ఈశాన్య రాష్ట్రాలలో చాలాకాలంగా కొనసాగుతున్న తీవ్రవాదం నాగాలది. నిజం చెప్పాలంటే దేశానికి స్వాతంత్య్రం సిద్దించిన తరువాత వీరి సాయుధ పోరు ప్రారంభం అయింది. ఏళ్ల తరబడి భారత సాయుధ బలగాలే లక్ష్యంగా నాగా తీవ్రవాదులు దాడులు చేస్తూ తమ ఉనికిని చాటుకుంటున్నారు. మయన్మార్ ను తమ షెల్టర్ జోన్ గా ఉపయోగించుకుంటూ వస్తున్నారు.
మయన్మార్ లో ఎన్ఎస్సీఎన్- కే(వైఏ)పై డ్రోన్ దాడి, తిరుగుబాటుదారుడు తుయింగాలెంగ్ ముయివా దశాబ్ధాల తరువాత ఇంటికి తిరిగి రావడం, తిరుగుబాటును ఎదుర్కోవడానికి భారత్ ప్రయోగించిన వ్యూహాన్ని హైలైట్ చేస్తున్నాయి.
భారత్ ఇంతకుముందు వివిధ రకాల సాయుధ తిరుగుబాటును ఎదుర్కోవడంలో ఉపయోగించిన దానికి విరుద్దంగా నాగా తిరుగుబాటు గ్రూపులతో ప్రభుత్వం వ్యవహరించింది. నిజానికి భారత్ నాగా గ్రూపులతో చర్చించే సమయంలో భారత వ్యూహాకర్త కౌటిల్యుడు లేదా చాణక్యుడు వ్యూహాలను అనుసరించింది.
అతను తిరుగుబాట్లను అణచడానికి కొన్ని సూత్రాలను ప్రయోగించేవాడు. వాటిలో ‘శం’(సయోధ్య, సంభాషణ), ‘దం’(ద్రవ్య ప్రేరణ, డబ్బు ఆశ ), దండ(బలం) బేధం(విభజించడం) అనే వాటికి ప్రాధాన్యం ఇచ్చాడు. భారత్ ఒక వైపు తిరుగుబాటుదారులతో చర్చలు జరుపుతూనే, చర్చలకు రాకుండా సాయుధ దాడులకే ప్రాధాన్యం ఇస్తున్న నాగా తిరుగుబాటుదారులపై భీకరమైన దాడులు చేస్తోంది.
కొన్ని రోజుల క్రితం భారత భద్రతా దళాలు నాగా ఉగ్రవాదులపై (నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్, ఖప్లాంగ్ వర్గం) మయన్మార్ లోని కీలక స్థావరంపై డ్రోన్ దాడి జరిపి కీలక నేతలను హతమార్చింది.
అక్టోబర్ 16 న నాగా ఉగ్రవాదులు అరుణాచల్ ప్రదేశ్ లోని చాంగ్ లాంగ్ జిల్లాలోని పారామిలిటరీ అస్సాం రైఫిల్స్ గస్తీ బృందంపై దాడి చేశారు. ఇందులో ఏడుగురు జవాన్లు మృత్యువాత పడ్డారు. వీరు దాడి చేసిన రెండు రోజులకే భారత సైన్యం కూడా అనధికారికంగా డ్రోన్ దాడులతో విరుచుకుపడింది.
ముయివా ఇక శత్రువు కాదు..
దీనితరువాత 1997 నుంచి భారత ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్న నాగా తిరుగుబాటుదారుడు తుయింగాలెంగ్ ముయివా తన స్వగ్రామానికి చేరేలా ప్రణాళిక రచించింది. ఆయన నాగా తిరుగుబాటు దళంలో చేరడానికి ముందు తన పూర్వీకుల గ్రామాన్ని విడిచిపెట్టి ఆరు దశాబ్ధాల అవుతోంది. ఈ గ్రామం మణిపూర్ లోని ఉఖ్రుల్ జిల్లాలో ఉంది. తన జన్మస్థలాన్ని సందర్శించడానికి ప్రభుత్వం ఆయనకు అనుమతి ఇచ్చింది.
