
భారత ప్రధాని మోదీతో టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్
పాకిస్తాన్ తో స్నేహం చేస్తే భారత్ దూరమైందా?
టర్కీతో వ్యాపార సంబంధాలు తెంచుకుంటున్న భారతీయులు
(అనువాదం.. చెప్యాల ప్రవీణ్)
ఇటీవల భారత్- పాకిస్తాన్ మధ్య సాయుధ ఘర్షణలు జరిగాయి. ఈ వివాదంలో రెండు అగ్రదేశాలైన చైనా, అమెరికా ఊహించిన విధంగానే గోడమీద పిల్లివాటం ప్రదర్శించాయి. కానీ ఇక్కడ అడ్డంగా ఇరుక్కుపోయి, జోకర్ గా మారింది మాత్రం టర్కీ.. లేదా తుర్కియే.
నాలుగు రోజుల పాటు జరిగిన సాయుధ ఘర్షణల్లో పాకిస్తాన్ కు టర్కీ ఏకపక్షంగా సైనిక మద్దతను ఇవ్వడంపై భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వ అభిప్రాయాన్నే ప్రతిధ్వనిస్తోంది. ఈ కోపం ఊహించిందే. అయితే టర్కీ తో భారత సంబంధాన్ని పూర్తిగా వెన్నుపోటుగా చాలామంది భారతీయులు భావిస్తున్నారు.
చైనా, అమెరికాపై ఎందుకు లేదు..
అమెరికా నేతృత్వంలోని సైనిక కూటమి నాటోలో సభ్యుడైన టర్కీ బహిరంగంగా పాకిస్తాన్ వైపు నిలిచినందున దాన్ని దోషిగా తేల్చారు. అదే తర్కం చైనా, అమెరికాకు వర్తించదా? ఆచరణాత్మక ప్రయోజనాల కోసం చైనా, పాకిస్తాన్ కు ఊతకర్రను అందిస్తుంది. అయితే దశాబ్ధాలుగా అమెరికా మద్దతు, సంబంధాలు అత్యంత క్లిష్టపరిస్థితుల్లో కూడా ఇస్లామాబాద్ పుట్టి మునగకుండా కాపాడాయి.
ప్రపంచంలోని చాలాదేశాలు తమ విదేశాంగ విధానంలో ఆదర్శాలకు వీలు కల్పిస్తాయి. ఎవరితో పొత్తుపెట్టుకోవాలి. ఎవరికి దూరం జరగాలి అనేది వాస్తవ రాజకీయాల ద్వారా నిర్ణయించుకుంటారు. ఇది అంతర్జాతీయ సంబంధాలకు ఆచరణాత్మక విధానంగా పరిగణిస్తారు.
ఆప్టిక్స్.. ఆచరణాత్మకత
టర్కీ విషయంలో సంబంధాలను తెంచుకునే తీవ్రమైన చర్య పెద్దగా తేడాను కలిగించదు. ఎందుకంటే న్యూఢిల్లీ,అంకార మధ్య పరిమితమైన వాణిజ్య లావాదేవీలు ఉన్నాయి.
కానీ సమస్య ఏమిటంటే పాకిస్తాన్ కు టర్కీ మద్దతు ఇస్తున్నట్లు భారత్ బయటపెట్టి దాని ఆధారంగానే తీవ్రమైన విధాన నిర్ణయం తీసుకోవడం, పాకిస్తాన్ నుంచి దానిని వేరు చేయాలని ప్రపంచానికి చెప్పడానికి భారత్ చాలాకాలంగా తన శాయశక్తులా ప్రయత్నిస్తోంది.
టర్కీతో సంబంధాలు దెబ్బతిన్న సందర్భంలో న్యూఢిల్లీ, ఇస్లామాబాద్ తో సంబంధాలు నెరిపినట్లయితే ప్రమాదం ఏదీ ముంచుకు రాదా?
అంకారాతో సంబంధాలను తెంచుకోవడం అంటే సుత్తితో ఈగను కొట్టడం లాంటిది. కానీ పహల్గామ్ హత్యల తరువాత జాతీయవాదాన్ని నింపడానికి ప్రయత్నిస్తున్న న్యూఢిల్లీకి ఇవి బాగా సరిపోయే చర్యలే.
టర్కీని బహిష్కరించిన భారతీయులు..
ఇటీవల సాయుధ ఘర్షణల విషయంలో టర్కీ- పాకిస్తాన్ స్నేహం పట్ల భారత్ అధికారికంగా వ్యక్తం చేసిన అసహ్యం కారణగా అనేక విశ్వ విద్యాలయాలు తాము టర్కీతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకున్నాయి.
భారత్ లో విమానాశ్రయా గ్రౌండ్ హ్యాండ్లింగ్ ను నిర్వహించే టర్కీకి చెందిన సెలేబీ ఏవియేషన్ భద్రతా ఒప్పందం రద్దు అయింది. టర్కీష్ ఎయిర్ లైన్స్ తో ఉన్న కోడ్ షేర్ ఒప్పందాన్ని రద్దు చేయాలని ఇండిగో ఎయిర్ లైన్స్ పై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.
