‘తుపాకి వదిలేసి వెనుదిరిగిన కామ్రేడ్స్, స్వాగతం’
x

‘తుపాకి వదిలేసి వెనుదిరిగిన కామ్రేడ్స్, స్వాగతం’

కష్ట పడ్డకాడికి చాలు. హృదయ పూర్వక స్వాగతం అంటున్న మాజీ కామ్రేడ్, తత్వవేత్త బిఎస్ రాములు


కష్ట పడ్డకాడికి చాలు. హృదయ పూర్వక స్వాగతం. సమాజానికి విప్లవం అవసరమైతే యువతరాన్ని సమాజమే రూపొందించుకుంటుంది.

సైన్యంలో కొద్ది కాలం పని చేసి రిటైరై పెన్షన్ తీసుకుంటున్నారు. మాజీ సైనికులుగా గౌరవాలు పొందుతున్నారు. విప్లవ జీవితం ఉద్యోగం కాదు. స్వచ్చందంగా చాతనైన పని చాతనైనంత కాలం చేస్తారు. రిలే దస్తీ పరుగు ఇది. ఆ దస్తీ మరొకరు తీసుకొని పరుగెడుతారు. ప్రతిదీ స్వచ్చందమే ఐనపుడు తిట్లు శాపనార్థాలు అనవసరం. చేసిన కృషిని గౌరవిద్దాం.
అనేక ఉద్యమాలకు పురుడు పోసిన విప్లవం
కొందరు కొద్ది రోజులే చేస్తారు. కొందరు నాలాగా 14 ఏళ్లు చేస్తారు. గద్దర్ భిన్నాభిప్రాయాలు కడుపులో దాచుకొని కడ దాకా ఆలింగనం చేసుకున్నాడు. నా లాంటి వాళ్లు ఆ అనుభవాల చైతన్యంతో కొత్త పుంతలు తొక్కారు. భూస్వామ్య వ్యతిరేక పోరాటాలతో ప్రజలు చైతన్య వంతులయ్యారు. భూస్వామ్య ర్గాలు కూడా చైతన్యం పొంది అనేక రంగాల్లో ఎదిగారు. పారిశ్రామిక వేత్తలయ్యారు. తిరిగి మన చేయూతతో తెల గాణ రాష్ట్ర సాధనకు కృషి చేసారు.
కాని ప్రజలు నిర్బంధాలకు తాళలేక సొంత ఊరు వదిలి ఇతర ప్రాంతాలకు, గల్ఫ్ దేశాలకు వలసలు సాగించారు. ఆనాడు ప్రాణాలు తీసే నిర్బంధాలతో ఉద్యమాల నుండి వలసలు సాగాయి. ఆ చైతన్యం ఎక్కడికీ పోలేదు. ఆ విప్లవ చైతన్యమే బీసీ వాదానికి, మావంటి వారి సమగ్ర సామాజిక విప్లవం , సమగ్ర సామాజిక వికాసం,చేస్తే శంకర్ గుహ నియోగిలా చేయాలి
అనే వాదానికి, స్త్రీ వాదానికి మైనారిటీ ముస్లిం వాదానికి, మలి తెలంగాణ ఉద్యమానికి , బుద్దుడు, ఫూలే, అంబేద్కర్లను రీ డిస్కవర్ చేయడానికి వెలుగు నిచ్చింది. చేతనమై ముందుకు సాగింది. విప్లవం మేధం వంటిది. వర్షం కురివ చేట ప్రకృతిలోని వైవిధ్యమంతా మొలకెత్తి పచ్చదనంతో నూరు పూలు వేయి ఆలోచనలు వికసిస్తాయి.
మీకు కోపం రావచ్చు గానీ భావాల నుండి విప్లవం వస్తుంది. భావ విప్లవమే ముందు జరగాలి. అన్ని శ్రేణులలోకి చేరాలి. ఇంకాలి. విత్తనాలు పీల్చు కోవాలి . మొలకెత్తాలి. మహా వృక్షాలవ్వాలి. ఆ క్రమంలో భావాలు భౌతిక శక్తిగా మారుతాయి। అని ముందుకు సాగిన భావ విప్లవ కారుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ తెలంగాణ రాష్ట్ర సాధకుడయ్యారు.
అధికారం లేక పోయినా అధికారాన్ని నడిపించేది భావాలే!