91 ఏళ్ల ముయివా హెలికాప్టర్ లో ఉఖ్రుల్ పట్టణంలోకి వెళ్లి అక్కడి నుంచి తన స్వస్థలమైన సోమ్ డాల్ గ్రామానికి చేరుకున్నాడు. ఆయనకు గ్రామస్థులు వీరస్వాగతం పలికారు. గతంలో దట్టమైన అడవుల గుండా వందల కిలోమీటర్లు నడిచుకుంటూ వెళ్లిన వ్యక్తి, తాజాగా హెలికాప్టర్ నుంచి దిగుతున్న సమయంలో కుంటుతూ కనిపించాడు. పెరిగిన వయస్సు స్పష్టంగా కనిపిస్తోంది.
ముయివా నాగా తిరుగుబాటు నాయకుడు. తిరుగుబాటుదారుల కోసం 1966 లో శిక్షణ, ఆయుధాల కోసం చైనాకు తన బృందాన్ని నడిపించాడు. భారత ప్రభుత్వంతో నాగా నేషనల్ కౌన్సిల్(ఎన్ఎన్సీ) సంతకం చేయడంతో ఆయన ఆ ఒప్పందం నుంచి ఉల్లంఘించి ఎన్ఎస్సీసీఎన్ ఏర్పాటు చేసి ఉగ్రవాదాన్ని కొనసాగించాడు.
కానీ ఆయన 1997 లో ఢిల్లీతో చర్చలు ప్రారంభించారు. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక 2015 లో ప్రేమ్ వర్క్ ప్రారంభించారు. అయితే పది సంవత్సరాల తరువాత కూడా ఆయన ఈ తుది ఒప్పందంపై ఇంకా సంతకం చేయలేదు.
ఒప్పందం, భాగస్వామ్య సార్వభౌమాధికారం భావనను అర్థం చేసుకోవడంలో తేడాల కారణంగా చర్చలు ముందుకు సాగడం లేదు. కానీ అతను చర్చలు జరుపుతున్నందున, తన పోరాట యోధులను తిరిగి అడవులను తీసుకెళ్లడానికి ఎటువంటి ఆసక్తిని చూపించనందున అతను ఇకపై రాష్ట్రానికి శత్రువు కాదు.
వలస రాజ్యానంతరం భారత్ లో వరుస ప్రభుత్వాలు కౌటిల్యుని రాజ్య నిర్వాహాక సూత్రాలను ఎలా ఉపయోగించుకున్నారో ఇది హైలైట్ చేస్తుంది. సాయుధ వేర్పాటువాద లేదా విప్లవాత్మక ఉద్యమాలను నిర్వహించడంలో ఒప్పించడం, చర్చలకు ప్రాధాన్యం ఇస్తారు.
బల ప్రయోగం మొదటి ఎంపికగా కాకుండా చివరి అంశంగా మాత్రమే ఉపయోగిస్తారు. ప్రధానంగా సాయుధ ఉద్యమాన్ని సుత్తిమెత్తగా కొనసాగడానికి, ప్రభుత్వ చర్చలలో వారిని కొనసాగించడానికి ఈ చర్యను కొనసాగించేవారు.
ఒకే సమయంలో రెండు వర్గాలతో భిన్నంగా వ్యవహరించడం భారత ప్రభుత్వానికే చెల్లింది. ఓ వర్గంతో చర్చలు జరపుతూ.. ఆ సమూహం కే-వైఏ వర్గంతో దండించే వ్యూహాన్ని అవలంభించింది.
ఇది భారత దళాలపై దాడి చేస్తునే ఉంది. 1960 ల నుంచి నాగా తిరుగుబాటు ఉద్యమంలో పదేపదే చీలికలు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం నాగా తిరుగుబాటుదారులలో ఐదు గ్రూపులు ఉన్నాయి. ఈ తిరుగుబాటుదారులను ఉద్యమాన్ని అణచడానికి భారత్ బేధాన్ని కూడా ఉపయోగిస్తునే ఉంది.
