
పశ్చిమాసియా వివాదంతో పాకిస్తాన్ విశ్వగురువుగా మారిందా?
ఈ సీజ్ ఫైర్ ప్రళయానికి విరామం మాత్రమే
పశ్చిమాసియా ఘర్షణ తాత్కాలిక విరామంలో పాకిస్తాన్ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఇరాన్- అమెరికా మధ్య దాదాపు రెండువారాల సీజ్ ఫైర్ ఒప్పందం కుదరడంలో ఇస్లామాబాద్ దౌత్య ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించి విశ్వగురువుగా మారిపోయినట్లు కనిపిస్తోంది.
హార్ముజ్ ను తెరవకపోతే రాత్రిరాత్రే ఒక నాగరికతను మొత్తం నాశనం చేస్తామని ట్రంప్ హెచ్చరిన తరువాత, దీన్ని ఆపడానికి ఎవరో ఒకరు ముందు రాక తప్పని పరిస్థితి నెలకొంది. ఇలా తప్పనిసరి పరిస్థితుల్లోనే పాక్ ముందుకు వచ్చిందని అనుకోవాలి.
మనకు అర్థమయ్యే విధంగా చెప్పుకోవాలంటే ఇప్పుడు ఈ యుద్ధం తాత్కాలిక శాంతి తనవల్లే సాధ్యమయిందని కొన్ని సంవత్సరాల పాటు ఇస్లామాబాద్ ఊదరగొడుతుంది. న్యూయార్క్ టైమ్స్ ప్రకారం ఇందులో చైనా పాత్ర కూడా ఉంది. పాకిస్తాన్ చేసిన కృషికి తెరవెనక చైనా పెట్టిన ఒత్తిడి తోడవడంతో ఇరాన్, అమెరికా రెండు కూడా సీజ్ ఫైర్ కు అంగీకరించింది. కానీ మనం చూసింది కేవలం దౌత్య విజయం మాత్రమే కాదని స్పష్టంగా చెప్పాలి. ప్రళయానికి తాత్కాలిక విరామం మాత్రమే అని గుర్తుంచుకోవాలి.
విరామం.. శాంతి ఒక్కటి కాదు..
పశ్చిమాసియాలోని తమ శత్రుదేశమైన ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా నాలుగు వారాలుగా విరుచుకుపడ్డాయి. పాలన మార్పు చేస్తామని ట్రంప్ గట్టిగా మాట్లాడారు. అక్కడి పౌరులు రోడ్ల మీదకు రావాలని కోరారు. అమెరికా దాడులపై ఇరాన్ కూడా కచ్చితంగా స్పందించాల్సిన స్థితి. మేము చావనైనా చస్తాం కానీ అమెరికాకు లొంగిపోమని తెగెసీ చెప్పి బరిలోకి దిగింది. కారల్ మార్క్స్ చెప్పిన దాని ప్రకారం.. మనుషులు చరిత్రను సృష్టిస్తారు కానీ.. వారు అనుకున్నట్లు కాదు.. ఇరాన్ ఈ యుద్ధాన్ని కోరుకోలేదు. వారిపై యుద్ధం రుద్దబడింది.
ఇప్పుడు యుద్ధానికి రెండువారాల విరామం దొరికింది. కానీ ఇది శాంతి కాదు. ఇస్లామాబాద్ కేంద్రంగా రేపటి నుంచి చర్చలు జరగబోతున్నాయి. ఇది యుద్దాన్ని ముగిస్తుందా లేక మరింత భయంకరమైన యుద్దానికి నాందీ పలుకుందా చూడాలి.
చర్చలలో తాను కోరినట్లుగా అమెరికా నష్టపరిహారానికి అంగీకరిస్తుందా? పశ్చిమాసియాలో తన ఆధిపత్యానికి చెక్ పెట్టే నిర్ణయాలకు ఇజ్రాయెల్ ఒప్పుకుంటుందా? అన్నింటే కంటే ముఖ్యంగా హార్ముజ్ జలసంధి ఎవరి నియంత్రణలో ఉండాలి? ప్రపంచ చమురు రవాణాలో 20 ఈ మార్గం గుండానే వెళ్తుంది. ఈ 52 కిలోమీటర్ల జలమార్గం ఇరాన్ కు వ్యూహాత్మంగా కీలకమైనది. దీని చుట్టూ అమెరికా స్థావరాలు ఉన్నాయి. వీటిపై తాము దాడులు చేయగలమని ఇరాన్ నిరూపించుకుంది. వీటిపై ఇంకా జవాబు లేని ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి.