అధికారంలో లేక పోయినా అధికారాన్ని నడిపించేది భావాలే. ఆరెసెస్ అధికారంలో లేక పోయినా అధికారాన్ని నడిపిస్తున్నది. మార్క్సు ఎంగెల్సుకు అధికారం లేక పోయినా ప్రపంచాన్ని నడిపించారు. అంబేద్కర్ కు అధికారం లేక పోయినా భారత రాజ్యాంగం నిర్మించి దేశానికి ప్రపంచానికి బహుళ పార్టీ వ్యవస్థలో భారతీయ తరహా సామ్యవాద వ్యవస్థకు విత్తనాలు చల్లారు. అవి మొల కెత్తుతున్నాయి. ప్రజలందరు కలిసి నడిచిన నాడు ఆయుధాలతో పని ఏమి? మలి తెలంగాణ ఉద్యమం, బంగ్లాదేశ్ తదితర దేశాల ఉద్యమాలు ఇస్తున్న అనుభవాలు స్వీకరించాలి. బౌద్ధం అంబేద్కరిజం, శాంతియుతంగా విస్తరిస్తున్నాయి. వారి అడుగు జాడల్లో నడుస్తున్న వారితో కలిసి నడవాలి. అన్ని గ్రూపుల నాయకత్వాలు రాజీనామా చేసి ప్రజలెన్నుకున్న ప్రతినిధులతో నూతన కమిటీలు నిర్మాణం కావాలి. సీనియర్లు సలహా మండలిగా పరిమితమైతే భవిష్యత్తు బహుజన శ్రామిక, కార్మిక, ఉద్యోగ ఉపాధ్యాయ విద్యార్థి యువజనులు, మహిళలదే!
ప్రజలను వదిలి వెళ్లి పోవడం తప్పు
ప్రజలు ప్రాథమికం . ప్రజలను కాదని ప్రజలను వదిలి అడవుల బాట పట్టారు. మనతో నడిచిన లక్షలాది ప్రజలను గాలికి వదిలేసి పోయారు. అంటే మనకు మన ప్రజల కన్నా తుపాకులు పట్టుకోవడమే గొప్ప అయిపోయింది. ప్రజల న వదిలి
తుపాకులను పట్టుకునే వారు ఎప్పటికైనా ఏకాకులే! అందరిని వదిలి ఏడు శాతం జనాభా ఐన ఆదివాసీ అటవీ ప్రాంతాలకు పరిమితమైతే 93 శాతం ప్రజలలను ఎవరు నడిపించాలి? ఎవరు బాసటగా ఎవరు నిలవాలి. ?
విప్లవం వలస వాదులతో వస్తుందా? స్థానికులతోనా?
అయినా బాధపడకపోతే రాకపోతే ఒకమాట. ఆదివాసులు మనను రమ్మని పిలిచారా? అడవుల్లో రక్షణ బాగుంటుందని మనమే వారి ప్రాంతానికి వెళ్లాము. మనది వలస. వలసవాదుల వల్ల విప్లవం వస్తుందా? వాల్లనుండి అగ్గి పుడితే బిర్సా ముండా,కొనురం భీం వంటి యోధులు పుడుతారు. అలా 167 తిరుగు బాట్లు తమ సొంత నాయకత్వంలో చేశారు. 40 ఏళ్లయినా అలా ఎదిగిన వారేరీ? ఆ ప్రాంత ప్రజలు అభివృద్ది లో మైదాన ప్రాంతాలలో వలె అన్ని రంగాల్లో ఎందుకు ఎదగలేదు? మనం నిజంగా వాల్ల మీద ప్రేమతోనే వాల్ల వద్దకు వెళ్లామా? మన దీర్ఘకాలిక కార్యక్రమం కోసం మనం వలస వెళ్లామా? ఏది నిజమో మనకు తెలుసు.
1948 లో స్టాలిన్ ఏమన్నాడు?
పొరుగున మరో దేశం గానీ సముద్ర తీరంగానీ లేని చోట సాయుధ పోరాటమా? అయితే మరో మాట! మన వ్యూహం తప్పా రైటా అని వెనక్కి తిరిగి చూసుకున్నామా? 1948 లోనే పనికి రాదు పోరాటం విరమించండి అని స్టాలిన్ చెప్పిన మాట ఎందుకు మరిచి పోయారు? సముద్ర తీరం లేదు. పొరుగు దేశం లేదు. ఇండియా కేంద్ర ఫ్రభుత్వం బలమైనది. మీకు రక్షణ గానీ సాయంగానీఅందించడం వీలవదు అన్నాడు స్టాలిన్. 1982-84 లో లో మళ్లీ అదే పెరపాటు పద్మ వ్యూహంలోకి నడిపారు పెద్దాయన కొండపల్లి సీతా రామయ్య.మనం అనేక రాష్ట్రాల గుండా రూపొందించిన కారిడార్ లో ఎక్కడా సముద్ర తీరం లేదు.
చారు జుందార్ ఆలోచన వేరు
