెంట్ గవర్నర్ల రాష్ట్రాలకూ కార్యవర్గాలు ఏర్పడినవి. ఈ కార్యవర్గాల సభ్యులు శాసనసభల సభ్యులుగా ఉంటారు. మొదటి పర్యాయం ప్రభుత్వ వ్యవహారాలపై శాసనసభ సభ్యులు ప్రశ్నలు వేయడానికి అధికారం లభించింది కూడా ఈ శాసనం వల్లనే అని కీలకమైన అంశాలను నాగేశ్వరరావుగారు పేర్కొన్నారు.

భారత ఫెడరేషను ఒప్పుకోలేదు.

1919 శాసనం కేవలం ద్వంద్వ ప్రభుత్వాన్నిమాత్రమే ఇచ్చింది. ప్రథమంగా మంత్రివర్గాలు ఏర్పడ్డవి. అయితే ఈ మంత్రులకు ప్రధాన విషయాల్లో అధికారం లేదు. 1935వ సంవత్సరపు చట్టం ఈ ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేసి ఒక విధమైన రాష్ట్ర స్వపరిపాలనాన్ని ఇవ్వడం గొప్ప కార్యక్రమం. భారత ఫెడరేషనుకు ఈ శాసనం చేసిన ఏర్పాట్లు భారత ప్రజలకు సమ్మతం కాలేదు. అందుకే అమలు కాలేదు.

జలియన్ వాలాబాగ్ దురంతం

జలియన్ వాలాబాగ్ దురంతం మన స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో అత్యంత దుర్దిన సంఘటన. జలియన్ వాలాబాగ్ ఉత్తర భారతదేశంలోని అమృత్‌సర్ పట్టణంలో ఒక తోట. 1919 ఏప్రిల్ 13 న బ్రిటీష్ సైనికులు జనరల్ డయ్యర్ సారథ్యంలో ఈ తోటలో సమావేశమైన నిరాయుధులైన స్త్రీ, పురుషులు, పిల్లలపైన విచక్షణారహితంగా కాల్పులను పది నిమిషాలపాటు 1650 రౌండ్లు కాల్పులు జరిపించారు. ఆంగ్ల ప్రభుత్వ లెక్కల ప్రకారం 379 మంది మరణించారు. కాని లెక్కల ప్రకారం 1000 కి చనిపోయారు. రెండువేలమంది తీవ్రంగా గాయపడ్డారు.


మహాకవి శ్రీశ్రీ


ఆ రచన ఈ చరిత్ర మరో కథ దాచేస్తే దాగని సత్యం అని శ్రీశ్రీ అన్నారు.

ఏ దేశచరిత్ర చూచినా ఏమున్నది గర్వకారణం

స్థాపించిన సామ్యాజ్యాలూ, నిర్మించిన కృత్రిమచట్టాల్‌

ఇతరేతర శక్తులు లేస్తే పడిపోయెను పేక మేడలై

పరస్పరం సంఘర్షించిన శక్తులలో చరిత్ర పుట్టెను.

ఇవి కవోయ్‌ చరిత్రసారం

ఇతిహాసపు చీకటి కోణం అట్టడుగున పడి కాన్పించని

కథలన్నీ కావాలిప్పడు! దాచేస్తే దాగని సత్యం



Read More
Next Story