ఇరు పక్షాలు తాము గెలిచామంటే తామే గెలిచామని చెప్పుకుంటున్నారు. ఇది నిజానికి పిరికితనం మాత్రమే. టెహ్రాన్ వ్యూహాత్మక యుద్ధంలో విజయం సాధించింది. కానీ అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ కీలక నాయకులను హతమార్చాయి. డ్రోన్ స్థావరాలను ధ్వంసం చేశాయి.
ఇరాన్ పది సూత్రాల ప్రతిపాదన..
ఇప్పుడు అసలైన చర్చలు ఇస్లామాబాద్ కేంద్రంగా జరగనున్నాయి. ట్రంప్, తన అనాలోచిత బెదిరింపుల తర్వాత, అకస్మాత్తుగా "ప్రపంచ శాంతికి ఇది ఒక గొప్ప రోజు" అని, జలసంధిలో "రవాణాకు" సాయం చేస్తానని ట్వీట్ చేశారు. ఒక నాగరికతను తుడిచిపెట్టేస్తానని హూంకారాలు చేసిన అదే వ్యక్తి ఇప్పుడు హఠాత్తుగా శాంతి వచనాలు ఎందుకు వల్లిస్తున్నాడు? మరి ఇజ్రాయెల్ సంగతేంటి?
ఇరాన్ అమాయకురాలు కాదు. చైనాలోని దాని రాయబారి ఒకే ఒక్క సరైన మార్గాన్ని సూచించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC), చైనా, రష్యా, పాకిస్తాన్ మద్దతుతో కూడిన నమ్మకమైన, కఠినమైన, అభేద్యమైన భద్రతా హామీ కావాలని కోరుతోంది.
పశ్చిమాసియా నుంచి అమెరికా బలగాలను ఉపసంహరించుకోవాలని, ఆంక్షలను ఎత్తివేయాలని, యుద్ధ నష్టపరిహారాన్ని కోరుతోంది. దాని 10-సూత్రాల ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయినప్పటికీ కొన్ని విషయాలలో అది అమెరికాను నమ్మాలని అనుకోవడం లేదు. ఈ యుద్ధంలో అమెరికాను ముందుకు లాగింది కేవలం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ మాత్రమే. కాబట్టి అమెరికా నుంచి గట్టి హమీలు, ఒప్పందాలు కావాలని అది పట్టుబడుతోంది.
పాకిస్తాన్‌కు కాసేపు వెలుగు చూసే అవకాశం దొరికింది. కానీ ఈ రెండు వారాల విరామాన్ని ఒక సమూల మార్పుగా పొరబడద్దు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇంకా అస్తవ్యస్తంగానే ఉంది. నియమాల ఆధారిత వ్యవస్థ చిన్నాభిన్నమైంది.
చావడానికి నిరాకరించిన ఒక నాగరికత ఇప్పుడు, వాషింగ్టన్ ఎన్నడూ నిజంగా ఇవ్వని ఒకదాన్ని కోరుతోంది. అది కూడా ఇలాంటి ఈ పీడకల పునరావృతం కాదనే హామీ. లొంగిపోవడం అనేది ఎప్పుడూ ఒక ఎంపిక కాదు. అలాగే, నిజమైన శాంతి కూడా ఒక ఎంపిక కాదని తేలింది. కేవలం 15 రోజుల తాత్కాలిక నిలుపుదల మాత్రమే. దీనిని విజయం అని పిలవకండి. దీనిని తృటిలో తప్పించుకోవడం అని పిలవండి. పాకిస్తాన్ చేతిలో తాళాలు కాదు, తలుపు మాత్రమే ఉంది.
(ది ఫెడరల్ అన్ని వర్గాల వారి అభిప్రాయాలను, దృక్కోణాలను అందించడానికి ప్రయత్నిస్తుంది.వ్యాసంలోని సమాచారం, ఆలోచనలు అభిప్రాయాలు రచయితవి మాత్రమే. అవి తప్పనిసరిగా ఫెడరల్ అభిప్రాయాలను ప్రతిబింబించవు)
Next Story