చారు మజుందార్ అనుకున్నపుడు సుందర బన్స్ అడవులు ఇతర దేశాల అందుబాటు, సముద్ర తీరం ఉండేవి. మనం వేసిన దారిలో అవేవి? కె యస్ ను పక్కన పెట్టిన తర్వాతైనా ఆ వ్యూహం మారిచుకున్నమా? వారేసిన బాటలో వారేసిన మ్యాపు ప్రకారమే సాగాము. మనం బహిరంగ ఉద్యమాలను వదిలి పూర్తిగా మైదాన ప్రాంతాల ప్రజలను వదిలి వేయడంలో యంసీసీ ప్రతిపాదనలను ఆమోదించడం కారణం కాదా? ఫలితంగా నేటి పరిస్తితి ఏర్పడింది వాస్తవం కాదా?
మహోజ్వల కాలం 1977-84
1977 నుండి 1984 దాకా అన్ని వర్గాల ప్రజలను ముందుకు నడిపిన మహోజ్వల ఘట్టాలను మననం చేసుకోవాలి. అపుడే ఎన్నికల్లో నిలబడుతూ అన్ని ప్రత్యామ్నాయ శక్తులను గ్రూపులను జేఏసీ గా ముందుకు సాగితే అధికారంలోకి రావడం ఎంత సేపు ? వచ్చే అధికారాన్ని వదులుకొని తండ్లాట, నిర్బంధాల పాలు కావడం దేనికి?
ప్రజలు ఓటు విలువను గుర్తించారు
ప్రజలు ఓటు విలువను గుర్తిస్తున్నారు. ఎన్నికల బహిష్కరణ అనే పిలుపు ప్రజలను మనుషులుగా , నిర్ణాయక శక్తిగా గుర్తించ నిరాకరించడమే.
వారి వివేచనను అవమానించే ఈ పిలుపు. ప్రజలకు సర్పంచ్ గా మండల అఝ్యక్షుడుగా , ఎమ్మేల్లేగా అధికారం వస్తుందని మన మాట వినరని ఈర్శ్య అసూయ, ఆధిపత్య వాదనే తప్ప వేరు కాదు.
శాంతియుత భావ జాల ప్రచారంతో రాం మనోహర్ లోహియా 1967 నాటికే ఉత్తర ప్రదేశ్ బిహార్ లలో బహుజనులను అధికారంలోకి తెచ్చి అధికారం రుచి చూపించారు. కాన్షీరాం దేశ రాజకీయాలను ఒక్క నినాదంతో మలుపు తిప్రారు.. ఓట్లు మావి సీట్లు మీవా? అనే నినాదం ప్రజల చైతన్యం పెంచింది. ఓటు విలువ తెలుసుకున్నారు. తమవారిని అధికారం లోకి తెచ్చుకున్నారు.
బీసీ సామాజిక వర్గాలు, మహిళలు ప్రాతినిధ్యం కోరుతున్నారు.
చట్ట సభల్లో అన్ని కంగాల్లో బీసీలకు, మహిళలకు జనాభా దామాషా ప్రాతినిధ్యం కోసం అల్లాడుతున్నారు. భావ విప్లవం సాగిస్తున్నారు. ప్రయివేటీకరణ వల్ల కోట్లాది మంది ఉపాధి కోల్పోయారు. ఉద్యోగ భద్రత పోయింది. ఎనిమిది గంటల పని విధానాన్ని 12 గొమలతు పెంచుతున్నారు. అడిగే వాల్లు లేరని, బలహీన పడ్డారని ఇలా చేస్టపున్నారు. రిజర్వేషన్లతో బీసీ ఎస్సీ ఎస్టీలకు ప్రభుత్వ రంగంలోనే సాధ్యం. జాతీయీకరణ నేటి అవసరం. తన దాకా వస్తే అమెరికా గ్లోబలైజేషన్ ప్రాతిపదిక సూత్రాన్ని వదిలేసి ఎడా పడా పన్నులు పెంచుతున్నారు. కనక వారి చేష్టలతో 1991 నాటి గ్లోబలైజేషన్, ప్రయివేటైజ్షన్, లిబరలైజేషన్ కు కాలం చెల్లింది. నేషనలైజేషన్ దేశ పాలసీ గా మారాలి.
అంబేద్కర్, రామ్మనోహర్, కాన్సీరాం చూపిన బాటలో యసామ్యవాద స్పూర్తితో పిరజల మధ్య పని చేయడానికి సరైన సమయం. మీరంతా మారుతున్న సమాజాన్ని నూతన తరాలను పునరధ్యయనం చేయడం అవసరం. అందుకు హృదయ పూర్వక స్వాగతం. సమాజంలో అభివృద్దిలో విద్య ఉద్యోగ రాజకీయ రంగాలలో వెనక్కి నెట్టేయ బడుతున్న సామాజిక వర్గాల కోసం ఏకమై ముందుకు సాగడం నేటి కర్తవ్యం.


Read More
Next Story