టర్కీ నుంచి వచ్చే మార్బుల్స్, ఆపిల్స్ కూడా మహారాష్ట్ర మార్కెట్ లోకి రాకుండా వ్యాపారులు స్వయం ప్రకటిత నిషేధం విధించారు. ఈ రెండు దిగుమతుల విలువ 2.84 బిలియన్ డాలర్లు. టర్కీని సందర్శించాలని ప్రణాళిక వేసుకున్న దాదాపు 60 శాతం మంది భారతీయులు తమ ప్రయాణాలను రద్దు చేసుకున్నారని సమాచారం.
భారత్- టర్కీ సంబంధాలు..
భారత్ తో సహ దేశాలు ఒకదానితో ఒకటి విభిన్నమైన విరుద్దమైన సంబంధాలను కలిగి ఉన్నాయి. అంతర్జాతీయ రాజకీయాల్లో ఇది సాధారణమే. ఉక్రెయిన్- రష్యా యుద్దంపై భారత్ వైఖరే తీసుకుంటే.. నరేంద్ర మోదీ ప్రభుత్వం రెండింటితోనూ సంబంధాలను నెరుపుతున్నారు.
కానీ రష్యా తో భారీ మొత్తంలో చమురు కొనుగోలు చేసేవాళ్లం. ఇది కీవ్ ఆగ్రహానికి కారణమైంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్ స్కీ భారత పట్ల తన నిరాశను బహిరంగంగా వ్యక్తం చేశారు. కానీ భారత్ తో సంబంధాలను తెంచుకోవాలని ఉక్రెనియన్లు డిమాండ్ చేస్తున్నారా? ఇప్పటి వరకూ అలాంటివి చూడలేదు.
అదే విధంగా ఇజ్రాయెల్ - పాలస్తీనా సమస్యపై గత మూడు దశాబ్ధాలుగా భారత్, ఇజ్రాయెల్ కు దగ్గరైంది. టెల్ అవీవ్ తో తన సంబంధాలను బలంగా అభివృద్ది చేసుకుంది.
2024 మొదటి అర్థభాగంలో భారత్ 2.34 బిలియన్ డాలర్ల విలువైన ఇజ్రాయెల్ సైనికేతర వస్తువులను దిగుమతి చేసుకుంది. దీనిని వచ్చే దశాబ్దాలలో పదిరెట్లు విస్తరించాలని యోచిస్తోంది.
ఇజ్రాయెల్ సైనిక పరికరాలను దిగుమతి చేసుకునే మొదటి మూడు దేశాలలో భారత్ ఒకటి. 2020-2024 లో ఇజ్రాయెల్ మొత్తం ఎగుమతుల్లో వీటి వాటా 34 శాతం. వీటిలో కొన్ని పాకిస్తాన్ తో జరిగిన సంఘర్షణలో ఉపయోగించారు. గాజాపై జరుగుతున్న దాడుల్లో భారత్, ఇజ్రాయెల్ కు ఆయుధాలను ఎగుమతి చేసినట్లు ప్రపంచ మీడియా తెలిపింది.
పరస్పర విరుద్దమైన సంబంధాలు..
అరబ్ ప్రపంచంలోని కొన్ని దేశాలు, ఇతర ముస్లిం దేశాలు ఇజ్రాయెల్ పట్ల తమ వైఖరిని మార్చుకున్నాయి. వాటి మధ్య ఇప్పటికి గణనీయమైన శత్రుత్వం ఉంది. కానీ ఇవి భారత్- ఇజ్రాయెల్ మధ్య ఉన్న సంబంధంపై బహిరంగం ఆగ్రహానికి దారితీయలేదు.
అలాగే ఇదే సమయంలో సౌదీ అరేబియా, యూఏఈలతో భారత్ సంబంధం విస్తరిస్తోంది. ఇటీవల ఘర్షణలో సౌదీ తమ సాంప్రదాయ మిత్రదేశమైన పాకిస్తాన్ నుంచి కొంతదూరం పాటించినట్లు కనిపిస్తోంది. దీనర్థం.. దాదాపు అరబ్బులతో, యూదులతో ఒకే సమయంలో భోజనంలో కూర్చొంటోంది.
చైనా, పాకిస్తాన్ సంబంధాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. చైనా కూడా భారత్ తోనే సఖ్యతగా ఉంది. ఇటీవల సంఘర్షణ పరిస్థితి కూడా జిన్ పింగ్ ప్రభుత్వాన్ని తీవ్రమైన సందిగ్ధం పడేసి ఉండవచ్చు.
ఒక వైపు తన దోస్త్ ఇస్లామాబాద్ కు మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ మరోవైపు న్యూఢిల్లీని వ్యతిరేకించకూడదు. భారత్ కు, చైనా రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. వీరి ద్వైపాక్షిక వాణిజ్య విలువ 131. 84 బిలియన్ డాలర్లుగా ఉంది.