ఎన్ఎస్సీఎన్- కే(వైఏ) పై బలప్రయోగం..
అస్సాం రైఫిల్స్ గస్తీ బృందంపై జరిగిన ఆకస్మిక దాడి తరువాత భారత రక్షణ దళాలు సరిహద్దు వెంబడి లాంగ్వా గ్రామానికి ఆనుకుని ఉన్న మయన్మార్ లోని కమ్మోయో గ్రామంపై డ్రోన్ దాడి చేశాయి.
ఈ దాడి ఎన్ఎస్సీఎన్- కే(వైఏ)మేజర్ జనరల్ పియోంగ్ కొన్యాక్ నివాసాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు చెబుతున్నారు. ఈ దాడిలో కొన్యాక్ కుమారుడు, మనవరాలు సహ అనేకమంది ఎన్ఎస్సీఎన్- కే (వైఏ) కార్యకర్తలు మరణించారని, ఆయన భార్య తీవ్రంగా గాయపడ్డారని సమాచారం.
జూలైలోని అస్సాంలోని వేర్పాటువాద యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం(ఉల్పా) ఇండిపెండెంట్ వర్గం మయన్మార్ స్థావరంపై ఇలాంటి డ్రోన్ దాడిలో ఆ గ్రూపు అగ్ర నాయకుడు నయన్ మేధీ, అతని కొంతమంది అంగరక్షకులు మరణించారు.
గత 30 సంవత్సరాలుగా భారత్, మయన్మార్ లోని సాగింగ్ ప్రాంతంలోని ఈశాన్య తిరుగుబాటుదారుల స్థావరంపై క్రమం తప్పకుండా సరిహద్దు కమాండో దాడులను చేపడుతోంది. వీటిలో అరుదుగా సీనియర్ తిరుగుబాటుదారులు మరణించారు.
డ్రోన్ దాడులు ప్రభావవంతంగా ఉన్నాయి.. కానీ డ్రోన్ దాడులు భిన్నంగా ఉంటాయి. అవి అనేక వనరుల నుంచి సేకరించిన నాణ్యమైన నిఘా ఆధారంగా లొంగిపోయిన తిరుగుబాటుదారుల నుంచి తీసుకున్న సమాచారంతో చేసే దాడులు. మయన్మార్ సైన్యం చాలా తిరుగుబాటు గ్రూపులతో పోరాడటంలో బిజీగా ఉండటం, సరిహద్దులోని కొన్ని తిరుగుబాటు స్థావరాలపై భారత్ కు ఆసక్తిగా లేకపోవడంతో ఇవి ఇన్నాళ్లు పేట్రేగి పోతున్నాయి.
కానీ తాజా డ్రోన్ దాడులు తిరుగుబాటుదారులలో భయాన్ని కలిగించి ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మనల్ని ఆకాశం నుంచి ఎవరో గమనిస్తున్నారని కాబట్టి దాక్కోవడానికి స్థలం లేదని డ్రోన్ దాడులు రుజువు చేస్తున్నాయి.
మయన్మార్ లోని ఖప్లాంగ్ గ్రూప్ స్థావరంపై భారత సైన్యం డ్రోన్ దాడులు చేయడం, తరువాత ముయివా తన పూర్వీకుల గ్రామానికి సందర్శనకు రావడం, ఈశాన్య రాష్ట్రాలలోని ఇతర ప్రాంతాలలో అన్ని తిరుగుబాటుదారులకు స్పష్టమైన సంకేతాన్ని పంపుతుంది.
కౌటిల్యుడి వ్యూహం..
భారత ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న ఉల్ఫా, బోడో తిరుగుబాటుదారులు క్రమంగా రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారు. వారు ఎన్నికలల్లో పోటీ చేసి మంత్రులు కావచ్చు. స్వయం ప్రతిపత్తి ప్రాంతాలలో నాయకులుగా చెలామణి కావచ్చు. దీనివల్ల వారికి ప్రభుత్వ నిధులు వస్తాయి. ఇవన్నీ కౌటిల్యుడి వ్యూహంలోని ఓ భాగం.