గమ్మతైన విదేశాంగ విధానం..
విదేశాంగ విధానాలు కాస్త భిన్నంగా సామాన్యులకు అర్థం కానీ విషయంగా ఉంటుంది. ఒకదానికొకటి శత్రుత్వం ఉన్నప్పటికీ ఒకేసారి ఇతర దేశాలతో సంబంధాలు నెరుపుతుంటాయి. టర్కీ లాగానే పాకిస్తాన్, భారత్ ఈ విషయంలో ప్రత్యక్ష ఉదాహారణ. గ్లోబలైజేషన్ కంటే ముందు ఇలా దేశాలతో సంబంధం తెంచుకోవడం సులభంగా ఉండవచ్చేమే కానీ ఇప్పుడు కాదు.
డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలోని అమెరికా, చైనాపై పరస్పర సుంకాలను ప్రకటించింది. బీజింగ్ కూడా భారీగా సుంకాలు విధించడంతో ట్రంప్ దిగివచ్చి సుంకాలను తగ్గించడానికి అంగీకరించారు.
1949 నుంచి ఇజ్రాయెల్ తో సన్నిహిత సంబంధాలను నెరిపిన ఏకైక ముస్లిం దేశం టర్కీ. మిగిలిన అరబ్ ప్రపంచం, ముస్లిం ప్రపంచం టెల్ అవీవ్ తో శత్రుత్వం చూపినప్పుడూ, ఇస్తాంబుల్ మాత్రం వ్యాపారం చేసింది.
పశ్చిమాసియాలోని అరబ్ దేశాలు టర్కీపై కోపంగా ఉండేవి. కానీ ఎవరూ దానితో సంబంధాలను తెంచుకోలేదు. టర్కీ- ఇజ్రాయెల్ సంబంధాలలో లోటుపాట్లు ఉన్నప్పటికీ తమ బంధాన్ని కొనసాగించారు.
అయితే గాజాపై దాడి చేసిన తరువాత నవంబర్ 2023 లో టర్కీ, ఇజ్రాయెల్ మధ్య సంబంధాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఎర్డోగన్ ప్రభుత్వం ఈ మేరకు కఠిన నిర్ణయం తీసుకుంది.
ఎర్డోగాన్ పాలనలో టర్కీ..
మొదటి ప్రపంచ యుద్దం తరువాత ఒట్టోమన్ సామ్రాజ్యం పతనం అయింది. తరువాత ముస్తఫా కెమాల్ అటాతుర్క్ నేతృత్వంలోని టర్కీ తన ఇస్లామిక్ వాతావరణాన్ని విడిచిపెట్టి పశ్చిమ దేశాలు ప్రవచించిన లౌకికవాద దేశంగా మారింది.
2002 లో ఇస్లామిస్ట్ అనుకూల జస్టిస్ అండ్ డెవలప్మెంట్ పార్టీ లేదా ఏకేపీ అధికారంలోకి వచ్చే వరకూ ఇది కొనసాగింది.
అప్పటి నుంచి రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ నాయకత్వంలోని టర్కీ క్రమంగా దాని కఠినమైన లౌకిక రాజకీయాల నుంచి వైదొలిగి ఇస్లామిక్ సమాజం వైపు మొగ్గు చూపింది. ‘‘ఇస్లామో- జాతీయవాద’’ సమూహంగా వర్ణించబడిన ఎర్డోగాన్ నేతృత్వంలోని ఏకేపీ దాని మత సైద్దాంతిక మూలాల ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా దాని మత సైద్దాంతిక మూలల ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా దాని సంబంధాలను నిర్ణయాత్మకంగా పున: సమీక్షించింది.
టర్కీలో ఈ మార్పుకు ఒక పరిణామం ఇస్లామిక్ రిపబ్లిక్ అయిన పాకిస్తాన్ తో దాని సన్నిహిత సంబంధం. కాశ్మీర్ పై ఇస్లామాబాద్ వైఖరికి ఎర్డోగన్ బహిరంగంగా టర్కీని మద్దతుగా నిలబెట్టారు.
ఆసక్తికరంగా 2014 లో టర్కీ అధ్యక్షుడిగా ఎర్డోగన్ ఏకీకరణ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని హిందూత్వ ఆధారిత బీజేపీ అధికారంలోకి రావడంతో సమానంగా ఉంది.
టర్కీ దృష్టి పాకిస్తాన్ కేంద్రంగా లేదు. కానీ ముస్లిం ప్రపంచ నాయకుడిగా తిరిగి ఎదగడానికి ఎర్డోగాన్ చేస్తున్న చర్యల్లో ఇది ఒక భాగం. ఒక విధంగా ఓట్టోమన్ సామ్రాజ్యానికి రాజధానిగా ఉన్నప్పుడూ దాని గతాన్ని పునరుద్ఘాటించడం, అనుకోకుండా జరిగిన ప్రమాదం ఏంటంటే.. భారత్ తో టర్కీ సంబంధాలలో పతనం.
Next Story