తిరుగుబాటును ఎదుర్కోవడానికి ప్రధాన వ్యూహం ‘సామ’తో మొదలవుతుంది. తరువాత చర్చలు ప్రారంభించి, అందులోని నకిలీకి ప్రాధాన్యం ఇస్తుంది. మూడో అంశంలో గ్రూపులలో బేధాన్ని ప్రయోగిస్తుంది.
చివరగా సాయుధ గ్రూపు సామర్థ్యాన్ని బలహీనపరుస్తాయి. చివరగా ఒప్పందాల ద్వారా వారిని పూర్తిగా తిరుగుబాటు నుంచి వేరు చేస్తారు. ఇవి రాజకీయాల్లోకి రావడంలో ఉపయోగపడుతున్నాయి.
పోరాటామా.. శాంతా? తిరుగుబాటుదారులదే తుది నిర్ణయం
భారత్ స్వాతంత్య్రం పొందిన తరువాత ప్రారంభమైన ప్రధాన తిరుగుబాటులలో ఈశాన్య రాష్ట్రాలది ప్రధాన పాత్ర. అయితే వీటిని కౌటిల్యుని అర్థశాస్త్ర ని ఉపయోగించి ఢిల్లీ వ్యూహకర్తలు దారికి తేగలిగారు.
ఇక్కడ వారికి ఇచ్చిన సందేశం స్పష్టంగా ఉంది. మీరు రాజ్యంతో పోరాడదలుచుకుంటే మీరు యుద్దతంత్రాలను, నిఫుణులను ఎదుర్కొంటారు. కానీ రాజ్యాంగ పరిమితులతో ఒప్పందం కుదుర్చుకోవాలంటే రాష్ట్రం ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటుంది. ఇనుప పిడికిలి.. వెల్వేట్ ప్యాకెట్.. ఏది కావాలో వారే నిర్ణయించుకోవాల్సిందే తిరుగుబాటుదారులే. రెండు టేబుల్ పైనే ఉన్నాయి.
మావోయిస్టు నాయకుడు మల్లోజుల కోటేశ్వర రావు అలియాస్ కిషన్ జీ పోలీసులతో పోరాడి మరణించాడు. కానీ అతని సోదరుడు వేణుగోపాల్ రావు మాత్రం 60 మంది సాయుధ క్యాడర్ తో లొంగిపోయాడు. ఇక్కడ కూడా వ్యూహం స్పష్టం.
1971 పాకిస్తాన్ వ్యూహానికి భిన్నంగా..
1971 లో పాకిస్తాన్ తూర్పు పాకిస్తాన్ లో ఉన్న లక్షలాది బెంగాలీ ముస్లింలను హత్య చేయడం ద్వారా తమ వ్యతిరేక నిరసనలు సైలెంట్ అవుతాయని పాకిస్తాన్ జనరల్స్ ఊహించారు.
కానీ భారత్ ఇచ్చిన సాయుధ మద్దతు, వ్యూహంతో వారు దేశంలోని సగభాగాన్ని కోల్పోయారు. ఇక్కడ తెలియాల్సిన పాఠం స్పష్టంగా ఉంది. తిరుగుబాటులను సృష్టించే అంతర్గత అసమ్మతి సైనిక చర్య ద్వారా అణచివేయలేము. వాటికి చర్చలు, సయోధ్య ద్వారా మాత్రమే సాధించే రాజకీయ పరిష్కారాలు అవసరం. ఇక్కడ సహనం మాత్రమే బాగా పనిచేస్తుంది.
(ఫెడరల్ అన్ని వైపుల నుంచి అభిప్రాయాలను ప్రచురించడానికి ప్రయత్నిస్తుంది. వ్యాసంలోని సమాచారం, ఆలోచనలు, అభిప్రాయాలు రచయితవి. ఇవి తప్పనిసరిగా ఫెడరల్ అభిప్రాయాలను ప్రతిబింబించవు)